యంత్రాలను సిద్ధం చేసిన నిర్మాణ సంస్థ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీ)బ్యారేజీలో ఏర్పడ్డ బొరియల్లో గ్రౌటింగ్ పనులు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను నిర్మాణసంస్థ ఏర్పాటు చేసింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షల ద్వారా 7వ బ్లాక్‌లో మాత్రమే బొరియలు ఏర్పడినట్లు నిర్మాణ సంస్థ ప్రతినిథులు తెలిపారు. దీనికోసం డ్రెడ్జర్ యంత్రాలను బ్లాక్ 7లో ఏర్పాటు చేశారు.
19, 20, 21 గేట్ల సమీపంలో ఏర్పడిన బొరియల్లో సోమవారం నుంచి కాంక్రీటు, ఇసుక మిశ్రమాన్ని నింపడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బొరియల్లో మట్టిని నింపి నిషేధిత ప్రాంతంగా సైన్‌బోర్డులు పెట్టారు. గేట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు. 7వ బ్లాక్‌లో మొరాయించిన గేట్లను ఆర్మ్ గ్రౌగింగ్ పరికరంతో కట్ చేసి తొలగిస్తున్నారు. అదే విధంగా ఆ బ్లాక్‌లోని పియర్‌ల దిగువన 10మీటర్ల లోతు వరకు ఇసుక వరద తాకిడికి తరలిపోకుండా షీట్‌ఫైల్స్ వేయడానికి ఏర్పాట్లు చే«శారు. ఇప్పటికే సీసీ బ్లాక్ పనులు, ఇసుక మేటల తొలగింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment