ఆస్తిపన్ను చెల్లించిన సినీ నటుడు
నార్సింగి: బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంటి యజమానులు తమ ఆస్తిపన్ను చెల్లించి మరింత మెరుగైన సేవలు పొందాలని గ్రామ సర్పంచ్ హరికృష్ణ కోరారు. సినీనటుడు రాజా బుధవారం బండ్లగూడ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి సాయిరామ్‌నగర్ కాలనీలోని తమ ఇంటి ఆస్తిపన్ను చెల్లించారు.
సర్పంచ్ స్వయంగా ఆస్తిపన్ను స్వీకరించి రాజాకు రసీదు అందజేశారు. హీరో రాజా లాగ అందరు తమ ఆస్తిపన్నును విధిగా చెల్లించాలని కోరారు. మార్చి నెల చివరి రోజు వరకు వేచి చూడకుండా ఆస్తిపన్ను చెల్లించాలన్నారు. చెల్లించిన పన్నుతోనే అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. అందరూ ఆస్తిపన్ను చెల్లించి అభివృద్ధికి పాటుపడాలని సినీహీరో రాజా పిలుపునిచ్చాడు.