సోనియాతో వీహెచ్, పాల్వాయి భేటీ
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతురావు, పాల్వాయి గోవర్థన్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
భేటీ అనంతరం పాల్వాయి మీడియాతో మాట్లాడుతూ...ఢిల్లీ నాయకులు గ్రూపులు కట్టడం మానాలన్నారు. కలసిమెలసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని పాల్వాయి ఆరోపించారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన నేతలపై న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు.