Krishna Gadu Ante Oka Range Movie Pre-Release Event Highlights - Sakshi
Sakshi News home page

‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ హిట్‌ కావాలి: ఎమ్మెల్యే దాస్యం

Published Wed, Aug 2 2023 4:29 PM | Last Updated on Wed, Aug 2 2023 5:45 PM

Krishna Gadu Ante oka Range Movie Release Event Highlights - Sakshi

‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’మూవీలో మా వరంగల్‌ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రంగా వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని ఎమ్మెల్యే ద్యాసం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది చిత్రం బృందం.ఈ ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, రైటర్ ప్రసన్న కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ సెక్రటరీ, నిర్మాత కే ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కంటెంట్ ఉంటే సినిమాలు ఆడుతాయి. కంటెంట్‌ను మాత్రమే కాకుండా కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాలి. అవి రెండూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.ఇలాంటి విలేజ్, లవ్ స్టోరీలకు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుండాలి. ఈ మూవీకి వారిద్దరూ కూడా సెట్ అయ్యారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’తెలిపారు.

‘ప్రతి మనిషి జీవితంలో కథలుంటాయి. కృష్ణ అనే యువ‌కుడి క‌థే ఇది. తండ్రి క‌ల‌ను నేర‌వేర్చ‌టానికి కొడుకు ప‌డ్డ క‌ష్టం. త‌న ప్రేమ‌, భావోద్వేగాల‌ను అందంగా చూపించే ప్ర‌య‌త్నమే మా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాను రాజేష్ గారు మలిచారు’అని నిర్మాత పెట్లా రఘురామ్‌ మూర్తి అన్నారు. ‘కృష్ణ, సత్య పాత్రల్లో రిష్వి, విస్మయ అద్భుతంగా నటించారు’ అని డైరెక్టర్ రాజేష్ దొండపాటి  అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement