ఏలూరు : పట్టణాల్లోని ఇళ్లు, స్థలాలు, వాణిజ్య సముదాయూలు, ఇతర ఆస్తులకు సంబంధించిన యజమానులు తమ ఆస్తుల వివరాలతో ఆధార్ నంబర్‌ను విధిగా అనుసంధానించుకోవాలనే నిబంధన అటు మునిసిపాలిటీలను, ఇటు యజమానులను అవస్థల పాలుచేస్తోంది. ఆధార్ అనుసంధానం చేరుుంచిన వారినుంచే ఇంటి, ఆస్తి పన్నులను వసూలు చేస్తామని మునిసిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యజమానులు ఆధార్ అనుసంధానం చేరుుంచకపోతే, వాటిలో అద్దెకు ఉంటున్న వారి పేర్లతో గల ఆధార్ నంబర్లను సంబంధిత ఆస్తులతో నమోదు చేసుకుంటామని కూడా చెబుతున్నారు. ఆస్తుల యజమానుల్లో కొందరు విదేశాల్లో ఉండటం, ఇంకొందరు దూర ప్రాంతాల్లో నివసిస్తుండటంతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ముందుకు సాగటం లేదు. మరోవైపు మునిసిపల్ అధికారుల హెచ్చరికలు ఆస్తుల యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారుు. ఆధార్ అనుసంధానం ఎటు తిరిగి ఎటు వస్తుందోననే ఆందోళన వారిని వెన్నాడుతోంది.
పన్నుల వసూళ్లపైనా ప్రభావం
మరోవైపు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఆస్తి పన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏలూరు నగరపాలక సంస్థతోపాటు అన్ని పురపాలక సంఘాల్లో ఆశించిన మేర పన్నులు వసూలు కావడం లేదు. ఆస్తి వివరాలను సమర్పించి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేరుుంచుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన వాటి యజమానుల్లో నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండో అర్ధ సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం రూ.21.82 కోట్ల మేర పన్నులు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ కేవలం రూ.13.87 కోట్లు మాత్రమే వసూలైంది. సగటున 62.94 శాతం మేర పన్నులు వసూలైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నారుు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి సుమారు 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా ఆస్తి పన్నులను పూర్తిస్థారుులో వసూలు చేసే పరిస్థితి లేదని మునిసిపల్ వర్గాలు పేర్కొంటున్నారుు.
అపరాధ రుసుం విధింపుతో బెంబేలు
పురపాలక సంఘాల్లో పన్ను బకారుుల చెల్లింపులకు అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ నెలలో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గడువు త క్కువ ఇవ్వడంతోపాటు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంతో ఆస్తుల యజమానులు బకారుుల చెల్లింపు విషయంలో పెద్దగా స్పందించలేదు. దీంతో అప్పటినుంచి పన్నుల వసూళ్లు మందగించాయి. కాగా, సకాలంలో పన్నులు చెల్లించని వారినుంచి అపరాధ రుసుం వసూలు చేసే అవకాశాలు ఉన్నట్టు భోగట్టా. అపరాధ రుసుం నుంచి మినహారుుంపు ఇస్తే తప్ప పన్నుల వసూళ్లు ఊపందుకునే అవకాశం లేదని మునిసిపల్ వర్గాలు పేర్కొంటున్నారుు. దీనిపై ప్రభుత్వం ముందుగా ప్రకటన చేస్తే వసూళ్లలో పురోగతి ఉంటుందని మునిసిపల్ పాలకవర్గాలు భావిస్తున్నారుు.
తణుకు ప్రథమం.. జంగారెడ్డిగూడెం అథమం
తణుకు పురపాలక సంఘం 86.12 శాతం మేర పన్నులు వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలవగా, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ 32.82 శాతం వసూలు చేసి చివరి స్థానంలో ఉంది. ఏలూరు నగరపాలక సంస్థ 54.08 శాతం వసూళ్లతో కాస్త ఫరవాలేదన్న విధంగా ఉంది. భీమవరంలో 70.12 శాతం, తాడేపల్లిగూడెంలో 71.39 శాతం, పాలకొల్లులో 40.92 శాతం, నరసాపురంలో 72.20 శాతం, నిడదవోలులో 73.62 శాతం, కొవ్వూరులో 56.06 శాతం పన్నులు వసూలయ్యూయి.
ఆస్తిపన్నుకూ ‘ఆధార్’మే
Published Wed, Feb 11 2015 5:32 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement