
పాత నోట్లతో.. ఆస్తిపన్ను చెల్లింపు బంద్
సిటీబ్యూరో: పాత పెద్ద నోట్ల(రూ500, రూ.1000)తో ఆస్తిపన్ను, ఎల్‌ఆర్‌ఎస్ తదితర ఫీజుల చెల్లింపు గురువారం అర్ధరాత్రితో ముగిసింది. ఇకపై పాతనోట్లను స్వీకరించబోమని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. గురువారం రాత్రి 11 గంటల వరకు రూ.26.19 కోట్లు వసూలు అరుునట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. సర్కార్ తీసుకున్న పాతనోట్ల రద్దు ప్రకటనతో 15 రోజుల్లో జీహెచ్‌ఎంసీకి మొత్తం రూ.246.02 కోట్లు వసూలు అరుుంది.