
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కంట్రోల్–ఎస్ 2025 మార్చి నాటికి కేంద్రాల సంఖ్యను 25కు చేరుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఖాతాలో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 డేటా సెంటర్లు ఉన్నాయి. రెండేళ్లలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం తోడవనుంది. ప్రస్తుతం నవీ ముంబైలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ డేటా సెంటర్ పార్క్ నిర్మాణంలో ఉంది.
ఇదే స్థాయిలో హైదరాబాద్ కేంద్రం నిర్మాణానికి సిద్ధంగా ఉందని కంట్రోల్–ఎస్ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చెన్నై డేటా సెంటర్ పనులు మొదలయ్యాయి. ఈ మూడు కేంద్రాల చేరికతో 600 మెగావాట్ల సామర్థ్యం సంస్థకు జతకూడనుంది. కోల్‌కతలో సైతం ఫెసిలిటీ ఏర్పాటు కానుంది. రేటెడ్–4 డేటా సెంటర్ల నిర్వహణలో కంట్రోల్–ఎస్ ఆసియాలో తొలిస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment