'కాంగ్రెస్ పవర్ పోయింది.. ప్రజలకు పవర్ వచ్చింది'
హైదరాబాద్: కాంగ్రెస్ పవర్‌పోవడంతో తెలంగాణ ప్రజలకు పవర్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఆయన బుధవారం కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో జరిగిన టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు కన్వీనర్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ నేతలు అభివృద్ధి నిరోధుకలని ఆయన విమర్శించారు.
గతంలో తెలంగాణ రాకుండ అడ్డుకున్న వారే నేడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ సంకల్పంతో రానున్న 20ఏళ్లు టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.