టీడీపీ వేధింపులతో వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్య | Kakinada YSRCP Leader Commit Suicide Amid TDP Harassment | Sakshi
Sakshi News home page

టీడీపీ వేధింపులతో మరో వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్య

Published Fri, Jul 26 2024 11:24 AM | Last Updated on Fri, Jul 26 2024 12:55 PM

Kakinada YSRCP Leader Commit Suicide Amid TDP Harassment

కాకినాడ, సాక్షి: టార్గెట్‌ వైఎస్సార్‌సీపీతో కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను కొనసాగిస్తోంది. ఆ పార్టీ నేతల దగ్గరి నుంచి సానుభూతిపరులదాకా, చివరకు ఓటర్లపైనా భౌతిక దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు ఆన్‌లైన్‌ వేదికగానూ వేధింపులకూ తెగబడుతోంది. ఈ వేధింపులు భరించలేక కాకినాడలో వైఎస్సార్‌సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.  

పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెం 10వ వార్డు మెంబర్‌గా వైఎస్సార్‌సీపీ నేత బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఉన్నాడు. అయితే.. గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలోనూ ఆయనకు వేధింపులు పెరిగిపోయాయి. దీంతో భరించలేని ఆయన తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 

సత్యనారాయణ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు సత్యనారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement