
నూతన దంపతులు మల్లేశ, భాగ్య
మండ్య(బెంగళూరు): ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువ జంటను పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మండ్య తాలూకాలోని చీరనహళ్ళిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేశ అలియాస్ బల్లేశ, శిడ్లఘట్టకు చెందిన భాగ్య ప్రేమలో పడ్డారు. ఈ నెల 8న రిజిస్టర్ పెళ్ళి చేసుకుని చీరనహళ్ళిలోని ఇంట్లో దిగారు. తమ కూతురు కనపడడం లేదని భాగ్య తల్లిదండ్రులు శిడ్లఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో శనివారం అర్ధరాత్రి కనీసం మహిళా పోలీసులు కూడా లేకుండా మగ పోలీసులు వచ్చి యువ దంపతులను స్థానిక ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు స్టేషన్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. విషయం ఎస్పీకి తెలిసి తక్షణమే జంటను వదిలిపెట్టాలని ఆదేశించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని చెప్పి పంపారు. తమకు ప్రాణభయం ఉందని కొత్త జంట ఆందోళన వ్యక్తంచేసింది.
చదవండి: Jammu and Kashmir: 100 నాటౌట్