ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా నడుపుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.
హైదరాబాద్ : ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా నడుపుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. మలక్‌పేట్‌లోని సిగ్నేచర్ బార్ యాజమాన్యం రూ.6 లక్షల ప్రాపర్లీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో బార్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వనస్థలిపురంలోని స్వాగత్ హోటల్ యాజమాన్యం రూ.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో హోటల్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.