
‘చెత్త’ యోచనకు స్వస్తి
ఆస్తి పన్ను బకాయిదారులను దారికి తెచ్చుకునేందుకు ఇళ్లు, షాపులు, బ్యాంక్‌ల ముందు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన
బంజారాహిల్స్: ఆస్తి పన్ను బకాయిదారులను దారికి తెచ్చుకునేందుకు ఇళ్లు, షాపులు, బ్యాంక్‌ల ముందు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను (డంపర్ బిన్‌లు) శుక్రవారం ఉదయం సంబంధిత అధికారులు తొలగించారు. బకాయిదారుల నుంచి పన్నులు రాబట్టేందుకు సర్కిల్-10 అధికారులు గురువారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడలలో 12 చోట్ల చెత్తకుండీలను ఏర్పాటు చేశారు.
కాంప్లెక్స్‌ల ముందు, ఇళ్ల గేట్ల మధ్య వీటిని పెట్టడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు హుటాహుటిన వీటిని తొలగించారు.