ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తీరిన సంవత్సరం, ఇది చరిత్రలో నిలిచిపోయే ఏడాది అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో కలిసి ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వాళ్లెందరో ఉన్నారని, చివరకు ఉద్యమ పార్టీకే రాష్ట్ర ప్రజలు పట్టం గట్టారని కర్నె ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి అనేక పథకాలు చేపడతున్నారని, వాటర్ గ్రిడ్, చెరువుల అభివృద్ధి, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన ఆడపిల్లల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు తెచ్చారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని టీడీపీ ఓర్వలేక పోతోందని విమర్శించారు.