ఆస్థిపన్ను దాఖలు చేసే విషయంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తప్పుడు సమాచారం ఇస్తూ అడ్డంగా దొరికిపోయింది. పన్ను తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నం వికటించి అసలుకే ఎసరు తెచ్చింది. లక్షల్లో పన్ను తప్పించుకోవాలని చూస్తే చివరకు జరిమానాతో కలిపి వ్యవహారం కోట్లకు చేరుకుంది.
హైదరాబాద్ నగర పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని బాచుపల్లి ఏరియాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆస్పత్రికి 9 అంతస్థులతో భవన నిర్మాణ అనుమతులు కూడా వచ్చాయి. అయితే మున్సిపాలిటీకీ ఆస్తి పన్ను చెల్లించాల్సిన సమయంలో ఉన్న విలువ కంటే తక్కువ విలువ చూపిస్తూ దరఖాస్తు చేశారు.
మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అనుమానం వచ్చి విచారణ చేపట్టగా ఆస్తి వివరాలు తక్కువ చేసి చూపినట్టుగా తేలింది. దీంతో ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన మున్సిపల్ చట్టాల ప్రకారం.. ఎంత పన్నును తక్కువ చూపించారో దానికి 25 రెట్లు జరిమానాగా విధించారు. దీంతో సదరు హాస్పిటల్ యాజమాన్యానికి ఏకంగా రూ.24 కోట్ల రూపాయలు జరిమానా పడింది.
చదవండి: హైదర్‌గూడ డీ మార్ట్‌కి షాక్! ఇకపై అలా చేయొద్దంటూ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment