పోటీపడి మరి బొజ్జున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు | Telangana congress leaders caught sleeping on praty workers meeting | Sakshi
Sakshi News home page

పోటీపడి మరి బొజ్జున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Published Fri, Sep 5 2014 10:04 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

పోటీపడి మరి బొజ్జున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు - Sakshi

పోటీపడి మరి బొజ్జున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

అధికారంతో పాటు 'చేతి' నిండా పనిలేక  లేకపోవటంతో కాంగ్రెస్ నేతలు ఆదమరిచి బొజ్జున్నారు.  ఓ వైపు మెదక్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా గెలిచి తీరాలని  అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే.... మరోవైపు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే కనుకు తీశారు. రాత్రింబవళ్ళు కష్టపడి విజయం సాధిస్తామని  మేడంకి ఇచ్చిన మాటను పక్కన పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నిద్రను ఆపుకోలేక గుర్రుపెట్టారు.

పాపం మేడమ్‌కు ఇచ్చిన మాట ప్రకారం రాత్రిపూట మాత్రమే ప్రచారం చేస్తున్నారో ఏమో... పగలు మాత్రం కునుకు తీస్తున్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరువులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ ఆదమరచి నిద్రపోవటం విశేషం. ఓవైపు సమావేశం జరుగుతున్నా నేతాశ్రీలు మాత్రం నిద్రమత్తులో జోగుతూ కెమెరాకు చిక్కారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement