సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీని రాష్ట్రానికి తీసుకురావాలని తమకు ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వినతులు వస్తున్నాయని టీ కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. త్వరలోనే తెలంగాణలో సోనియా, రాహుల్‌గాంధీలతో భారీ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం, పొత్తు సంబంధిత అంశాలను తమ హైకమాండ్ చూసుకుంటుందని వారన్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావుతోపాటు నంది ఎల్లయ్య మంగళవారం రాత్రి దిగ్విజయ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన కొందరు ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారే కానీ కాంగ్రెస్ ఏనాడూ అడగలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులెవరూ టీఆర్‌ఎస్ పొత్తు కోరుకోవడం లేదని చెప్పారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపమని ఎద్దేవా చేశారు. కాగా దిగ్విజయ్‌తో సమావేశమయ్యేందుకు కేంద్ర మంత్రి బలరాంనాయక్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, సురేశ్ షెట్కార్, అంజన్‌కుమార్ మిగిలిన ఎంపీలతో కలసి వచ్చారు. దిగ్విజయ్ లేకపోవడంతో కాసేపు ఎదురుచూసి వెనుదిరిగారు. మధ్యాహ్నం సమయంలో దిగ్విజయ్‌తో ఎంపీ కేవీపీ భేటీ అయ్యారు. దిగ్విజయ్‌ను కలసిన వారిలో కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు.
తెలంగాణలో త్వరలో సోనియా, రాహుల్ సభలు
Published Wed, Mar 5 2014 3:30 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement