భోపాల్: తమ తండ్రిని అరెస్ట్ చేయాలంటూ ఇద్దరు బాలికలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ జిల్లాలోని భితర్వాల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎప్పటిలానే ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు బాలికలు భయం భయంగా పోలీస్‌స్టేషన్‌లోకి అడుగుపెట్టారు.
లోపల పని చేస్తున్న కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఇస్తాం మా నాన్నను అరెస్ట్ చేయండి అని అనగానే ఒక్కసారిగా అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆ కానిస్టేబుల్ స్టేషన్ ఇన్‌చార్జి ప్రదీప్ శర్మ దగ్గరకు తీసుకెళ్లాడు. ముందుగా ప్రదీప్ ఆ బాలికలకు భయపడకండని ధైర్యం చెప్పి... వారి సమస్య ఏంటో వివరించమన్నాడు. దీంతో వాళ్లిద్దరూ ఏడుస్తూ ‘మా తల్లిదండ్రులు తరచూ గొడవపడుతుంటారు. ఈ క్రమంలో మా నాన్న అమ్మను కొడుతుంటాడు. అది మేము చూడలేకపోతున్నాం.
మా నాన్నను జైల్‌లో పెట్టండి అంకుల్’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు. విషయం అర్థం చెసుకున్న ప్రదీప్ ఆ బాలికలిద్దరినీ వాళ్ల ఇంటికి తీసుకువెళ్లి విడిచిపెట్టాడు. అనంతరం వారి తల్లిదండ్రులకు ఈ విషయమై కాన్సిలింగ్ ఇచ్చాడు. ఇలా పిల్లల ముందు గొడవ పడుతుంటే వారిపై ప్రభావం పడుతుందని, ఇంకోసారి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని బాలికల నాన్నను హెచ్చరించాడు.
చదవండి: కేంద్ర మంత్రి ఉల్లిపాయల ఐడియా!.. మీరూ ట్రై చేస్తారా..?
Comments
Please login to add a commentAdd a comment