చిన్నప్పటి ఫొటోతో పంతూ జోహాన్ పామికిస్
హుబ్లీ: ధార్వాడలో పుట్టాడు, ఊహ తెలిసే వయసులో స్వీడన్ జంట దత్తత తీసుకుని వెళ్లిపోతే అక్కడే పెరిగి పెద్దయ్యాడు. కానీ తానెవరో, తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనే తపన అతన్ని ఊరికే ఉండనివ్వలేదు. సోషల్ మీడియా ఆధారంగా అన్వేషణ సాగిస్తున్నాడు. 1980వ దశకంలో మూడేళ్ల చిన్నారిగా ఉండగా స్వీడన్ దంపతులు దత్తతకు తీసుకొని తీసుకెళ్లారు. పంతూ జోహన్ పామికిస్ అనే పేరుతో 40 ఏళ్ల వ్యక్తి అయ్యాడు.
స్వీడన్‌లో చిత్రలేఖ కళాకారునిగా సేవలు అందిస్తున్నాడు. పుట్టుక మూలాన్ని తెలుసుకోవాలనే ఆరాటంతో తన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇతర సోషియల్‌మీడియాలో పోస్టు చేశాడు. తనకు మిగిలిన ఆధారం ఈ ఫోటోనేనని, తన కన్నవారు ఎవరో తెలియజేయాలని వేడుకొంటున్నాడు.
తల్లి ముఖం అస్పష్టంగా గుర్తుందని తెలిపాడు. ప్రధాని మోదీ, పీఎం ఆఫీసు ట్విట్టర్ ఖాతాలకూ ట్యాగ్ చేశాడు. ఈ నేపథ్యంలో అతని వినతిని పరిశీలించాలని ధార్వాడ ఎస్పీ కృష్ణకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment