గత పదేళ్లలో గణనీయంగా తగ్గిన ఇళ్లలో వంట
పెరిగిన ఫుడ్ డెలివరీ..ప్రాసెస్డ్ ఫుడ్‌కు, డైనింగ్ ఔట్‌కు పెరిగిన డిమాండ్
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజా నివేదికలో వెల్లడి
కుటుంబ ఆదాయాల పెరుగుదలతో మారుతున్న తిండి ప్రాధాన్యతలు
దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే.. బయటి తిండికే ఎక్కువ మొగ్గు
మూడింతలు పెరిగిన ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: ఇటీవలికాలంలో కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. జీవన శైలి మారుతోంది. భా ర్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీ నితో మన దేశంలోని కుటుంబాలు ఇళ్లలో వంట గదికి టాటా చెప్తున్నారని.. హోటళ్ల బాట పడుతు న్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఇంట్లో వంట చేసుకోవడానికి బద్ధకంతోపాటు వివిధ వెరైటీల ఆహారం తినాలన్న కోరిక దీనికి కారణమని వెల్లడైంది. ప్రాసెస్డ్ ఆ హారం వినియోగం భారీగా పెరిగినట్టు తేలింది.
వీధివీధినా వెలసిన రెస్టారెంట్లు, హోటళ్లు, విస్తృతంగా అందుబాటులోకి ఫుడ్ డెలివరీ యాప్‌లు, నిమిషాల్లో సరుకులు తెచ్చిచ్చే గ్రోసరీ యాప్‌లు.. దీనికి మరింత ఊతమిస్తున్నట్టు వెల్లడైంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంఓఎస్‌పీఐ), ఐసీఐసీఐ సెక్యూరి టీస్ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యా యి. ఆ నివేదికల్లోని గణాంకాలను పరిశీలిస్తే..
♦ అంతకుముందటి పదేళ్లతో పోల్చితే 2022–23 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లోని అధిక ఆదాయ వర్గాల వారు ప్యాకేజ్డ్ ఫుడ్, డైనింగ్ ఔట్, పుడ్ డెలివరీ సరీ్వసెస్ కోసమే తమ ఫుడ్ బడ్జెట్‌లో 50శాతానికిపైగా ఖర్చు చేశారు. గతంలో ఇది 41.2 శాతమే.
♦ మధ్యతరగతి కుటుంబాలు తమ ఆహార బడ్జెట్‌లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై చేస్తున్న ఖర్చు 16శాతం నుంచి 25 శాతానికి (గత పదేళ్లలో) పెరిగింది.
♦ అధికాదాయ కుటుంబాలకు సంబంధించి చూస్తే.. ‘స్టేపుల్ ఫుడ్ (ముడి ఆహార పదార్థాల)’పై వ్యయం తగ్గుతోందని.. క్రమంగా వారి ఇళ్లలో వంట గదులకు పనిలేకుండా పోతోందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది.
♦ 2022–23లో అధికాదాయ కుటుంబాల తలసరి ఫుడ్ డెలివరీ వ్యయం ఏకంగా రూ.971గా ఉంది. అదే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల్లో తలసరి ఫుడ్ డెలివరీ ఖర్చు రూ.60గా ఉంది.
♦ గత పదేళ్లతో పోల్చితే ఇంట్లో వంట చేసుకోవడం తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం, డెలివరీ యాప్‌ల ద్వారా తెప్పించుకోవడం బాగా పెరిగింది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
♦ గత పదేళ్లలో పోల్చితే ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగించే అధికాదాయ కస్టమర్లు రెండింతలు పెరిగారు. అదే మధ్య తరగతి కస్టమర్లు మూడింతలు పెరిగారు.
♦ అధికాదాయ వర్గాల వారు.. చక్కెర శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, సేంద్రియ ఆహారం, పానీయాల వంటి వాటి వినియోగం పెంచారు. మిగతా వర్గాల వారూ వాటివైపు ఆకర్షితులవుతున్నారు.
♦ డ్రైఫ్రూట్స్‌పై చేస్తున్న కుటుంబ వ్యయం పట్టణ ప్రాంతాల్లో 1.3శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.2శాతంగా ఉంది.
♦ పట్టణ ప్రాంత కుటుంబాల ఆదాయం పెరిగినా.. ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై ఖర్చు తగ్గి.. ధాన్యాలు (సెరీల్స్), కోడిగుడ్లు, చేప, మాంసం, వంటనూనె వంటి వాటి వినియోగం గతంలోని స్ధాయిలోనే ఉండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment