పరువు హత్య: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. పొలంలో.. | Karnataka: Parents Assassinated Daughter Over Love | Sakshi
Sakshi News home page

పరువు హత్య: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. పొలంలో..

Jun 8 2022 6:52 AM | Updated on Jun 8 2022 11:41 AM

Karnataka: Parents Assassinated Daughter Over Love - Sakshi

మైసూరు(బెంగళూరు): జిల్లా పరిధిలోని పిరియా పట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో పరువు హత్య వెలుగు చూసింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించిన  పాపానికి ఓ బాలిక పొలంలో శవమై తేలింది. పిరియాపట్టణ పోలీసుల కథనం మేరకు... కగ్గుండి గ్రామానికి చెందిన సురేశ్, బేబీ దంపతుల కుమార్తె శాలిని (17) పక్క గ్రామానికి చెందిన మంజు అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి ప్రేమను శాలిని తల్లిదండ్రులు నిరాకరించారు.

దీంతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి పట్టుకొచ్చారు. మైనర్‌ బాలిక కావడంతో శాలినిని బాలసదన్‌కు అప్పజెప్పారు. అయితే తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్తామని సురేశ్, బేబీ దంపతులు చెప్పడంతో బాలసదన్‌ నిర్వాహకులు అంగీకరించారు. ఆ తర్వాత శాలిని పొలంలో శవమై కనిపించింది. తల్లిదండ్రులే హత్య చేసి పడేసినట్లు నిర్ధారిస్తూ నిందితులను పిరియాపట్టణ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. 

చదవండి: ప్లాన్‌ ప్రకారమే జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement