jayashankar district
-
నేటి నుంచి ‘మేడిగడ్డ’ బొరియల్లో గ్రౌటింగ్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీ)బ్యారేజీలో ఏర్పడ్డ బొరియల్లో గ్రౌటింగ్ పనులు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను నిర్మాణసంస్థ ఏర్పాటు చేసింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షల ద్వారా 7వ బ్లాక్‌లో మాత్రమే బొరియలు ఏర్పడినట్లు నిర్మాణ సంస్థ ప్రతినిథులు తెలిపారు. దీనికోసం డ్రెడ్జర్ యంత్రాలను బ్లాక్ 7లో ఏర్పాటు చేశారు.19, 20, 21 గేట్ల సమీపంలో ఏర్పడిన బొరియల్లో సోమవారం నుంచి కాంక్రీటు, ఇసుక మిశ్రమాన్ని నింపడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బొరియల్లో మట్టిని నింపి నిషేధిత ప్రాంతంగా సైన్‌బోర్డులు పెట్టారు. గేట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు. 7వ బ్లాక్‌లో మొరాయించిన గేట్లను ఆర్మ్ గ్రౌగింగ్ పరికరంతో కట్ చేసి తొలగిస్తున్నారు. అదే విధంగా ఆ బ్లాక్‌లోని పియర్ల దిగువన 10మీటర్ల లోతు వరకు ఇసుక వరద తాకిడికి తరలిపోకుండా షీట్‌ఫైల్స్ వేయడానికి ఏర్పాట్లు చే«శారు. ఇప్పటికే సీసీ బ్లాక్ పనులు, ఇసుక మేటల తొలగింపు చేపట్టారు. -
విషాదం: బతుకు దెరువు కోసం వచ్చి.. మున్నేరువాగులో గల్లంతు..
సాక్షి, మహబూబాబాద్(వరంగల్) : మానుకోట జిల్లా కేంద్రం శివారులోని మున్నేరువాగులో పడి యువకుడు గల్లంతైన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ (30) బతుకుదెరువు కోసం మానుకోటకు వచ్చాడు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి థియేటర్ వెనుక ప్రాంతంలో నివాసం ఉండే అమ్జద్ వద్ద మార్బుల్ బండలు పరిచే పని చేస్తున్నాడు. కాగా, గురువారం మధ్యాహ్నం సమీప బంధువులు అజీమ్, యాసిన్, ఇర్ఫాన్ మున్నేరువాగు చెక్ డ్యాం సమీపంలోకి చేరుకుని మద్యం సేవించారు. అనంతరం ఇర్ఫాన్ ఈతకొడతానని చెప్పి మున్నేరువాగు నీటి ప్రవాహంలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో యాసిన్ వాగులో దిగి వెతికాడు. ఆచూకి లభ్యంకాకపోవడంతో మరో మిత్రుడు మౌసిన్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పడతోపాటు, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో టౌన్ ఎస్హెచ్ఓ జూపల్లి వెంకటరత్నం, టౌన్ ఎస్సై గాలిబ్, రూరల్ ఎస్సై నగేష్, బ్లూ కోల్ట్స్ పీసీలు వీరన్న, విజయ్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతోపాటు స్థానికులు మున్నేరువాగు నీటిలో ఇర్ఫాన్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇర్ఫాన్ ఆచూకీ లభ్యంకాలేదు. కాగా, ఇర్ఫాన్‌కు భార్య, కుమార్తె ఉండగా ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. చదవండి: లాక్ డౌన్ ఆసరా చేసుకుని .. బావమరిది.. దారి దోపిడీలు.. -
హెలికాప్టర్‌తో రైతులను రక్షించిన రెస్క్యూ బృందం
సాక్షి, జయశంకర్ జిల్లా: టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెస్క్యూ బృందం రక్షించారు. రెస్క్యూ హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఎంపీపీ మల్లారెడ్డి ఫోన్లో సమాచారం అందించారు. రైతులను రక్షించాలంటూ ఆయన తక్షణమే మంత్రి కేటీఆర్‌కు ఫోన్లో వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. ఘటనాస్థలికి హెలికాఫ్టర్ పంపాలని సీఎస్‌తో మాట్లాడారు. తక్షణమే హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేపట్టాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. రైతులు క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పసిపాపపై పైశాచికం
మహాముత్తారం: కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన వారే పసిపిల్లలను వావి వరుసలు మరిచి కాటేస్తున్నారు. వరుసకు పెద్దనాన్న అయ్యే ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోనంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్సం భారతి మంగళవారం రాత్రి తన నాలుగేళ్ల కూతురితో నిద్రిస్తోంది. మధ్యరాత్రి మెలకువ రాగానే పక్కన కూతురు లేకపోవడం, తలుపులు తీసి ఉండటంతో కంగారు పడిన ఆమె.. చుట్టు పక్కల వాళ్లను లేపి వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. బుధవారం తెల్లవారు జామున 7 గంటల సమయంలో గ్రామ సమీప చెట్ల పొదల నుంచి ఏడుపు వినపడటంతో అటువైపు వెళ్లారు. చిన్నారి ఒంటిపై దుస్తులు లేకపోవడం.. ఒంటి నిండా గాయాలు కనిపించాయి. ఎవరు తీసుకొచ్చారని చిన్నారిని అడగ్గా పెదనాన్న అని చెప్పడంతో.. అతడి కోసం వెతుకగా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్తాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో.. మండలంలోని కనుకునూర్‌కు చెందిన కిష్టయ్యతో భారతి వివాహం కాగా అతను చనిపోవడంతో కోనంపేటలో తల్లిగారి ఇంట్లో ఉంటోంది. ఆ సమయంలో నాగారానికి చెందిన ఓదెలుతో పరిచయం ఏర్పడింది. అతనితో సహజీవనం కొనసాగించగా ఒక కూతురు జన్మించింది. నాలుగేళ్ల కూతురితో భారతి తల్లి దగ్గర ఉంటూ కూలీ చేసి జీవనం సాగిస్తోంది. ఓదెలుకు వరుసకు సోదరుడైన కొమురయ్య తరచుగా మద్యం తాగి వచ్చి వారి ఇంట్లోనే నిద్రించేవాడు. ఈ క్రమంలో మంగళవారం మద్యం మత్తులో వచ్చిన కొమురయ్య ఇంటి ముందు నిద్రించినట్లు సమాచారం. అయితే అతడే బాలికను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిందుతుడి కోసం డాగ్ స్క్వాడ్ ద్వారా 4 బృందాలుగా గాలిస్తున్నామని డీఎస్పీ కిషన్ తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం మహదేవపూర్ సామాజిక వైద్యశాలకు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఇటు గెలిచిన ఆనందం.. అటు ఇంట్లో విషాదం
సాక్షి, ఏటూరునాగారం: ఓ వైపు గెలిచిన ఆనందం.. మరో వైపు కూతురి ఆత్మహత్య.. ఓ మాతృమూర్తికి ఎదురైన ఈ పరిస్థితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూర్జహాన్ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా పోటీ చేసింది. ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు ఛార్మిల (చేను)ను అదే గ్రామానికి చెందిన షేక్ నయీమ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. పెద్దవెంకటాపురంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న నయీమ్‌కు పంచాయతీ ఎన్నికల డ్యూటీ పడటంతో భూపాలపల్లికి వెళ్లాడు. సోమవారం ఎన్నికల లెక్కింపు జరుగుతుండగా నూర్జాన్తోపాటు కుటుంబ సభ్యులంతా చిన్నబోయినపల్లి పాఠశాల వద్దే ఉన్నారు. ఇంటి వద్దే ఉన్న ఛార్మిల ఎవరూ లేనిది చూసి దూలానికి ఉరివేసుకుంది. వార్డు సభ్యురాలిగా గెలుపొందిన నూర్జాన్ కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోదించింది. మృతురాలి ఎడమ చేతిపై తన చావుకు ఎవరూ కారకులు కాదని రాసి ఉంది. ఘటనకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. మృతిచెందిన వార్డు అభ్యర్థి గెలుపు గార్ల: జ్వరంతో ఆదివారం మృతి చెందిన వార్డు అభ్యర్థి గెలుపొందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం రాజుతండాలో సోమవారం చోటుచేసుకుంది. 3వ వార్డు సభ్యుడు బానోత్ భాస్కర్ సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు గెలిపించి తమ సానుభూతిని చాటారు. ఎంటెక్ పూర్తి చేసి ఖమ్మం జిల్లా కారేపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా భాస్కర్ పనిచేస్తున్నాడు. -
కుటుంబ కలహాలతో సవతి తల్లిపై హత్యాయత్నం
నల్లబెల్లి జయశంకర్ జిల్లా : కుటుంబ కలహాలతో సవతి తల్లిపై కుమారుడు పెట్రోలు పోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బూర సాంబయ్య తన మొదటి భార్య 20 ఏళ్ల క్రితం చనిపోగా విజయను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు రాజుకుమార్ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాజుకుమార్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి కరెంట్ బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం కుటుంబంలో గొడవ జరగగా అతడు విజయ–సాంబయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచాడు. కాగా వారు పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఆగ్రహనికి గురైన రాజుకుమార్ ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి ఇంటి ముందున్న సవతితల్లిపై పోసి నిప్పంటిం చేందుకు యత్నించాడు. అప్రమత్తమైన ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తింది. ఆగ్రహంతో ఊగిపోయిన రాజ్‌కుమార్ ఇంటి ఆవరణలో ఉన్న తండ్రి ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో దహనమైంది. దీంతో బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. -
సీఎం కేసీఆర్ సర్వేలన్నీ బోగస్
భూపాలపల్లి : సీఎం కేసీఆర్ చేయించే సర్వేలన్నీ బోగసేనని మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ప్రజలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం మాని ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆమెను మరువబోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావిస్తే, అతని కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చౌకబారు ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రుణ మాఫీ, దళితులకు మూడెకరాల భూమి, అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి నిజమైన ద్రోహులు కేసీఆర్ కుటుంబీకులేనని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరిట అధికార పార్టీ అందినకాడికి దోచుకుంటోందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపించిందని, అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువైందన్నారు. కేంద్రం ఇచ్చే కమీషన్‌ను సైతం రేషన్ డీలర్లకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుల అండదండలతోనే భూపాలపల్లిలో భూ మాఫీయా కొనసాగుతోందని, ఈ విషయంలో జిల్లా ఎస్పీ కఠినంగా వ్యవహరించి మాఫియా ఆగడాలను అరికట్టాలని కోరారు. వైఎస్సార్ చలవే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చలవ వల్లే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతు సంక్షేమం కోసం జలయజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకువచ్చాడని గుర్తు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా కంతనపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాడని, దీంతో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం అక్కడి ప్రాజెక్టును తుపాకులగూడెంకు తరలించిందని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి సమ్మయ్య, కటకం జనార్దన్, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, ఆకుల మల్లేష్, కొత్త హరిబాబు, నూనె రాజు, గడ్డం కుమార్‌రెడ్డి, సెగ్గెం సిద్ధు, నాగపురి సమ్మయ్య, కరాటే శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జయశంకర్ జిల్లాలో ఘోర ప్రమాదం
మల్లంపల్లి: జయశంకర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం మల్లంపల్లి వద్ద కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్రిడ్జిపై నుంచి కిందపడిన టిప్పర్... క్లీనర్ మృతి
సాక్షి, భూపాలపల్లి: ప్రమాదవశాత్తూ బొగ్గు టిప్పర్ బ్రిడ్జిపై నుంచి కింద పడడంతో క్లీనర్ మృతిచెందాడు. భూపాలపల్లి- కాళేశ్వరం ప్రధాన రహదారిలో బొగ్గులవాగుపై ఉన్న బ్రిడ్జిపై నుంచి టిప్పర్ బోల్తా కొట్టింది. దీంతో టిప్పర్ క్లీనర్ ధనం గోపీ(24) అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మీ ఎంపీలు, ఎమ్మెల్యేలే దద్దమ్మలు
వరంగల్ , హన్మకొండ: టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలని సీఎం కేసీఆర్‌కు ఇప్పటికైనా అర్థమైందా అని కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం హన్మకొండ సర్క్యూట్ హౌస్ రోడ్డులోని విశాల్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలని తేల్చేశారని చెప్పారు. తాము ఎప్పటి అభివృద్ధి కుంటుపడిందని, వరంగల్ నగరం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి పోయిందని చెబుతూ వస్తున్నా..తమ మాటలు పట్టించుకోకుండా, టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్లతో తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఎదురు దాడి చేశారన్నారు. నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ది జాడే లేదన్నారు. నగర సమస్యలపై త్వరలో మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ పెట్టిన ఫ్లెక్సీలను మొక్కుబడిగా తొలగించారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అ«ధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, నెక్కొండ కిషన్, తోట వెంకన్న, గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డి, నేహాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
భార్య మీద ప్రేమతో చర్చి పాస్టర్ విచిత్ర ప్రవర్తన
-
మావోల పోస్టర్లు కలకలం
వెంకటాపురం: జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో మంగళవారం మావోల పోస్టర్లు కలకలం రేపాయి. మావోయిస్టు వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ కరపత్రాలు వెలిశాయి. తెలంగాణలో పట్టు సాధించాలని మావోల విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. -
లోయలో పడ్డ బొలెరో.. ఇద్దరు మృతి
చర్ల (ఖమ్మం): జయశంకర్ జిల్లా వాజేడు మండలం లొట్టిపిట్టలగండివద్ద మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనలో మరికొందరు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను పేరూరు ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు దంపతులు ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. కుక్కల గణపతి అలియాస్ రాజుతోపాటు అతని భార్య చెన్నూరి సర్వక్క అలియాస్ స్వరూప వ్యక్తిగత కారణాల వల్ల లొంగిపోయారని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. వీరిద్దరు చర్ల-వెంకటాపూర్ ఏరియా కమిటీలో దళ సభ్యులుగా పని చేశారన్నారు. -
స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటిన ఇశ్వీమతాయి
-
అధికారులకు ఘనస్వాగతం పలుకుతాం
భవనాల కేటాయింపునకు సింగరేణి గ్రీన్‌సిగ్నల్ శాసన సభాపతి మధుసూదనాచారి భూపాలపల్లి : జయశంకర్ జిల్లాలో పనిచేసేందుకు వచ్చే ప్రభుత్వ అధికారులకు ఘనంగా స్వాగతం పలుకుతామని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి పట్టణంలో జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్న సింగరేణి ఇందూ అతిథిగృహం, ఎంవీటీసీ కార్యాలయం, కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఆయన సందర్శించి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తాత్కాలిక కార్యాలయాలకు భవనాలు కేటాయించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. వచ్చే నెల 1వ తేదీలోగా అన్ని శాఖల అధికారులు కార్యాలయాలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. దసరా నుంచి పాలన కొనసాగించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతామని చెప్పారు.ఽ ఈ కార్యక్రమంలో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం పి.సత్తయ్య, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, ముంజాల నిర్మల, గోనె భాస్కర్, శిరుప అనిల్, టీఆర్ఎస్ నాయకులు మేకల సంపత్‌కుమార్, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, తాటి వెంకన్న, మారెల్ల సేనాపతి పాల్గొన్నారు. -
ఏటూరునాగారంలో వన్యప్రాణి డివిజన్ కార్యాలయం
నాలుగు రేంజ్‌లకు కలిపి ఏర్పాటు రక్షణ కోసం మరిన్ని చర్యలు ఏటూరునాగారం : ఏటూరునాగారంలో వన్యప్రాణి విభాగం జిల్లా డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏటూరునాగారాన్ని వన్యప్రాణి, అడవుల రక్షణ కోసం ప్రత్యేక హోదా కలిగిన అధికారితోపాటు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఏటూరునాగారంలో ఉన్న అటవీశాఖ టెరిటోరియల్ రేంజ్ ఆఫీస్, వన్యప్రాణి రేంజ్ ఆఫీస్, పస్రా, తాడ్వాయి రేంజ్ కార్యాలయాలు వరంగల్ నార్త్ డీఎఫ్ఓ కింద పనిచేసేవి. ఇప్పుడు జయశంకర్ జిల్లా ఏర్పడుతుండటంతో ఏటూరునాగారాన్ని ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేసి ఫారెస్ట్ డిస్టిక్ట్ర్ ఆఫీసర్ (ఎఫ్డీఓ) అధికారిని కూడా నియమించనున్నారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో తాడ్వాయి, ఏటూరునాగారం, ఆకులవారి ఘ ణపురం, పస్రాలోని రేంజ్ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. ఏజెన్సీలో వన్యప్రాణి, టెరిటోరియల్ అనే రెండు శాఖలు అటవీశాఖ పరిధిలో ఉండేవి. నూతన జిల్లా పరిధిలోని ఏ జెన్సీ మండలాలైన తాడ్వాయి, పస్రా, ఏటూరునాగారంను వన్యప్రాణి విభాగంగా ప్రకటించనున్నారు. దీనివల్ల ఏజెన్సీలోని అడవులతోపాటు జంతువుల సంరక్షణ కూడా ఉంటుందని ఈ మార్పులు చేపట్టారు. నలుగురు రేంజ్ అధికారులు, ఒక సబ్ డీఎఫ్ఓ, ఒక ఎఫ్డీఓ అధికారులు ఉంటారని వెల్లడించారు. పటిష్టంగా అమలు కానున్న అటవీ చట్టాలు ప్రస్తుత రేంజ్ అంతా వన్యప్రాణి విభాగం పరి ధిలోకి రాగా అటవీశాఖ చట్టాలు పట్టిష్టంగా అమలు కానున్నాయి. జంతువుల సంఖ్య 15 సంవత్సరాల్లో ఘణనీయంగా తగ్గింది. పులు లు, సింహాలు, దుప్పి, జింక, కొండ గొర్రెలు, ఎలుగుబంటి, మెకం వంటి వన్యప్రాణులు కానరాకుండా పోతున్నాయి. ప్రధాన కార్యాలయం స్థానికంగా ఉండడం వల్ల అధికారు లు, సిబ్బంది స్థానికంగా ఉంటూ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కోసం ఇప్పటికే చర్యలు చేపట్టారు. గతంలో ఉన్న భవనాలకు మరింత సౌకర్యాలు పెంచే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. -
కార్యాలయాల కథ మళ్లీ మెుదటికి
సింగరేణి భవనాలను ఎంపిక చేసిన రెవెన్యూ అధికారులు వాటిని ఇవ్వలేమని సింగరేణి ప్రకటన విడుదల జయశంకర్ జిల్లాలో మారిన పరిస్థితి భూపాలపల్లి : జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాల యాల ఏర్పాటు మళ్లీ మెుదటికి వచ్చింది. జిల్లా కార్యాలయాల ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు ఇటీవల సింగరేణి భవనాలు పరిశీలించా రు. పలు భవనాలు ఎంపిక చేసి కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండగా, ఆ భవనాలు ఇవ్వడం వీలుకాదంటూ సింగరేణి అధికారులు ఇప్పుడు ప్రకటనలు విడుదల చేశారు. దీంతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటు సమస్య ఎదురు కానుంది. జయశంకర్ జిల్లా తాత్కాలిక కా ర్యాలయాలకు స్థాని కంగా ప్రభుత్వ కా ర్యాలయాలు ఖాళీగా లేవు. దీంతో జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ములుగు ఆర్డీవో మహేందర్‌జీ, స్థానిక రెవెన్యూ అధికారులు ఇటీవల సింగరేణి భవనాలను పరిశీలించారు. మంజూర్‌నగర్‌లోని ఇందూ అతిథిగృహంలో 32 గదులు ఉండగా కలెక్టరేట్‌తోపాటు మరో 10 శాఖల కార్యాలయాలు, మైనింగ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్(ఎంవీటీసీ)లో ఎస్పీ కార్యాలయం, సీఈఆర్ క్లబ్లో ట్రెజరీ, హౌసింగ్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఏ గదుల్లో ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో సింగరేణి భూపాలపల్లి ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ అధికారులు కోరుతున్న ఇంద రూ అతిథిగృహం, ఎంవీటీసీ కార్యాలయం, సీఈఆర్ క్లబ్‌లు పరిపాలన, శాంతిభద్రతలు, చట్టాల పరంగా జిల్లా కార్యాలయాలకు ఇవ్వ డం వీలు కాదని అందులో పేర్కొన్నారు. పైలట్‌కాలనీలోని పాత అతిథిగృహం, కమ్యూనిటీ హాల్, ఎన్బీ క్వార్టర్స్ 6, డిస్పెన్సరీ, బ్యారక్‌లు జిల్లా కార్యాలయాలకు కేటాయించేందుకు తాము యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. దీంతో సమస్య మళ్లీ మెుదటికి వచ్చింది. కాగా సింగరేణి భవనాలను పరిశీ లించి రెవెన్యూ అధికారులు ఆయా అధికారులను సంప్రదించకుండా పత్రిక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. నివేదికలు పంపాం కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ భూపాలపల్లికి వచ్చి సింగరేణి సంస్థ అధికారులతో కలిసి ఆయా భవనాలను పరిశీలించారు. ఆ భవనాలు కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని భావించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సింగరేణి సంస్థ సీఅండ్ఎండీకి జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. అనుమతులు రాగానే కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం. – మహేందర్‌జీ, ములుగు ఆర్డీవో