ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఏటూరునాగారం: ఓ వైపు గెలిచిన ఆనందం.. మరో వైపు కూతురి ఆత్మహత్య.. ఓ మాతృమూర్తికి ఎదురైన ఈ పరిస్థితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూర్జహాన్ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా పోటీ చేసింది. ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు ఛార్మిల (చేను)ను అదే గ్రామానికి చెందిన షేక్ నయీమ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. పెద్దవెంకటాపురంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న నయీమ్‌కు పంచాయతీ ఎన్నికల డ్యూటీ పడటంతో భూపాలపల్లికి వెళ్లాడు. సోమవారం ఎన్నికల లెక్కింపు జరుగుతుండగా నూర్జాన్‌తోపాటు కుటుంబ సభ్యులంతా చిన్నబోయినపల్లి పాఠశాల వద్దే ఉన్నారు. ఇంటి వద్దే ఉన్న ఛార్మిల ఎవరూ లేనిది చూసి దూలానికి ఉరివేసుకుంది. వార్డు సభ్యురాలిగా గెలుపొందిన నూర్జాన్ కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోదించింది. మృతురాలి ఎడమ చేతిపై తన చావుకు ఎవరూ కారకులు కాదని రాసి ఉంది. ఘటనకు సంబంధించి కారణాలు తెలియరాలేదు.
మృతిచెందిన వార్డు అభ్యర్థి గెలుపు
గార్ల: జ్వరంతో ఆదివారం మృతి చెందిన వార్డు అభ్యర్థి గెలుపొందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం రాజుతండాలో సోమవారం చోటుచేసుకుంది. 3వ వార్డు సభ్యుడు బానోత్ భాస్కర్ సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు గెలిపించి తమ సానుభూతిని చాటారు. ఎంటెక్ పూర్తి చేసి ఖమ్మం జిల్లా కారేపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా భాస్కర్ పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment