ward member
-
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్య
కాకినాడ, సాక్షి: టార్గెట్ వైఎస్సార్సీపీతో కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను కొనసాగిస్తోంది. ఆ పార్టీ నేతల దగ్గరి నుంచి సానుభూతిపరులదాకా, చివరకు ఓటర్లపైనా భౌతిక దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు ఆన్లైన్ వేదికగానూ వేధింపులకూ తెగబడుతోంది. ఈ వేధింపులు భరించలేక కాకినాడలో వైఎస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెం 10వ వార్డు మెంబర్‌గా వైఎస్సార్సీపీ నేత బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఉన్నాడు. అయితే.. గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఆయనకు వేధింపులు పెరిగిపోయాయి. దీంతో భరించలేని ఆయన తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్యనారాయణ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే స్థానిక వైఎస్సార్సీపీ నేతలు సత్యనారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరిస్తున్నారు. -
అధికార పార్టీ నాయకుడు వినూత్న నిరసన
-
ఎంఐఎం తరపున గెలిచిన అరుణ
భోపాల్: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్గావ్ మున్సిపల్ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. #ArunaUpadhyaya Thanked #AIMIM President Barrister @asadowaisi after Winning Corporator Election on AIMIM Ticket from City of #Khargone for the First Time in #MadhyaPradesh, #AIMIM has Registered a Big Victory in Corporator Elections. pic.twitter.com/hRIjsP8eqk — Syed Mubeen (Tez Dhar) (@SyedZiya_Mubeen) July 21, 2022 -
వార్డు సభ్యుడిగా గెలిచి.. ఎంపీగా ఎదిగి..
సాక్షి, చిట్యాల (నకిరేకల్) : దేశ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అలాంటిది ఓ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగారు చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన ప్రస్తుత నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఈయన 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1981లో ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 1984లో చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్‌గా నామినేట్ అయ్యారు. 1985లో మార్కెట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1992లో చిట్యాల సింగిల్ విండో చైర్మన్‌గా గెలుపొందారు. 1992 నుంచి 99 వరకు వరసగా ఉరుమడ్ల గ్రామ పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌గా ఎన్నికై నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల యూనియన్ చైర్మన్‌గా పనిచేశారు. 1995–99 వరకు ఏపీ డెయిరీ చైర్మన్‌గా పనిచేస్తూనే నేషనల్ డెయిరీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. 1995లో దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేసి విజయం సాధించారు. ఎంపీగా.. 1999లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు గుత్తా సుఖేందర్‌రెడ్డి మొట్టమొదటి సారి పోటీచేసి ఘన విజయం సాధించారు. 2004లో నల్లగొండ శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ఆయన 2009లో, 2014లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా నల్లగొండ ఎంపీగా మూడు సార్లు పనిచేసిన ఘనతను ఆయన సాధించారు. ఆయన ప్రస్తుతం గత ఏడాది కాలంగా క్యాబినేట్ హోదాలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవ చేస్తున్నారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ‘గుత్తా’ ప్రాతినిధ్యం మిర్యాలగూడ : మూడు పర్యాయాలు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం గుత్తా సుఖేందర్‌రెడ్డికే దక్కింది. ఆయన ఒకసారి టీడీపీ, మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ తరపున నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.1999లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుకుల జనార్ధన్‌రెడ్డిపై 79,735 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా అప్పట్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉమ్మడి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, భువనగిరి, ఆలేరు ఉన్నాయి. ఆ తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి సీపీఐ అభ్యర్థి సురవరం సుధార్రెడ్డిపై 1,52,982 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 1,93,156 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా నియోజకవర్గాల పునర్విభజన అనంతరం నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట ఉన్నాయి. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేవలం నకిరేకల్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం లభించింది. -
నా డబ్బులు నాకిచ్చేయ్.. అంతే!
-
ఇటు గెలిచిన ఆనందం.. అటు ఇంట్లో విషాదం
సాక్షి, ఏటూరునాగారం: ఓ వైపు గెలిచిన ఆనందం.. మరో వైపు కూతురి ఆత్మహత్య.. ఓ మాతృమూర్తికి ఎదురైన ఈ పరిస్థితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూర్జహాన్ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా పోటీ చేసింది. ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు ఛార్మిల (చేను)ను అదే గ్రామానికి చెందిన షేక్ నయీమ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. పెద్దవెంకటాపురంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న నయీమ్‌కు పంచాయతీ ఎన్నికల డ్యూటీ పడటంతో భూపాలపల్లికి వెళ్లాడు. సోమవారం ఎన్నికల లెక్కింపు జరుగుతుండగా నూర్జాన్తోపాటు కుటుంబ సభ్యులంతా చిన్నబోయినపల్లి పాఠశాల వద్దే ఉన్నారు. ఇంటి వద్దే ఉన్న ఛార్మిల ఎవరూ లేనిది చూసి దూలానికి ఉరివేసుకుంది. వార్డు సభ్యురాలిగా గెలుపొందిన నూర్జాన్ కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఒక్కసారిగా గుండెలు పగిలేలా రోదించింది. మృతురాలి ఎడమ చేతిపై తన చావుకు ఎవరూ కారకులు కాదని రాసి ఉంది. ఘటనకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. మృతిచెందిన వార్డు అభ్యర్థి గెలుపు గార్ల: జ్వరంతో ఆదివారం మృతి చెందిన వార్డు అభ్యర్థి గెలుపొందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం రాజుతండాలో సోమవారం చోటుచేసుకుంది. 3వ వార్డు సభ్యుడు బానోత్ భాస్కర్ సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు గెలిపించి తమ సానుభూతిని చాటారు. ఎంటెక్ పూర్తి చేసి ఖమ్మం జిల్లా కారేపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా భాస్కర్ పనిచేస్తున్నాడు. -
వార్డు సభ్యునిగా పోటీ చేసేందుకు పంతం.. వ్యక్తి మృతి
సాక్షి, తుర్కపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల పోటీ విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామ పంచాయతీ పరిధి పెద్ద తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పెద్ద తండా కింద రెండు వార్డులు ఉన్నాయి. తండాకు చెందిన అజ్మీరా రవినాయక్ (28) ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి సోదరుడి కుమారుడైన శ్రీకాంత్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే వార్డుపై రవినాయక్ దాయాదులైన శ్రీనివాస్ నాయక్, నరేశ్‌లు ఆసక్తి కనబరిచారు. దీంతో నరేశ్ తన సోదరుడి కుమారుడు మాల్‌నాయక్‌తో వార్డు సభ్యుడిగా పోటీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. రెండు కుటుంబాల ఆసక్తి ఒకే వార్డుపై పడటంతో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి లక్ష్మణ్ నాయక్, నరేశ్‌లు వారి కుటుంబ సభ్యులతో కలసి రవినాయక్ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. రవినాయక్ తన పక్కన ఉన్న కర్రతో నరేశ్ తలపై గట్టిగా కొట్టడంతో కింద పడిపోయాడు. కాసేపటికి నరేశ్ లేచి తన ఎదురుగా ఉన్న రవినాయక్ మర్మాంగంపై గట్టిగా తన్నడంతో అతడు కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడిని కుటుంబ సభ్యులు, బంధువులు కలసి మాదాపూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
వార్డు సభ్యురాలి ఆత్మహత్య
మిడుతూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మిడుతూరులో వార్డు సభ్యురాలు కృష్ణవేణి కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్ల గత కొంతకాలంగా మనస్థాపానికి గురవుతున్న కృష్ణవేణి జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వార్డు మెంబర్ దారుణ హత్య
ఆదిలాబాద్(ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లాలో పాండు (25) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడనే సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఖానాపూర్ మండలం పెంబి శివారులో ఉన్న నరసింహస్వామి గుట్ట వద్ద పాండు (25) అనే వ్యక్తి ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఆయన శెట్టిపల్లి వార్డు సభ్యుడిగా ఉండేవారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పాండును గొంతుకోసి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వార్డు సభ్యుడిపై టీడీపీ వర్గీయుల దాడి
చినకాకాని(మంగళగిరి రూరల్): నిడమర్రులో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకుడు, పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడు తాడిబోయిన అంకమ్మరావుపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అంకమ్మరావు తన స్నేహితుడు నల్లిబోయిన వీరయ్యతో కలసి శనివారం రాత్రి రజక కాలనీలో కూర్చునివున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు తాడిబోయిన మల్లయ్య, కుర్రా శంకరరావు, తాడిబోయిన వెంకటేశ్వరరావు, కుర్రా వీరయ్య, తాడిబోయిన సీతారామయ్య, తాడిబోయిన సుబ్బారావులతోపాటు మరో నలుగురు వచ్చి ఆకస్మాత్తుగా దాడి చేసి గాయపర్చారని స్థానికులు చెప్పారు. గమనించిన స్థానికులు ఘటన స్థలానికి చేరడంతో దాడికి పాల్పడినవారు పరారయ్యారు. గాయపడిన అంకమ్మరావు, వీరయ్యలను 108లో చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు ఎమ్మెల్యే ఆర్కే పరామర్శ పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడు అంకమ్మరావు, నల్లిబోయిన వీరయ్యను ఆదివారం ఎమ్మెల్యే ఆర్కే పరామర్శించి వారి ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోవడం వేనుక అధికార పార్టీ అండదండలున్నాయని చెప్పారు. భౌతిక దాడులు మంచి పరిణామం కాదని, ఇప్పటికైనా మానుకోకుంటే వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు దాడులకు భయపడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఇప్పటికే తాను పోలీసు అధికారులతో మాట్లాడి దాడి ఘటనలో నిందితులు ఎంతటి వారైనా పట్టుకుని శిక్షించాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీ సభ్యుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గాదె లక్ష్మారెడ్డి, తాడిబోయిన వలరాజు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ బాజి, ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, సొసైటీ డెరైక్టర్ కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కొల్లి శేషిరెడ్డి తదితరులున్నారు. -
ప్రజా ప్రతినిధులకు ఇదేనా మర్యాద..?
మెరకముడిదాం: పంచాయతీ వార్డు మెంబర్లంటే చులకనగా కనిపిస్తున్నామా? శిక్షణ తరగతులకు పిలిచి అవమానపరుస్తారా.. ప్ర జాప్రతినిధులకు ఇచ్చే గౌరవమిదేనా? అంటూ శిక్షణాతరగతులకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన పలువురు వార్డు మెంబర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మెరకముడిదాం మం డలంలోని 24 పంచాయతీలకు చెందిన 240 మంది వార్డుమెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహించమని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా ముందుగా ఐదు పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లకు శిక్షణ ఇచ్చారు. అయితే వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులకు ప్రభుత్వం రూ.1,40,300 మంజూరు చేసింది. ఈనిధులను ఒక్కో వార్డు మెంబరుకు రెండురోజుల శిక్షణ తరగతులకు సంబంధించి భో జనానికి రూ.200, టీఏ,డీఏలకు రూ.250 చొప్పున పంపిణీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు మాత్రం నాణ్యతలేని భోజనం వారికి పెట్టడమే కాకుండా, ఒక్కో వార్డు మెంబరుకు రూ.100 చొప్పున పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. దీనికి వార్డు మెంబర్లు కోట్లఅప్పలస్వామి, బెహరానరసింహమూర్తి, మామిడిసూర్యనారాయణ, రౌతుసూర్యనారాయణ, గవిడిశంకర్రావు, మజ్జిఅప్పలనాయుడు, ఎలకల లక్ష్మి, ఆల్తిరాజేశ్వరి, రెడ్డిసత్యవతి తదితరులు రెండురోజులు శిక్షణ ఇచ్చినట్టు అధికారులు రాసుకుని తమకు మాత్రం రూ.100, నాణ్యతలేని భోజనం రోడ్డుపై పెట్టి అవమానించారని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. శిక్షణకు అని పిలిచి మరీ అధికారులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం మంజూరు చేసిన టీఏ, డీఏలను సక్రమంగా పంపిణీ చేయకపోతే మొత్తం 24పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లందరూ కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
స్వతంత్ర పతాక సత్తాకు ప్రతీక
అమలాపురం, న్యూస్‌లైన్ : పంచాయతీలో వార్డు మెంబరుగా గెలవాలంటేనే ఎన్నో వ్యయ ప్రయాసలకు లోను కావాల్సిన రోజులివి. సర్వశక్తులూ ఒడ్డి పోరాడితేగాని విజేతలు కాలేరు. అభ్యర్థి విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టాలి. మద్యాన్ని ఏరులా పారించాలి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడాలి. వార్డు అభ్యర్థి గెలుపుకోసమే ఇన్ని పాట్లు పడితే శాసనసభ్యులు కావాలంటే.. ఇంకెంత కష్టపడాలో అర్థం చేసుకోవచ్చు. అదీ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరీ ముఖ్యంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే తూర్పుగోదావరి వంటి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలను కాదని, అప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చే ‘గుర్తు’ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి గెలవడమంటే మాటలు కాదు. అయితే ప్రజాభిమానం, స్థానిక పరిస్థితులు కలిసి వచ్చి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి తమ సత్తా చాటారు. వీరిలో కొందరు ఈ గెలుపునే రాజకీయ పునాదిగా మార్చుకుని ఉన్నత పదవులు అలంకరించారు. స్వతంత్ర అభ్యర్థులు సత్తాచాటిన నియోజకవర్గాలు అనగానే జిల్లాలో ముందుగా గుర్తుకు వచ్చేది అమలాపురం, రామచంద్రపురం. ఈ నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది స్వతంత్రులుగా గెలిచి చరిత్ర సృష్టించారు. కోనసీమ కేంద్రమైన అమలాపురం నియోజకవర్గంలో తొలి నుంచి ప్రభావం చూపిస్తున్న కుడుపూడి కుటుంబీకుల రాజకీయ ప్రస్థానం స్వతంత్ర అభ్యర్థులుగానే ఆరంభమైంది. ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. వీరు ముగ్గురూ స్వతంత్రులుగానే రాజకీయరంగ ప్రవేశం చేసి విజేతలు కావడం విశేషం. వీరు ముగ్గురూ బంధువులు కూడా కావడం గమనార్హం. తొలిసారి గా కుడుపూడి సూర్యనారాయణ 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. రామభద్రరాజు పై విజయం సాధించారు. సూర్యనారాయణ తరువాత ఆయన కుమారుడు కుడుపూడి ప్రభాకరరావు సైతం 1967లో స్వతంత్రునిగా గెలిచారు. తండ్రిలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామభద్రరాజుపైనే విజయం సాధించారు. తరువాత ప్రభాకరరావు 1972, 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయ దుందుభిని మోగించారు. 1992లో దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖమంత్రిగా పనిచేశారు. ప్రభాకరరావు తరువాత ఆయనకు వరుసకు సోదరుడు కుడుపూడి చిట్టబ్బాయి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్రునిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుపై విజయం సాధించారు. జిల్లాలో అత్యధికంగా స్వతంత్రులను గెలిపించిన ఘనత రామచంద్రపురం నియోజకవర్గానికి దక్కింది. ఇక్కడ నుంచి ఏకంగా ఐదుగురు స్వతంత్రులుగా గెలిచి రికార్డు సృష్టించారు. 1962లో తొలిసారి నందివాడ సత్యనారాయణరావు, కాంగ్రెస్ అభ్యర్థి కంటిపూడి కమలాదేవిపై గెలిచారు. తరువాత జరిగిన ఎన్నికల్లో స్వతంత్రునిగా బరిలో దిగిన నున్నవీర్రాజు, కాంగ్రెస్ అభ్యర్థి నందివాడ సత్యనారాయణరావుపైన, 1978లో పిల్లి అప్పారావు.. జనతా పార్టీ అభ్యర్థి ఎం.వి.స్వామినాయుడుపైనా, 1994లో తాజా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, టీడీపీ అభ్యర్థి గుత్తుల సూర్యనారాయణబాబుపైనా గెలిచారు. తరువాత త్రిమూర్తులు 1999 ఎన్నికల్లోను, 2012లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుత వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వతంత్రునిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులపై విజయం సాధించారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో సాంఘిక సంక్షేమ శాఖమంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి గెలిచిన బోస్ వైఎస్సార్ మంత్రివర్గంలో కొంతకాలం పాటు కొనసాగారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి సంగిశెట్టి వీరభద్రరావు 1999లో అప్పటి బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై గెలుపొందారు. ప్రత్తిపాడు నుంచి మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తండ్రి ముద్రగడ వీరరాఘవులు ఏకంగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా విజయకేతనం ఎగురవేశారు. 1962లో కాంగ్రెస్‌కు చెందిన పర్వత గుర్రాజుపైనా, తరువాత 1967లో జరిగిన ఎన్నికల్లో వరుపుల జోగిరాజుపైనా గెలుపు సాధించారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి 1967 లో పంతం కామరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.ముత్యాలరావుపై, రాజోలు నియోజకవర్గం నుంచి 1972లో బిక్కిన గోపాలకృష్ణారావు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుద్రరాజు రామలింగరాజుపై, కాకినాడ నుంచి సీవీకే రావు 1965లో కాంగ్రెస్ అభ్యర్థి దండు భాస్కరరావుపై, సంచలన నాయకుడు జక్కంపూడి రామ్మోహనరావు 1989లో కడియం నుంచి టీడీపీకి చెందిన వడ్డి వీరభద్రరావుపై విజేతలుగా నిలిచి స్వతంత్రులుగా సత్తా చాటారు. వారిద్దరూ ఒకేసారి .. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఆప్తులుగా ముద్రపడ్డ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయిలు 2004లోనే స్వతంత్రులుగా బరిలో దిగి గెలుపు సాధించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరిరువురికీ పార్టీ టిక్కెట్లు ఇప్పించాలని అప్పటి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయత్నించినా పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వీరిరువురినీ కాదని వేరేవారికి టిక్కెట్లు ఇప్పించారు. దీనితో బోస్ రామచంద్రపురం నుంచి, చిట్టబ్బాయి అమలాపురం నుంచి స్వతంత్రులుగా బరి లో దిగి టీడీపీ అభ్యర్థులపై గెలుపు సాధించారు. తర్వాత వైఎస్సార్‌పై అభిమానంతో కాంగ్రెస్‌లో చేరారు.