
టిక్ టాక్ వీడియోల్లో ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు టిక్‌టాక్ యాప్‌లో సరదా వీడియోలు అప్‌లోడ్ చేసి.. హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టిక్‌టాక్ వీడియోలు వైరల్ కావడంతో కార్పొరేషన్ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో పనులను పక్కనపెట్టి ఇలా టిక్‌టాక్‌లతో కాలక్షేపం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మొదటి చర్యగా ఆయా ఉద్యోగుల సెక్షన్లు మార్చారు.
ఈ క్రమంలో టిక్ టాక్ వీడియోలు చేసిన సిబ్బంది వ్యవహారంపై తాజాగా ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ స్పందించారు. టిక్‌టాక్ వీడియోలు చేసిన వారిపై శాఖపరంగా అంతర్గత క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, వారిని విధుల నుంచి తొలగించలేదని, సస్పెండ్ కూడా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆ సిబ్బంది విధులను కొంతకాలం నిలుపడం, జీతాల్లో కోత విధించడం వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment