తల్లిదండ్రుల పేరుతో నిర్మించిన బస్టాండ్
యశవంతపుర(బెంగళూరు): తల్లిదండ్రుల పేరుతో కొడుకులు బస్టాండ్ నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఉడుపికి చెందిన అట్టింజె శంభుశెట్టి, హేమలతల వివాహ స్వర్ణ మహోత్సవం సందర్భంగా వారి కుమారులు శిర్వ గ్రామంలో హైటెక్ బస్టాండ్ నిర్మించి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆగమ విద్వాంసుడు కేంజి శ్రీధర తంత్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
లౌడ్‌స్పీకర్లకు అనుమతి
బనశంకరి: మసీదు, మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి కోరుతూ 959 దరఖాస్తులు అందగా 121 దరఖాస్తులకు చట్టప్రకారం అనుమతి ఇచ్చామని, మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తామని నగరపోలీస్‌కమిషనర్ సీహెచ్.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఈద్గామైదానంలో సమావేశానికి అనుమతి కోసం ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేయలేదన్నారు. దరఖాస్తు చేస్తే చట్టపరంగా ఏమి చేయాలో అది చేస్తామన్నారు.
చదవండి: కొనసాగుతున్న ప్రకంపనలు.. ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే
Comments
Please login to add a commentAdd a comment