సాక్షి, హైదరాబాద్: వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)గా ఆస్తిపన్ను బకాయిల పెనాల్టీలపై 90 శాతం రాయితీ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నే. త్వరలో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ. 2100 కోట్లు అయినప్పటికీ, గతనెల 20 వరకు రూ.1269 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఆరి్థక కష్టాల్లో ఉంది.
నెలనెలా సిబ్బంది జీతభత్యాల చెల్లింపులకే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో పలు పర్యాయాలు కల్పించిన ఓటీఎస్ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ స్కీమ్ అమల్లోకి వస్తే ఆస్తిపన్ను బకాయిదారులు అసలుతో పాటు బకాయిల వడ్డీలపై కేవలం 10 శాతం పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది. అది ఎందరికో వెసులుబాటుగా ఉండటమే కాక జీహెచ్‌ఎంసీ ఆరి్థక కష్టాల నుంచి గెట్టెక్కేందుకూ ఉపకరిస్తుంది. ఈ అంశాన్ని వివరిస్తూ లేఖ రాశారు. పరిశీలనలోకి తీసుకుని ప్రభుత్వం అవకాశం కల్పించగలదని ఆశిస్తున్నారు.
ఆస్తిపన్ను బకాయిలు (వడ్డీలపై పెనాల్టీలతో సహా)..
► 4,95,628 ప్రైవేట్ యజమానుల భవనాలకు సంబంధించి బకాయిలు రూ.1887.59 కోట్లు కాగా, వడ్డీల పెనాల్టీలతో కలిపి అవి రూ.4522.18 కోట్లకు పేరుకుపోయాయి.
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1800 భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు రూ. రూ.1622.16 కోట్లు కాగా, వడ్డీల పెనాలీ్టలతో సహ అవి రూ.5281.21 కోట్లకు పేరుకుపోయాయి.
► అన్నీ వెరసి పేరుకు పోయిన మొత్తం బకాయిలు రూ.9803.39 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment