సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ సోనియా గాంధీ చేత ప్రమాణం చేయించారు. సోనియా గాంధీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly - elected member Shrimati Sonia Gandhi in the Parliament House.#RajyaSabha @VPIndia @SoniaGandhi_FC @harivansh1956 pic.twitter.com/HdeqVvUUh7
— SansadTV (@sansad_tv) April 4, 2024
మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు.
తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. వద్దిరాజు రవిచంద్ర తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the re- elected member Ravi Chandra Vaddiraju in the Parliament House.#RajyaSabha @VPIndia @vaddirajumprs @harivansh1956 pic.twitter.com/2hCKkYkOAd
— SansadTV (@sansad_tv) April 4, 2024
Comments
Please login to add a commentAdd a comment