సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రాపర్టీ టాక్స్‌పై వడ్డీ భారాన్ని తగ్గిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకే ఈ నిర్ణయం వెలువడింది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం కింద ప్రాపర్టీ టాక్స్‌పై కేవలం 10శాతం వడ్డీ కడితే సరిపోతుంది. ఈ అవకాశం కేవలం 45 రోజులు పాటు (ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15) మాత్రమే కల్పించారు. భారీగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 5.64లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా.. ఇప్పటి వరకు రూ. 1477.86 బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment