కార్పొరేషన్‌లో పాగా వేయాలి..
Published Thu, Aug 15 2013 6:24 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
దుబ్బ, ఇందూరు,న్యూస్‌లైన్ : రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్ స్థానాలు గెలుచుకొని కార్పొరేషన్‌లో వైఎస్సార్ సీపీ పాగా వేయాలని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ రఫిక్‌ఖాన్ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పార్టీ నగర అనుబంధ కమిటీలు, స్టీరింగ్ కమిటీలను ఆయన ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ... నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలు వారి విభాగాల ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషిచేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు జిల్లా ప్రకాశ్, నవీన్, ప్రమోద్, కృష్ణ, నసియా, అరుణజ్యోతి, ఫరీదా పాల్గొన్నారు.
నగర మహిళా విభాగం...
నగర మిహ ళా విభాగం కన్వీనర్‌గా విజయలక్ష్మి, కో కన్వీనర్‌లుగా అరుణజ్యోతి, ఫరీదాబేగం, నసీమా బే గం,నాగమణి,మలేఖబేగం, రాధ, సునిత, లక్ష్మీని ఎం పిక చేశారు. ీ
స్టరింగ్ కమిటీ సభ్యులుగా రషీదా, లక్ష్మి, అమీనాబేగం, సోని, ఉషారాణి, నఫీషా సుల్తానా, ప్రమీలా, నఫీషా సుల్తానా, సంగీతను ఎంపిక చేశారు.
నగర కార్మిక విభాగం...
పార్టీ నగర కార్మిక విభాగం కన్వీనర్‌గా కట్టారి రాములు, కో కన్వీనర్‌లుగా ఎండీ జానీ బాయ్, ఎండీ బాబాఖాన్, ఎన్.లక్ష్మి, రాములు, ఎన్. భిక్షపతి, గణేశ్‌ను ఎంపిక చేశారు. నగర స్టీరింగ్ కమిటీ సభ్యులు మల్లేశ్, కృష్ణ, కిశోర్, రాజన్న, శ్రీనివాస్, రాజు, శేఖర్, భీమ్‌రావ్, నర్సన్నలకు అవకాశం కల్పించారు.
మైనార్టీ విభాగం...
నగర మైనార్టీ విభాగం కన్వీనర్‌గా సులేమాన్ అన్సారీ, కో కన్వీనర్‌లుగా ముజాయిద్ ఖాన్, సయ్యద్ రహిద్, ముస్తక్, సయ్యద్ అబ్దుల్ ఖాదీర్, మౌలాన్‌ఖాన్, షేక్ జఫ్పర్ హుస్సేన్, షాహిమ్ అక్తర్‌లను ఎంపిక చేశారు. నగర మైనార్టీ స్టీరింగ్ కమిటీలో ఖలీమ్, ఎండీ హసీబ్, ఎండీ సలీం, జమీల్, నిజాముద్దీన్, అన్వరుద్దీన్, షరీఫ్, మహ్మద్, షకీల్ ఖాన్, షేక్ హైమద్, జుబైర్, వాహిద్‌ఖాన్, అఫ్జల్‌ఖాన్, షోయబ్‌ఖాన్, సయ్యద్ ఇమ్రాన్, రషీద్ జానీలకు చోటు కల్పించారు.
Advertisement
Advertisement