ముగిసిన మున్సిపల్‌ పోలింగ్‌ | Telangana Municipal Election Polling Begins | Sakshi
Sakshi News home page

ముగిసిన మున్సిపల్‌ పోలింగ్‌

Published Wed, Jan 22 2020 7:11 AM | Last Updated on Wed, Jan 22 2020 5:15 PM

Telangana Municipal Election Polling Begins - Sakshi

సాక్షి, తెలంగాణ: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 120 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది.  5 గంటలలోపు క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. అత్యధికంగా ఆదిభట్లలో అత్యల్పంగా నిజాంపేటలో పోలింగ్‌ నమోదు. ఈనెల 25న ఎన్నికల లెక్కింపుజరగనుంది.సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీ సమేతంగా వచ్చి  22 వార్డులో ఓటు  హక్కు  వినియోగించుకున్నారు.అందోల్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొమ్మిదవ వార్డు నుండి ఎంపీడీఓ కార్యాలయ పోలింగ్ కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ. సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని పోలింగ్ కేంద్రం వద్ద చనిపోయిన వ్యక్తి ఓటు వేశారంటూ కాంగ్రెస్ నాయకుల ఆందోళన చేపట్టారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ. చోటుచేసుకుంది.

ఇల్లందులోనిమెయిన్ రోడ్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతులో డబ్బులు పంపిణీ  చేస్తున్న 9వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్ధిని స్వతంత్ర అభ్యర్థి పోలీసులకు అప్పగించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు తో పాటు మరో ముగ్గురిని  అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అధికార పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఆవేదన ‍వ్యక్తం చేశారు.  తెరాస పార్టీ 5వ డివిజన్ అభ్యర్థి మురుగేష్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయించాడని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఒకటవ వార్డు లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లో 7వ డివిజన్ 24 25 26 27 భూతులలో రెండో ఓటు వేసేందుకు వచ్చిన ముగ్గురు మహిళలను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి మున్సిపాలిటీ ఎన్నికలలో దొంగ ఓట్లకు పాల్పడుతున్న ముఠాను నార్సింగి పోలీసులు. అరెస్ట్ చేశారు. డబ్బులు తీసుకొని దొంగ ఓట్ల పాల్పడుతున్న పురుషులతో పాటు మహిళలు ఉండడం గమనార్హం. 12 మహిళలు.8.పురుషులను అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మద్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట- 73.7 శాతం ఓట్లు నమోదు, హుజూర్ నగర్ - 73.97 శాతం నమోదు, దుండిగల్ మున్సిపాలిటీ-  60.74 శాతం పోలింగ్ నమోదు, కొంపల్లి మున్సిపాలిటీ - 59.09 శాతం పోలింగ్ నమోదు.డోర్నకల్ మున్సిపాలిటీ - 72.6 శాతం పోలింగ్ నమోదు, వర్ధన్నపేట మున్సిపాలిటీ- 80.04పోలింగ్ శాతం నమోదు, హుజురాబాద్ -75.02 శాతం నమోదు, నర్సంపేట -75.28 శాతం నమోదు, హుస్నాబాద్ - 77.86 శాతం నమోదు, కొత్తపల్లి -71.68 శాతం నమోదు,మెట్పల్లి -63.43 శాతం నమోదు,భీంగల్ - 67.24 శాతం నమోదు,  తిరుమలగిరి -82.45 శాతం నమోదు,  కోరుట్ల - 64.49 శాతం నమోదు, చౌటుప్పల్-85శాతం నమోదు, అమరచింత- 74.47,  పరిగి- 64.83 శాతం నమోదు,, చొప్పదండి- 71.37 శాతం నమోదు,  మెదక్ - 74.16,శాతం నమోదు,  ధర్మపురి-  71.70 శాతం నమోదు, మోత్కూరు -81.19 శాతం నమోదు,  జమ్మికుంట- 71.98శాతం నమోదు, మధిర - 72.14 శాతం నమోదు, తుక్కుగూడ మున్సిపాలిటీ- 74.21 పోలింగ్ నమోదు, ఆదిబట్ల మున్సిపాలిటీ- 85.5 శాతం పోలింగ్ నమోదు, కామారెడ్డి - 61.30 శాతం నమోదు, బాన్సువాడ - 71.65 శాతం నమోదు, ఎల్లారెడ్డి - 74.02 శాతం నమోదు.


ఇల్లందులో పోలింగ్ బూత్ లో డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థిని పట్టించుకోకపోవడం పట్ల  ఎన్డీ నేతల ఆందోళన

తుంకుంట- 61.89 శాతం ఓటింగ్ నమోదు, సుల్తానాబాద్-  77.1శాతం పోలింగ్, తొర్రూరు మున్సిపాలిటీ- 65.54 శాతం పోలింగ్‌, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ -71.79 శాతం నమోదు, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్- 55.26 శాతం నమోదు, జలపల్లి - 42 శాతం నమోదు, శంషాబాద్- 61 శాతం నమోదు, కోదాడ -72.41 శాతం నమోదు, జనగామ -69.57 శాతం నమోదు,అమీన్ పూర్ -56.89 శాతం నమోదు, శంకర్ పల్లి -73.17 శాతం నమోదు, జగిత్యాల -58.43 శాతం నమోదు, లక్సెట్టిపేట -72.47 శాతం నమోదు,  చెన్నూరు- 69.35 శాతం నమోదు, క్యాతనపల్లి -68.15 శాతం నమోదు, మక్తల్-  65.74 శాతం నమోదు, యాదగిరిగుట్ట-  83.19 శాతం నమోదు,పరకాల మున్సిపాలిటీ-74.97 శాతం నమోదు, జమ్మికుంట మున్సిపాలిటీ - 71.98 శాతం నమోదు, సిరిసిల్ల మున్సిపాలిటీ-68.69 శాతం నమోదు, వేములవాడ మున్సిపాలిటీ - 74.65 శాతం నమోదు, రామగుండం కార్పొరేషన్ - 57.63 శాతం, పెద్దపల్లి మున్సిపాలిటీ -68.54 శాతం నమోదు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ-  77.21 శాతం, మంథని మున్సిపాలిటీ - 74.86 శాతం నమోదు, కోరుట్ల మున్సిపాలిటీ- 64.49 శాతం నమోదు, రాయికల్ మున్సిపాలిటీ- 60.47 శాతం నమోదు,సత్తుపల్లి మున్సిపాలిటీ- 71.82 శాతం, మెదక్ , 74 ,16 తూప్రాన్ -75 ,64 శాతం నమోదు, రామయంపేట్- 80.5 శాతం నమోదు, నర్సాపూర్ -61.63 శాతం నమోదు,సంగారెడ్డి -67.02 శాతం నమోదు, ఆందోలు -76 .7 శాతం నమోదు, నారాయణ్ ఖేడ్ - 68 .8 శాతం నమోదు, సదాశివపేట - 75 -58 శాతం నమోదు, ఐడిఏ బొల్లారం- 60.,4 శాతం నమోదు, తెల్లపూర్ -74 .02 శాతం నమోదు, అమీన్ పూర్ -56.9 శాతం నమోదు, హుస్నాబాద్ -77.86  శాతం నమోదు,  గజ్వెల్ 74.21 శాతం నమోదు, దుబ్బాక -76.3 శాతం నమోదు, చేర్యాల -74.04 శాతం నమోదు.

పెద్దపల్లిలోని.రామగుండం కార్పొరేషన్ హనుమాన్ నగర్ లో రూ. 76,000 ల విలువచేసే  245 మద్యం బాటిల్ లు, 36,300 ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. 

పోలింగ్‌ అప్‌డేట్స్‌
► పెద్దపల్లి బండారీ కుంటలో పోలీసుల తీరుపై రోడ్ పై కాంగ్రెస్ నాయకులు బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు.
► సిరిసిల్ల  18వ వార్డులో స్వతంత్య్ర అభ్యర్థికి, టీఆర్‌ఎస్‌  అభ్యర్థి మధ్య గొడవలు రావడంతో పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
►మంచిర్యాల 14వ వార్టులో ఇద్దరు నకిలీ ఓటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ 5000 స్వాధీనం చేసుకున్నారు.
గంటల వరకు తెలంగాణ లోని 120 మున్సిపాలిటీ లు, 9 కార్పొరేషన్ల లో 67.46 శాతం పోలింగ్‌ నమోదు
►మేడ్చల్‌ జిల్లాలో 3 గంటల వరకు 51.86 పోలింగ్‌ నమోదు
► రంగారెడ్డి జిల్లాలో 3 గంటల వరకు 55.1 శాతం పోలింగ్‌
►  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 26 వార్డ్ లోని 63 64 పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత
►  బోధన్ 32వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి మీర్ ఇల్యాజ్ అలీల మధ్య ఘర్షణ, టీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ కు గాయాలు. చికిత్స కొరకు బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలింపు.. మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే షకీల్. కేస్ నమోదు చేసిన పోలీసులు
► నిజామాబాద్‌లో పోలింగ్ సందర్భంగా పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో స్వల్ప ఉద్రిక్తం నెలకొనడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
► నిజామాబాద్ 41 వ డివిజన్ లో ఉద్రిక్తత. నెలకొంది. బీజేపీ ఎంపీ అర్వింద్‌కు  పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని ఎంపీ ఆరవింద్ ఆరోపణలు చేశారు. 
► పెద్ద అంబర్ పెట్ మున్సిపల్ ఎన్నికల్లో  ఓటు వేయడానికి వచ్చిన దొంగ ఓటర్‌ను  పట్టుకొని స్థానికులు దేహశుద్ది చేశారుతొర్రూరు
► మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శివలింగయ్య సందర్శించారు
► గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 58 వ పోలింగ్ బూత్ లో మాజీ మంత్రి డీకే అరుణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
► కొడంగల్  మున్సిపాలిటీ లోని మొదటి వార్డు లో మాజీ ఎమ్మెల్యే ఆర్.గుర్నాథ్ రెడ్డి. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
► మంచిర్యాల జిల్లాలో 1 గంట వరకు 53.18 శాతం పోలింగ్‌ నమోదు
► మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ 5వ డివిజన్ అబ్యర్తి మురుగేష్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడని అడిగినందుకు మురుగేష్ కాంగ్రెస్ కార్యకర్తను చితక బాదాడు
►నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుందని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 
►ఐటీ కంపెనీలు ఏవైతే సెలవు ప్రకటించని కంపెనీల పై ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు
►నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్‌ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం వీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు సరిగా లేవంటూ  సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్‌, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు  మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది.

మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్
ఓటర్లను గుర్తించేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

► పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ 3వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల‌ కార్యకర్తల్ని పోలీసులు తరిమికొట్టారు
►బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మధ్యాహ్నం 1 గంటల వరకు 49.10 శాతం పోలింగ్ నమోదు
►ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మధ్యాహ్నం 1 గంటల వరకు 45.91 శాతం‌ పోలింగ్ నమోదు
►నిజాంపేట్ 1 గంట వరకు 26.08 శాతం పోలింగ్‌ నమోదు
► హుజురాబాద్‌ 1 గంట వరకు 61. 12 శాతం పోలింగ్‌
►రంగారెడ్డి జిల్లా లో ఒంటి గంట వరకు 52.13 పోలింగ్ శాతం
►పరకాల మున్సిపాలిటీలో మధ్యాహ్నం1గంట వరకు 60.64 పోలింగ్ శాతం నమోదు
►డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికలలో మధ్యాహ్నం 1గంట వరకు 62.6  శాతం పోలింగ్ నమోదు
►తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1గంట వరకు 52.63శాతం పోలింగ్ నమోదు
►వర్ధన్నపేట మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1గంట వరకు 69.12శాతం పోలింగ్ నమోదు
►తుంకుంట మున్సిపాలిటీ లో మధ్యాహ్నం 1గంట వరకు 51.01శాతం పోలింగ్ నమోదు
►జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం 1గంట వరకు 60.65శాతం ఓట్లు పోలు అయ్యాయి

మెట్‌పల్లిలోని రేగుంట గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌

►కోరుట్ల మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1గంట వరకు 52.55శాతం పోలింగ్ నమోదు
►సుల్తానాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్లో మధ్యాహ్నం 1 గంట వరకు  63.03శాతం పోలింగ్ నమోదు
►మేడ్చల్ జిల్లా ఫిర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 33 శాతం పోలింగ్ నమోదు
►జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ ఇప్పటివరకు 25 శాతం పోలింగ్
►రంగారెడ్డి జిల్లా ఆది బట్ల మున్సిపాలిటీ లో 11గంటల వరకు 51.86శాతం పొలింగ్ నమోదు
►తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 38.53% పోలింగ్ నమోదు.
►రాజేంద్రనగర్: మణికొండ మున్సిపాలిటీ పరిధిలో 10శాతం, బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో 14శాతం, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 15శాతం 11గంటల వరకు పోలింగ్ జరిగింది.
►చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 11 గంటల వరకు 47.06శాతం ఓటింగ్ జరిగింది
►సూర్యాపేట జిల్లాలో 11 గంటల వరకు 37.09శాతం పోలింగ్ నమోదు

►జగిత్యాల జిల్లాలో జగిత్యాల మున్సిపాలిటీ 28.89శాతం, మెట్ పల్లి మున్సిపాలిటీ 32.05శాతం, కోరుట్ల మున్సిపాలిటీ 33.43శాతం, రాయికల్ మున్సిపాలిటీ 32.64శాతం, ధర్మపురి మున్సిపాలిటీ 36.93శాతంగా 11 గంటల వరకు పోలింగ్‌ నమోదు
►పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ 26 శాతం, పెద్దపల్లి మున్సిపాలిటీ 38శాతం, సుల్తానాబాద్ మున్సిపాలిటీ 44శాతం, మంథని మున్సిపాలిటీ 47శాతంగా 11 గంటల వరకు పోలింగ్‌ నమోదు 
►కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ 40.60శాతం, హుజురాబాద్ మున్సిపాలిటీ 39.65శాతం, కొత్తపల్లి మున్సిపాలిటీ 40శాతం, చొప్పదండి మున్సిపాలిటీ 36.98శాతంగా 11 గంటల వరకు పోలింగ్‌ నమోదు
►డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.9 శాతం పోలింగ్ నమోదయింది

►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 11 గంటల వరకు 39.86 శాతం పోలింగ్ నమోదు
►మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఉదయం 11 గంటల వరకు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 28.36శాతం, నాగారం మున్సిపాలిటీలో 30.75శాతం పోలింగ్ నమోదు.
►రంగారెడ్డి జిల్లా భడాంగ్ పేట్ కార్పొరేషన్‌లో ఉదయం 11.30.గంటల వరకు 16.2శాతం పోలింగ్ నమోదు
►నిజాంపేట్‌లో 11 గంటల వరకు 17.69శాతం పోలింగ్.. ఉదయం నుండి మందకొడిగా సాగుతున్న పోలింగ్

►తుక్కుగూడ మున్సిపాలిటీ 15 వార్డులో 11 గంటల వరకు 41.38  శాతం పోలింగ్
►కామూరెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో  33.35శాతం, ఎల్లారెడ్డి 43.17శాతం, బాన్సువాడ 41.75శాతం పోలింగ్‌ నమోదు
►బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదు
►రాజన్న సిరిసిల్లలో 11 గంటల వరకు 33.48 శాతం, వేములవాడలో 42 శాతం పోలింగ్ నమోదు
►జగిత్యాల జిల్లా మెట్‌పల్లి  మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 32.05శాతం పోలింగ్ నమోదు
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో  11 గంటల వరకు 42 శాతంగా పోలింగ్ నమోదు


సిరిసిల్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ కృష్ణ భాస్కర్

►మెట్‌పల్లిలో ఓటు వేసిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
►వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి… మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా 29 వ వార్డు లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్క మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
►నిజామాబాద్ కాకతీయ కళాశాలలోని గోదావరి క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ తన సతీమణి ప్రియాంకాతో కలిసి ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.
►ఖమ్మం జిల్లా మధిరలోని 9వ వార్డులో తెలంగాణ సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క.. తన సతీమణి నందినితో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసేందుకు అధికార పార్టీ పోలీస్ వ్యవస్థను వాడుకుంటోందని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారపార్టీ విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని.. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు.

►సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో మంత్రి జగదీష్‌ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్‌లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్‌ బూత్‌లో మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

►మిర్యాలగూడలోని పోలింగ్ సెంటర్ 59 నందు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

►నల్లగొండ పట్టణంలోని 33వ వార్డులో గల నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

►సూర్యాపేట జిల్లా కోదాడలోని 14వ వార్డ్‌లో నల్లగొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఉదయం 8 గంటల సమయంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తోందన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు.  

►వనపర్తి 23వ వార్డులోని  బాయ్స్ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోని ప్రజాస్వామ్యా ప్రక్రియను బలోపేతం చేయాలని అన్నారు.

కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు, మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 11,099 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 45 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోనున్నారు. పోలింగ్‌కు నిర్వహణకు 50వేల మందికి సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. (మేమంటే మేమే)


రాష్ట్రంలోని 80 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరుగుతు నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు గీటురాయిగా మారనున్నాయి. పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారింది. ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించడంతోపాటు భవిష్యత్తులో పదవులు పొందడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ఈ నెల 25న ఫలితాల వెల్లడి సందర్భంగా తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్సీలు, ఎంపీలకు అధిష్టానం ఆదేశించింది. (పుర పోరుకు పటిష్ట బందోబస్తు: డీజీపీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement