సాక్షి, చెన్నై: రేషన్ కార్డుకు ఆస్తి పన్ను నంబరు లింక్ చేయడానికి నగర పాలక, స్థానిక సంస్థలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని గుర్తింపు కార్డులకు, ప్రభుత్వ రాయితీ, పథకాలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత నెల రోజులుగా విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం శరవేగంగా జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డుకు ఆస్తి పన్ను నంబర్‌ను లింక్ చేయాలన్న నిర్ణయానికి నగర పాలక, స్థానిక సంస్థలు వచ్చాయి. బియ్యం కార్డు కలిగి ఉన్న రేషన్‌కార్డుదారులు ఏ మేరకు సొంతిళ్లను కలిగి ఉన్నారో, వారి ఆస్తుల వివరాలు రాబట్టేందుకు ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. లగ్జరీ కార్లు, బంగళాలు కలిగి ఉన్న వారు సైతం రేషన్ ద్వారా ప్రభుత్వ రాయితీలను పొందుతూ వస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టడం లక్ష్యంగా ఈ లింక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ఎస్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment