గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల ఇళ్ల ముందు జీహెచ్ఎంసీ చెత్తడబ్బాలు ఉంచటంపై న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నేరం చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీని హెచ్చరించింది. గంటలోగా చెత్తడబ్బాలను తొలగించాలని హైకోర్టు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఆస్తి పన్ను వసూలుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, అంతేకానీ చెత్తడబ్బాలను ఇళ్ల ముందు ఎలా పెడతారని ప్రశ్నించింది. చెత్త డబ్బాలు తొలగించకపోతే కమిషనర్, అధికారులపై చర్యలుకు ఆదేశిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. కాగా ఆస్తిపన్ను వసూలుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి.