నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తా: భట్టి | will work for Nava telangana, says Mallu Bhatti vikramarka | Sakshi
Sakshi News home page

నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తా: భట్టి

Published Thu, Mar 13 2014 1:02 AM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తా: భట్టి - Sakshi

నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తా: భట్టి

ఖమ్మం, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పటడం సంతోషకరమని, ఈ ప్రాంతంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని నవ తెలంగాణ నిర్మాణం కోసం మేనిఫెస్టో తయారు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
 
 ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న జిల్లా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టోలో చోటు కల్పిస్తామని చెప్పారు. కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబుతోపాటు తెలంగాణ నేతలతో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అంశాలను అన్నివర్గాల ప్రజలనుంచి సేకరిస్తామని తెలి పారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తామన్నారు.  మున్సిపల్, సార్వత్రిక ఎన్ని కల్లో కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement