
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు సోనియా ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయం అన్న సోనియా గాంధీ.. త్రివేణి సంగమం జలాలకి ఎంతో ప్రత్యేకత ఉందని ప్రస్తావించారు.
తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకి కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసినందుకు కొండా సురేఖను సోనియా గాంధీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment