
సాక్షి, దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్నవారంతా ఎక్కువమంది తెలంగాణకు చెందినవారిగా సమాచారం. హైదరాబాద్ నుంచి 22మంది, వరంగల్ నుంచి 14మంది పాపికొండలు విహార యాత్రకు బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం నుంచి వరంగల్ కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్ సహా పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. అలాగే ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ట్రాక్టర్‌లో దేవీపట్నానికి తరలిస్తున్నారు. ఇక గల్లంతు అయినవారిలో 27మంది సురక్షితంగా బయటపడ్డారు.
మరోవైపు ఈ దుర్ఘటనలో బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై లాంచీ యజమాని వెంకట రమణ మాట్లాడుతూ... కచులూరు వద్ద పెద్ద సుడిగుండం ఉందని , దాన్ని దాటే సమయంలో డ్రైవర్లు సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో రాయల్ వశిష్ఠ పర్యాటక బోటు ఆదివారం ఉదయం మునిగిపోయిన విషయం తెలిసిందే.
ప్రమాదంలో గల్లంతైన హైదరాబాద్ వాసులు
గాంధీ, విశాల్, లక్ష్మణ్, జానకిరామ్, రాజేష్, రఘురామ్, అబ్దుల్ సలీమ్, సాయికుమార్, రఘురామ్, విష్ణుకుమార్, మహేశ్వరరెడ్డి కుటుంబం, ధశరథన్-వరంగల్, రమణ-విశాఖ, జగన్-రాజోలు
చదవండి: రాయల్ వశిష‍్టకు అనుమతి లేదు...
Comments
Please login to add a commentAdd a comment