కార్యాలయాల కథ మళ్లీ మెుదటికి
-
సింగరేణి భవనాలను ఎంపిక చేసిన రెవెన్యూ అధికారులు
-
వాటిని ఇవ్వలేమని సింగరేణి ప్రకటన విడుదల
-
జయశంకర్ జిల్లాలో మారిన పరిస్థితి
భూపాలపల్లి : జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాల యాల ఏర్పాటు మళ్లీ మెుదటికి వచ్చింది. జిల్లా కార్యాలయాల ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు ఇటీవల సింగరేణి భవనాలు పరిశీలించా రు. పలు భవనాలు ఎంపిక చేసి కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండగా, ఆ భవనాలు ఇవ్వడం వీలుకాదంటూ సింగరేణి అధికారులు ఇప్పుడు ప్రకటనలు విడుదల చేశారు. దీంతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటు సమస్య ఎదురు కానుంది. జయశంకర్ జిల్లా తాత్కాలిక కా ర్యాలయాలకు స్థాని కంగా ప్రభుత్వ కా ర్యాలయాలు ఖాళీగా లేవు. దీంతో జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ములుగు ఆర్డీవో మహేందర్‌జీ, స్థానిక రెవెన్యూ అధికారులు ఇటీవల సింగరేణి భవనాలను పరిశీలించారు. మంజూర్‌నగర్‌లోని ఇందూ అతిథిగృహంలో 32 గదులు ఉండగా కలెక్టరేట్‌తోపాటు మరో 10 శాఖల కార్యాలయాలు, మైనింగ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్(ఎంవీటీసీ)లో ఎస్పీ కార్యాలయం, సీఈఆర్ క్లబ్‌లో ట్రెజరీ, హౌసింగ్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఏ గదుల్లో ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో సింగరేణి భూపాలపల్లి ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ అధికారులు కోరుతున్న ఇంద రూ అతిథిగృహం, ఎంవీటీసీ కార్యాలయం, సీఈఆర్ క్లబ్‌లు పరిపాలన, శాంతిభద్రతలు, చట్టాల పరంగా జిల్లా కార్యాలయాలకు ఇవ్వ డం వీలు కాదని అందులో పేర్కొన్నారు. పైలట్‌కాలనీలోని పాత అతిథిగృహం, కమ్యూనిటీ హాల్, ఎన్‌బీ క్వార్టర్స్ 6, డిస్పెన్సరీ, బ్యారక్‌లు జిల్లా కార్యాలయాలకు కేటాయించేందుకు తాము యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. దీంతో సమస్య మళ్లీ మెుదటికి వచ్చింది. కాగా సింగరేణి భవనాలను పరిశీ లించి రెవెన్యూ అధికారులు ఆయా అధికారులను సంప్రదించకుండా పత్రిక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
నివేదికలు పంపాం
కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ భూపాలపల్లికి వచ్చి సింగరేణి సంస్థ అధికారులతో కలిసి ఆయా భవనాలను పరిశీలించారు. ఆ భవనాలు కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని భావించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీకి జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. అనుమతులు రాగానే కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం.
– మహేందర్‌జీ, ములుగు ఆర్డీవో