అధికారులకు ఘనస్వాగతం పలుకుతాం
-
భవనాల కేటాయింపునకు సింగరేణి గ్రీన్‌సిగ్నల్
-
శాసన సభాపతి మధుసూదనాచారి
భూపాలపల్లి : జయశంకర్ జిల్లాలో పనిచేసేందుకు వచ్చే ప్రభుత్వ అధికారులకు ఘనంగా స్వాగతం పలుకుతామని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి పట్టణంలో జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్న సింగరేణి ఇందూ అతిథిగృహం, ఎంవీటీసీ కార్యాలయం, కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఆయన సందర్శించి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తాత్కాలిక కార్యాలయాలకు భవనాలు కేటాయించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. వచ్చే నెల 1వ తేదీలోగా అన్ని శాఖల అధికారులు కార్యాలయాలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. దసరా నుంచి పాలన కొనసాగించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతామని చెప్పారు.ఽ ఈ కార్యక్రమంలో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం పి.సత్తయ్య, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణ రవి, వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, ముంజాల నిర్మల, గోనె భాస్కర్, శిరుప అనిల్, టీఆర్‌ఎస్ నాయకులు మేకల సంపత్‌కుమార్, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, తాటి వెంకన్న, మారెల్ల సేనాపతి పాల్గొన్నారు.