bus stop
-
మొభైల్ బస్‌స్టాప్.. ఎప్పుడూ వెళ్లని ప్రాంతాల్లో బస్సు సౌకర్యం
బెంగళూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... అనేది ఒక కోణం.మరో కోణం ఇది...‘నేను ఒక ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పాటు పనిచేశాను. బస్‌స్టాప్ చేరడానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. దీంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది’ అంటుంది రజిని. ‘ఒకరోజు ఏదో ఫంక్షనుకు వెళ్లొస్తుంటే చాలా ఆలస్యం అయింది. ఆ రాత్రి సమయంలో బస్‌స్టాప్ నుంచి నేను ఉండే చోటికి వెళ్లడానికి రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఎంత భయమేసిందో చెప్పలేను’ అంటుంది శ్రీకళ. ‘నేను ఇండ్లలో పనిచేస్తుంటాను. నేను ఉన్న చోట నుంచి బస్‌స్టాప్‌కు రావడానికి అయిదు కిలోమీటర్ల దూరం నడవాలి’ అంటుంది రుక్మిణి. రుక్మిణి, శ్రీకళ, రజని... లాంటి ఎంతోమంది మహిళలు బస్సు ప్రయాణానికి సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఇలాంటి మహిళల విన్నపాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడానికి సృజనాత్మక విధానంలో ఏర్పాటయింది ఈ ట్రావెలింగ్ బస్‌స్టాప్...మరిన్ని సిటీ బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బెంగళూరులోని వివిధ సంఘాలు, కళాకారులు ‘అల్లి సెరోనా’ పేరుతో ఒక వేదికగా ఏర్పడి ‘మొబైల్ బస్‌స్టాప్ ఇన్స్టాలేషన్’ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ బస్‌స్టాప్ బస్సు ఎప్పడూ వెళ్లని ప్రాంతాలకు వెళుతుంది. ఒక ప్రాంతంలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. సాధారణ బస్‌స్టాప్ కంటే సృజనాత్మకంగా ఈ హైపర్–క్రియేటివ్ మొబైల్ బస్‌స్టాప్‌ను రూపొందించారు. దీనిలో టికెట్ కౌంటర్, సిట్టింగ్ ఏర్పాట్లు, న్యూస్‌పేపర్ స్టాండ్, వెయిటింగ్ స్పేస్... మొదలైనవి ఉంటాయి.‘చాలామంది మహిళలు బస్‌స్టాప్‌ల కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. ఈ సమస్య గురించి మొబైల్ బస్‌స్టాప్ ఇన్స్టాలేషన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం’ అంటుంది అల్లి సెరోనా క్రియేటివ్ స్ట్రాటజిస్ట్ తనిషా. ‘అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల కోసం ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాం’ అంటున్నారు కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సురేష్ కాంత.తాము ఉండే ప్రాంతానికి చాలాదూరంగా బస్‌స్టాప్‌లు ఉండడంతో ఎక్కువమంది మహిళలు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బస్సు రాని ప్రాంతాలలో వచ్చేలా ‘అల్లి సెరోనా’తో కలిసి పనిచేస్తోంది మల్లిక. ఇప్పుడు ఉన్న బస్‌స్టాప్‌లు అరకొర సౌకర్యాలతో ఉన్నాయి, కొన్ని నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ట్రావెల్లింక్ బస్‌స్టాప్ ఇన్స్టాలేషన్’ రూపంలో డ్రీమ్ బస్ స్టాప్‌కు రూపకల్పన చేసింది అల్లి సెరోనా. ‘ఈ మొబైల్ బస్‌స్టాప్‌లో ఉన్నట్లే అన్ని బస్‌స్టాప్‌లలో బాగా వెలుతురు ఉన్న లైట్లు, సీసీ కెమెరాలు ఉండాలి. రాత్రివేళల్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఇది ఎంతో ఉపయోగం’ అంటుంది రుక్మిణి. ఈ మొబైల్ బస్‌స్టాప్ ఇన్స్టాలేషన్ పుణ్యమా అని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్లో కదలిక మొదలైంది. చిన్న రూట్స్‌లో కూడా బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. -
రాత్రికి రాత్రే రూ. 10 లక్షల బస్ షెల్టర్ మిస్సింగ్: షాక్‌లో పోలీసులు
కర్నాటకలోని బెంగళూరు నగరంలో మరో బస్షెలర్ట్ మాయం కావడం కలకలం రేపింది. సిలికాన్ సిటీ కన్నింగ్‌హామ్ రోడ్లో నిర్మించిన వారం రోజులకే రూ. 10 లక్షల విలువైన ఈ షెల్టర్ ఉన్నట్టుండి కనపించకుండా పోయింది. బస్ట్ స్టాండ్ మాయం ఏంటి అనిఆశ్చర్య పోతున్నారా? ఇక్కడ బస్ షెల్టర్ అదృశ్యమవడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి వరుస సంఘటనలు ఇక్కడ నమోదుకావడం గమనార్హం. ముప్పయేళ్ల నాటి HRBR లేఅవుట్లోని బస్టాండ్ మార్చిలో రాత్రికి రాత్రే మాయమైంది. ఇపుడు మరో బస్టాండ్. స్టెయిన్లెస్-స్టీల్ స్ట్రక్చర్‌తో, రద్దీగా ఉండే కన్నింగ్‌హామ్ రోడ్లో బస్ షెల్టర్ ఆగస్ట్ 21న ఏర్పాటు చేయగా ఆగస్ట్ 28న కనిపించకుండా పోయింది. ఈ సంఘటన జరిగిన నెల తర్వాత బస్ట్ స్టాప్తోపాటు, స్టీల్ స్ట్రక్చర్ దొంగతనంపై సెప్టెంబర్ 30న ఫిర్యాదు దాఖలైంది. దీంతో బెంగళూరు పోలీసులు బిఎమ్‌టిసి బస్ షెల్టర్ల నిర్మాణాల కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవిరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమీపంలోని భవనాల నుండి CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ బస్ షెల్టర్‌ను బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నిర్మించింది. ఇది బెంగళూరు సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయం వెనుక, విధాన సౌధ నుండి కేవలం 1 కి.మీ దూరంలో ఉండటం పోలీసులకు మరింత సవాల్‌గా మారింది. ఇక ఇలాంటి వరుస సంఘటల విషయానికి వస్తే..అంతకుముందు 1990లో లయన్స్ క్లబ్ విరాళంగా ఇచ్చిన కళ్యాణ్‌నగర్ బస్టాండ్ అదృశ్యమైంది. మరేదో వ్యాపార సముదాయ నిర్మాణం కోసం ఈ చోరీ జరిగిందని ఆ ప్రాంత నివాసితులను ఉటంకిస్తూ మీడియా నివేదికను ఉటంకిస్తూ ఇండియా టుడే నివేదించింది. 2015లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్ స్టాప్ రాత్రిపూటఅదృశ్యమైందని నివేదిక పేర్కొంది. గతంలో 2014లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్ లేఅవుట్ 3వ స్టేజీలో 20 ఏళ్ల నాటి బస్టాప్ కనిపించకుండా పోయింది. -
బస్టాప్‌లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..
హైదరాబాద్: బస్టాప్‌లు ఏర్పాటు చేసేదే బస్సులు ఆపేందుకు.. కానీ బస్టాప్‌లో బస్సులు ఆగడం వల్ల వెనక ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆ బస్టాప్‌లో బస్సులు ఆగొద్దంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం వల్ల ప్రయాణికులు, వాహనదారుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే రోడ్డులో బస్టాప్ ఉంది. ఈ బస్టాప్‌లో గత కొన్ని సంవత్సరాలుగా బస్సులు ఆగుతుంటాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాప్‌లో బస్సులు ఆగడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ బస్టాప్‌లో బస్సులు, ఆటోలు నిలపవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో బస్సులు ఎక్కడ ఆపాలంటూ ఒక వైపు ఆర్టీసీ డ్రైవర్లు, మరోవైపు బస్సులు ఎక్కేందుకు వస్తున్న ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కొరవడిన సమన్వయం... జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో సిగ్నళ్లకు దగ్గరగా ఉన్న బస్టాప్‌ల వద్ద సమస్య ఎదురైతే ట్రాఫిక్ పోలీసులు ముందుగా ఆయా బస్టాప్‌లను తొలగించి మరికొంత దూరంలో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి సూచించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ప్రతిపాదన చేయకుండా సంబంధిత అధికారులు బస్టాప్‌లో బస్సులు ఆపొద్దంటూ బోర్డులు పెట్టడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఇంకాస్త దూరం వెళ్లాక బస్సులు ఆపేందుకు అనువైన స్థలం కూడా లేదు. ఇక్కడ ఇరుకైన రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. నిత్యం ఫిలింనగర్, అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే వందలాది మంది ఇక్కడ బస్సు సేవలను వినియోగించుకుంటుంటారు. రెండు శాఖల అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే వీటిని ఇక్కడి నుంచి తొలగించి ప్రయాణికులకు అనువైన స్థలంలో బస్టాప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ) -
తల్లిదండ్రుల పేరుతో బస్టాండ్
యశవంతపుర(బెంగళూరు): తల్లిదండ్రుల పేరుతో కొడుకులు బస్టాండ్ నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఉడుపికి చెందిన అట్టింజె శంభుశెట్టి, హేమలతల వివాహ స్వర్ణ మహోత్సవం సందర్భంగా వారి కుమారులు శిర్వ గ్రామంలో హైటెక్ బస్టాండ్ నిర్మించి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆగమ విద్వాంసుడు కేంజి శ్రీధర తంత్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లౌడ్స్పీకర్లకు అనుమతి బనశంకరి: మసీదు, మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి కోరుతూ 959 దరఖాస్తులు అందగా 121 దరఖాస్తులకు చట్టప్రకారం అనుమతి ఇచ్చామని, మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తామని నగరపోలీస్‌కమిషనర్ సీహెచ్.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఈద్గామైదానంలో సమావేశానికి అనుమతి కోసం ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేయలేదన్నారు. దరఖాస్తు చేస్తే చట్టపరంగా ఏమి చేయాలో అది చేస్తామన్నారు. చదవండి: కొనసాగుతున్న ప్రకంపనలు.. ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే -
తల్లి మందలించిందని పారిపోయిన యువతి.. చివరికి ఏమైందంటే..
తిరుపతి అర్బన్: తల్లి మందలించడంతో అలిగి వచ్చిన యువతిని తిరుపతి బస్టాండ్ భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని సేలంకు చెందిన సుందర పాండ్యన్ కుమార్తె హాసిని(20) బెంగళూరులో చదువుకుంటోంది. సెలవుల నేపథ్యంలో ఇటీవల ఇంటికి వెళ్లింది. ఇంటి వద్ద చిన్నపాటి పనులు కూడా చేయకుండా సోమరిగా ఉండడంతో, ఆదివారం ఉదయం ఆమె తల్లి కల్యార్సీ మందలించింది. దీంతో అలిగిన హాసిని ఇంటి నుంచి బయల్దేరి వచ్చేసింది. హాసిని తల్లిదండ్రులు సేలం పోలీస్‌స్టేషన్‌లో కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 8గంటలకు హాసిని తిరుపతికి చేరుకుంది. తిరుపతి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువతిని భద్రతా సిబ్బంది షేకా ఖాజా రహంతుల్లా గుర్తించారు. వెంటనే దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో ఆ యువతి వివరాలను తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు మధ్యాహ్నం 1.30గంటల సమయంలో తిరుపతి బస్టాండ్‌కు చేరుకుని వారి కుమార్తెను కలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ భద్రతా సిబ్బందికి, దిశ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఇక్కడ బస్టాప్ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు!
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులే కాదు.. బస్టాపులు కూడా ఉన్నపళంగా మాయమవుతున్నాయి. ఇప్పుడు ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు, ఫ్లైవర్ నిర్మాణ పనుల కారణంగా నగరంలో ప్రజారవాణా స్వరూపం పూర్తిగా మారిపోయింది. గ్రేటర్లో సుమారు 1,050 రూట్లలో బస్సులను నిలిపి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు గతంలో 2,550కుపైగా బస్టాపులు ఉండేవి. విస్తరిస్తున్న మహానగర అవసరాలను దృష్టిలో ఉంచుకొంటే వీటి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. రోజురోజుకూ కొత్త కాలనీలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో సిటీ బస్సులు, బస్టాపులు పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వాటి సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గిపోవడం గమనార్హం. గత రెండేళ్లలో సుమారు 850కిపైగా బస్టాపులను తొలగించినట్లు అంచనా. మరోవైపు కొన్ని రూట్లలో షెల్టర్లు ఉన్న చోట డ్రైవర్లు బస్సులు నిలపడంలేదు. అభివృద్ధి పనుల దృష్ట్యా మార్పులు అనివార్యమే. కానీ.. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండానే బస్టాపులను తొలగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు నిలిపే స్థలాలు తెలియకపోవడంతో గందరగోళం నెలకొంటోంది. మచ్చుకు కొన్ని ప్రాంతాలు.. ► వీఎస్టీ నుంచి ఇందిరా పార్కు వరకు సిటీ బస్సులు నిలిపేందుకు ఆరు చోట్ల బస్టాపులు ఉన్నాయి. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం, జియాగూడ, దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులు, సికింద్రాబాద్ నుంచి కోఠీకి ఈ రూట్లో బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో కొంతకాలంగా జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో బస్టాపులు ఉనికిని కోల్పోయాయి. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఒకప్పుడు వీఎస్టీ బస్టాపులో పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అక్కడ ప్రయాణికులు కనిపించడం లేదు. ►లక్డీకాపూల్ ఒకప్పుడు అతిపెద్ద బస్టాపు. నగరం నలువైపుల నుంచి బస్సులు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండేది. మెట్రో రైలు కోసం బస్టాపులను తొలగించారు. ఒక్క లక్డీకాఫూల్ మాత్రమే కాదు. మాసాబ్‌ట్యాంక్, విజయ్‌నగర్ కాలనీ, ఎన్ఎండీసీ బస్టాపులు కూడా మాయమయ్యాయి. ►హబ్సిగూడ స్ట్రీట్ నంబర్– 8 వద్ద ఒక బస్టాపు ఉండేది. ఇప్పుడు అక్కడ మెట్రో స్టేషన్ వచి్చంది. దీంతో ఆ ఇరుకు రోడ్డుపైనే బస్సులు నిలపడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ► ఫ్లై ఓవర్ రాకతో ఎల్బీనగర్ స్వరూపం మారింది, చాలా చోట్ల బస్టాపుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూపార్కు వద్ద ప్రస్తుతం ఫ్లై ఓవర్ పనులను చేపట్టారు. దీంతో ఆ రూట్ లో బస్సులకు బ్రేక్ పడింది. కానీ అదేసమయంలో ప్రైవేట్ వాహనాలకు ఇప్పుడు బహదూర్‌పురా చౌరస్తా ఒక ప్రధాన అడ్డాగా మారింది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్వీసుల్లోనూ కోత... బస్టాపుల తీరు ఇలా ఉంటే.. సిటీ బస్సుల సేవలు కూడా అందుకు తగినవిధంగానే ఉన్నాయి. వందలకొద్దీ రూట్లలో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలకు, గ్రామాలకు రాకపోకలు సాగించే సుమారు 5 వేలకుపైగా ట్రిప్పులను రద్దు చేశారు. ►షాద్‌నగర్, మేడ్చల్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, చేవెళ్ల తదితర ప్రాంతాల వైపు ఉన్న సుమారు 100కు పైగా గ్రామాలకు 70 శాతం సరీ్వసులు రద్దయ్యాయి. ►గతంలో గ్రేటర్లో 3,850 బస్సులు, ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరిగితే ఇప్పుడు వాటి సంఖ్య 2,700 పరిమితమైంది. వివిధ కారణాలతో కనీసం 10 వేలకు పైగా ట్రిప్పులు రద్దయ్యాయి. -
వీడేవడండి బాబు.. బస్ స్టాప్‌నే ఎత్తుకెళ్లాడు
ముంబై: కార్లు, బైక్‌లు ఎత్తుకెళ్లే వారి గురించి విన్నాం.. చూశాం. చివరకు బస్సు దొంగతనం చేసే వారి గురించి విన్నాం.. చూశాం. కానీ ఏకంగా బస్ స్టాప్‌ని దొంగిలించిన వారిని చూడటం కాదు కదా కనీసం విని కూడా ఉండం కదా. కానీ వాస్తవం.. ఈ సంఘటన పూణెలో చోటు చేసుకుంది. ఎవరో దుండగులు లోకల్ బస్ స్టాప్‌ని దొంగతనం చేశారు. దాంతో వీరిని పట్టించిన వారికి ఐదు వేల రూపాయల బహుమతి ఇస్తామంటూ లోకల్ లీడర్లు ఓ ప్రకటన కూడా ఇచ్చారు. రెడిట్ యూజర్ ఒకరు దీని గురించి షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ‘పూణె మహానగర్ పరివహన్ ప్రజల కోసం దేవాకి ప్యాలెస్ ముందు బిటి కవాడే వద్ద ఏర్పాటు చేసిన బస్ స్టాప్ దొంగతానానికి గురయ్యింది. నిందితుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 5వేల రూపాయల బహుమతి ఇస్తాం’ అంటూ మాజీ ఎన్సీపీ కార్పొరేటర్ ప్రశాంత్ మాస్కే ఏర్పాటు చేసిన బ్యానర్ ఫోటోని షేర్ చేశాడు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (చదవండి: ఆటోడ్రైవర్ల ఫోన్లు మాత్రమే దొంగిలిస్తాడు!) దీని పట్ల రెడిట్ యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎవరో కావాలనే ఇలా చేసి ఉంటారు.. అసలు అక్కడ బస్ స్టాప్ లేనే లేదు.. ముక్కలుగా చేసి పాత ఇనుప సామానుల వాడికి అమ్మేసుకున్నారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. దీని గురించి రెడిట్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి ‘ఈ సంఘటన గురించి ఇద్దరు వీధి వ్యాపారులను అడిగాను. పగటిపూట ఇలాంటి సంఘటన జరగలేదని వారు చెప్పారు. అయితే బస్ స్టాప్‌ని ఎవరు దొంగతనం చేశారో తెలియదు. కానీ అంతకుముందు ఇక్కడ బస్ స్టాప్ ఉన్న మాట వాస్తవం.. ప్రస్తుతం అది దొంగతనానికి గురయిన మాట నిజం’ అంటూ ఫోటో పోస్ట్ చేశాడు. -
బస్టాప్ వెనుక ప్రసవం
జనగామ: నిండు గర్భిణి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో రెండు గంటలు నరకయాతన అనుభ వించింది. నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు కనికరించలేదు. రక్తం తక్కువగా ఉందని... హన్మకొండకు తీసుకెళ్లమని చెప్పి చేతులెత్తేశారు. అంబులెన్స్ అందుబాటులో లేక ఆ గర్భిణి పురిటి నొప్పులతో విలవిల్లాడి పోయింది. చివరకు ప్రభుత్వాసుపత్రి పక్కనే రోడ్డుపైనున్న బస్టాప్ వెనుకకు వెళ్లి పడిపోయింది. అక్కడే ప్రసవించింది. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్‌హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జరిగింది. వైద్యసిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన షేక్ హుస్సేన్ తన భార్య షేక్ బీబీని నాలుగో కాన్పు కోసం ఆదివారం చంపక్‌హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాని(ఎంసీహెచ్)కి తీసుకు వచ్చాడు. అంతకు ముందు సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా, వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్‌లో ఎంసీహెచ్‌కు తరలించారు. ఉదయం 10 గంటలకు డాక్టర్‌ను సంప్రదిం చగా, కాన్పు కోసం మెటర్నిటీ వార్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యురాలు, గర్భిణికి రక్తం తక్కువగా ఉన్నట్లు గుర్తించి వెంటనే హన్మకొండ మెటర్నిటీ దవాఖానాకు రెఫర్ చేశారు. మరోవైపు బీబీకి నొప్పులు తీవ్రమ య్యాయి. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ‘కాన్పు చేయండి.. ఏం జరిగినా మాదే బాధ్యత’ అంటూ వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదు. అంబులెన్స్ కోసం నిరీక్షణ హన్మకొండకు వెళ్లేందుకు బయటకు వచ్చిన గర్భిణికి అంబులెన్స్ కనిపించక పోవడంతో అక్కడే నిరీక్షించింది. గంటసేపు ఎదురు చూసి ప్రైవేట్ వాహనంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యు లు సిద్ధమయ్యారు. అప్పటికే తీవ్ర నొప్పులతో బాధపడుతున్న షేక్బీబీ... ఆస్పత్రి గేటుబయట బస్టాప్ వెనకకు వెళ్లింది. నిమిషం వ్యవధిలోనే అరుపులు, కేకలు వినిపించడంతో తల్లీ, భర్త అటు వైపు వెళ్లారు. పండంటి కొడుకును చేతిలో పట్టు కుని, అలాగే గోడకు కూర్చుని ఉన్న బీబీని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నా బిడ్డను కాపా డండి అంటూ తల్లి కన్నీటిపర్యంతం కావడంతో డాక్టర్, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. తల్లిబిడ్డను ఎమర్జెన్సీవార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఎంసీహెచ్ ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి ఆరా జనగామలో గర్భిణి ఆస్పత్రి బయటనే ప్రసవించిన సంఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరా తీశారు. ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చే పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎంపీ కోమటిరెడ్డి సూచించారు. ఎంపీ స్థానిక నాయకుల ద్వారా బాధిత మహిళ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గర్భిణికి అధిక రక్తస్రావం కావడం వల్లే... గర్భిణి షేక్ బీబీకి అధిక రక్తస్రావం జరి గింది. హన్మకొండ ఆస్పత్రికి వెళ్లాలని రెఫర్ చేశాం. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో రక్తం యూనిట్లు ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. అందుకే డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్ కూడా సిద్ధం చేయగా, కుటుంబ సభ్యులు హన్మకొండకు వెళ్లేందుకు విముఖత చూపించి సిద్దిపేటకు వెళ్తామని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె బయటకు వెళ్లడంతో కాన్పు జరిగిపోయింది. ఇందులో మా నిర్లక్ష్యం లేదు. – డాక్టర్ పజారి రఘు, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ -
నీడ..ఏడ?
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. అతిపెద్ద ప్రయాణికుల కూడలి. రైళ్లలో రాకపోకలు సాగించే సుమారు లక్షా 80 వేల మంది ప్రయాణికులతో పాటు, నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల్లో తిరిగే మరో 10 లక్షల మంది ఈ కూడలి కేంద్రంగానే రాకపోకలు సాగిస్తారు. రేతిఫైల్, రైల్వేస్టేషన్ ప్రాంగణం, చిలకలగూడ చౌరస్తా, అల్ఫా హోటల్, గురుద్వారా, తదితర ప్రాంతాల్లో ఆరు బస్టాపులు ఉన్నాయి. వందలకొద్దీ బస్సులు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. ఒక్క రేతిఫైల్ బస్‌స్టేషన్ మినహా మిగతా అన్ని చోట్ల అరకొర షెల్టర్లే ఉన్నాయి. అల్వాల్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, బాలానగర్, జీడిమెట్ల, తదితర రూట్లలో వెళ్లే ప్రయాణికులు నిప్పులు చెరిగే ఎండల్లో బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా షెల్టర్లు లేని బస్టాపులు కొన్నయితే, అసలు షెల్టర్లే లేనివి చాలానే ఉన్నాయి. సికింద్రాబాద్ మాత్రమే కాదు.. నగరంలోని అనేక చోట్ల బస్షెల్టర్లు లేకపోవడంతో కొద్ది రోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రయాణికులు మండుటెండల్లో విలవిల్లాడుతున్నారు. మెహదీపట్నం, ఎల్బీనగర్, ఉప్పల్, లిబర్టీ, కుత్బుల్లాపూర్ వంటి చోట్ల ప్రయాణికులకు కనీస నీడ కూడా లేదు. మోడల్ షెల్టర్లకే పరిమితం... ఖైరతాబాద్, శిల్పారామం, కూకట్‌పల్లిలో ఆధునిక బస్షెల్టర్లు కట్టించిన అధికారులు ఆపై ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. గ్రేటర్లో సుమారు 2,200 బస్టాపులు ఉండగా 1000 చోట్ల మాత్రమే అరకొర షెల్టర్లు ఉన్నాయి. మరో 1200 చోట్ల కనీస నీడ జాడ కూడా కానరాదు. ప్రయాణికులు నిప్పుల కొలిమిలో నిలుచుని బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 10 గంటలకే భగ్గుమంటున్న ఎండలు.. సాయంత్రం 4 గంటలు దాటినా తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో వివిధ ప్రాంతాల మధ్య సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నగర శివార్లలోని వందలాది బస్టాపుల్లో ఎలాంటి షెల్టర్లు లేవు. మరోవైపు ఉప్పల్ నుంచి కూకట్పల్లి మార్గంలో, కోఠి నుంచి జాంబాగ్ వైపు, కూకట్పల్లి నుంచి ఖైరతాబాద్ వైపు మెట్రో రూట్లలో అప్పట్లో నిర్మాణ పనుల దృష్ట్యా చాలా చోట్ల షెల్టర్లు తొలగించారు. వాటి స్థానంలో కనీసం 600 షెల్టర్లు అత్యవసరంగా కట్టించాలని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు సగం కూడా పూర్తి చేయలేదు. గ్రేటర్లో ప్రతి రోజు 3,850 బస్సుల్లో సుమారు 33 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం అతి పెద్ద ప్రజారవాణా సంస్థ ఇదే. కానీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సదుపాయాలు కల్పిచకపోవడం గమనార్హం. ఏళ్లు గడిచినా మారని పరిస్థితి ♦ సనత్‌నగర్ బస్‌స్టేషన్ ప్రధాన కేంద్రంగా ప్రతిరోజు 180 బస్సుల్లో వేలమంది ప్రయాణిస్తుంటారు. కానీ అమీర్‌పేట్ మైత్రీవనం, సారథి స్టూడియో, ఎర్రగడ్డ చౌరస్తా, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్, జెక్కాలనీ, బల్కంపేట్లో బస్సు షెల్టర్లు లేనేలేవు. ♦ ఈఎస్ఐ (కూకట్పల్లి వైపు వెళ్లే బస్టాపు), ఎర్రగడ్డ ప్రాంతాల్లోని బస్షెల్టర్లు వ్యాపారుల ఆక్రమణల్లో ఉన్నాయి. ♦ శేరిలింగంపల్లి రాయదుర్గం దాబా కూడలిలో మూడు చోట్ల బస్ షెల్టర్లు అవసరమైతే ఒక్కచోటే నిర్మించారు. ♦ ఖాజాగూడలో ఎన్టీఆర్ విగ్రహం వైపు, నానక్‌రాంగూడ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లితాండ, గోపన్‌పల్లి వంటి ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ♦ కుత్బుల్లాపూర్‌లోని బస్షెల్టర్లు లారీల అడ్డాలు, మెకానిక్ షెడ్లుగా మారిపోయాయి. మొత్తం 14 బస్టాప్‌ల్లో 10 షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ♦ పాతబస్తీలో పుట్‌పాత్‌లు, దుకాణాల అరుగులే షెల్టర్లయ్యాయి. ♦ లాల్‌దర్వాజ మోడ్ నుంచి నయాపూల్ చౌరస్తా వరకు 9 బస్టాప్‌లున్నా.. ఖిల్వత్, మూసాబౌలి, నయాపూల్ చౌరస్తాల్లో మాత్రం మూడు మాత్రమే ఉన్నాయి. ♦ లాల్‌దర్వాజ మోడ్, శాలిబండ, శాలిబండ చౌరస్తా, పేట్లబురుజు బస్టాప్‌లలో బస్ షెల్టర్లు లేవు. ♦ దిల్సుఖ్నగర్, మలక్‌పేట, అక్బర్‌బాగ్, సైదాబాద్, చాదర్‌ఘాట్, మాదన్నపేట, సైదాబాద్, ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లో చాలా చోట్ల బస్షెల్టర్లు లేవు. ♦ రామంతాపూర్ ప్రధాన రహదారిలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద స్కై సిటీ అపార్ట్మెంట్ పక్కన, ప్రభుత్వ హోమియో ఆస్పత్రి ఎదురుగా ఉన్న బస్టాప్‌లో ఎన్నో ఏళ్లుగా షెల్టర్లు నిర్మించనే లేదు. దీంతో ప్రయాణికులు నీడ కోసం సమీపంలోని దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ♦ ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద ఉన్న బస్టాప్‌ను కొద్దిగా వెనక్కి జరిపారుగాని ఎలాంటి షెల్టర్ నిర్మించలేదు. ♦ మౌలాలి యునాని ఆస్పత్రి, వినాయకనగర్, సంతోషిమాతానగర్, ఓల్డ్ సఫిల్‌గూడ, లక్ష్మీనగర్, ఆర్టీసీ కాలనీ, భరత్‌నగర్, గణేష్‌నగర్ బస్తీలలో బస్‌స్టాపుల వద్ద షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలో ఉండాల్సిన పరిస్థితి. ♦ గౌతమ్‌నగర్‌లోని సాయినగర్, ఉత్తంనగర్, దయానంద్‌నగర్, మల్లికార్జుననగర్, జ్యోతినగర్, మిర్జాల్‌గూడ, సాయిరాం థియేటర్ తదితర ప్రాంతాల్లో షెల్టర్లు లేవు. ♦ నేరెడ్మెట్ వెళ్లే మార్గంలో ఆనంద్‌బాగ్, వినాయకనగర్ చౌరస్తాల్లో బస్షెల్టర్లు లేవు. ♦ సికింద్రాబాద్ వైపు వెళ్లే మార్గంలో వినాయకనగర్, ఆర్కేనగర్, కేశవనగర్ చౌరస్తా, కపా కాంప్లెక్స్, గీతానగర్, వెంకటేశ్వరనగర్ ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు లేవు. ♦ నేరేడ్మెట్ చౌరస్తా, వాయుపురి బస్టాప్, కేశవనగర్ బస్‌స్టాప్‌లలో షెల్టర్ లేకప్రయాణికులు ఎండకు, వానకు ఇబ్బంది పడుతున్నారు. -
నగరంలో హైఅలర్ట్
చిత్తూరు, తిరుపతి క్రైం: దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రదాడులు ముప్పు పొంచి ఉండటంతో కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలపై పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఏపీ డీజీపీ ఆర్.పి. ఠాకూర్ బుధవారం అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జలాశయ మార్గాలు, ఎయిర్‌పోర్టు ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.. శ్రీలంక నుంచి కొందరు తీవ్రవాదులు సముద్రమార్గాన ఆంధ్రాకు చేరే అకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో అర్బన్ జిల్లాలో ఎస్పీ అన్బురాజన్ హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో? ‘సాక్షి’తో ఎస్పీ మాట్లాడారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్బన్ ఎస్పీ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పరిశ్రమలు, హాస్పిటల్స్, శ్రీనివాసం, విష్ణునివాసం మొదలగు టీటీడీ వసతి గృహాలు, అలిపిరి టోల్గేట్తో పాటు పలు ప్రాంతాల్లో విసృతంగా ఈ తనిఖీలు చేశారు. ప్రజలు అపరిచితుల విషయంలో ఉండాలని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధిక రద్దీ, దేవాలయాలు మాల్స్ వద్ద ఇప్పటికే భద్రత పెంచినట్లు అర్బన్ ఎస్పీ చెప్పారు. మాల్స్‌లో కూడా మెటల్ డిటెక్టర్లను గురువారం నుంచి ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని అనుమానిత వస్తువులు, వ్యక్తులను ప్రజలు గమనించినట్లయితే పోలీస్ శాఖకు, పోలీస్ డైల్ 100, 8099999977 సమాచారమివ్వాలని కోరారు. అదేవిధంగా అంతర్జాతీయ రేణిగుంట విమానాశ్రయంలోనూ భద్రతను పెంచి, పాస్‌పోర్టులు ముమ్మరంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. నగరానికి వచ్చే రహదారుల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేయడంతోపాటు అనుమానితులను ప్రశ్నించారు. పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘా తిరుమల, తిరుపతి, తిరుచానూరుతో పాటు శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, శ్రీవారిమెట్లు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలను చేశారు. అనుమానితులను విచారణ చేయడంతో పాటు వారి వద్ద నుంచి ధ్రువపత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర ఏ వాహనాలను వదలకుండా అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. పుణ్యక్షేత్రాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు అన్బురాజన్ తెలిపారు. -
సినీ ఫక్కీలో బ్యాగు చోరీ
సాక్షి, నాయుడుపేటటౌన్: పట్టపగలు జనసంచారం ఉండే ప్రాంతంలో ఓ మహిళ చేతి సంచిలోని ఆమెకు సైతం తెలియకుండా సినీ ఫక్కీలో చోరీ చేశారు. అందులో రూ.3.90 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటన పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితురాలి సమాచారం మేరకు.. మండలంలోని తిమ్మాజికండ్రిగకు చెందిన లొడారి అంకమ్మ పట్ట ణంలోని ఓ ఇంటి కొనుగోలు నిమిత్తం అడ్వాన్సుగా ఇచ్చేందుకు రూ.3.90 లక్షలు తీసుకుని ఆమె సమీప బంధువు పి.శారదమ్మతో కలిసి సర్వీస్ ఆటోలో నాయుడుపేటకు వచ్చింది. పాతబస్టాండ్ వద్ద దిగి పూలు, వస్తువులు కొనుగోలు చేసి పట్టణంలోని ఆ మె కుమార్తె ఇంటికి వెళ్లానుకుంది. అయితే అంకమ్మ పాతబస్టాండ్ వద్ద పూలమొక్కలు విక్రయించే దుకా ణం వద్ద కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఆమె చేతికి రక్తం కారుతుండడాన్ని గమనించి ఆమెకు చెప్పాడు. అప్పుడు అంకమ్మ ఆమె చేతిలో నగదు భద్రపరచి ఉన్న సంచి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ గగ్గోలు పెట్టింది. ఆమెకు కూడా తెలియకుండా పదునైన బ్లేడుతో సంచిని కోసి నగదు సంచిని దోచుకెళ్లినట్లుగా గుర్తించింది. బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూ. 3.90 లక్షలు చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జీ వేణు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పాతబస్టాండ్ వద్ద బాధితురాలు వెళ్లిన పలు ప్రదేశాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఆధారాలు దొరకలేదు. పట్టణంలోని దర్గావీధి ప్రాంతాల్లో ఆటోకు సంబంధించి సీసీ ఫుటేజీలను పోలీసులు రికార్డు చేసుకొని పరిశీలన చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాత్రికి రాత్రే ఇంటిలా మార్చేశారు!!
సాక్షి, బెంగళూరు : బెలగావి జిల్లాలోని కిట్టూర్ తాలూకాలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పని పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బస్సు రాకపోకలు అంతంత మాత్రంగా ఉండే కిట్టూర్ బస్టాండ్ గోడలపై ఇటుకలు పేర్చి, తలుపులు కూడా బిగించి.. ఇంటిలా మార్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి వరకు బస్టాండ్లా ఉండి.. తెల్లారేసరికి ఓ ఇంటిగా మారడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా ఎవరో ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారని, ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
బస్టాండ్ సెంటిమెంట్
బంజారాహిల్స్: ఎవరైనా దొంగతనం చేయగానే ఏం చేస్తారు..? దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్ వదిలి పోలీసుల కంటపడకుండా మరోచోటికి మకాం మారుస్తారు. అయితే ఘరానా దొంగ లక్ష్మణ్ రూటే సెపరేటు. దొంగతనం చేయగానే ఆ సొమ్మును భద్రంగా మూటగట్టుకొని ఇమ్లిబన్ బస్టేషన్లో ఓ పక్కన దుప్పటి కప్పుకొని నిద్రిస్తాడు. ఆ తెల్లవారే తీరిగ్గా మరో చోటకు వెళ్తాడు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన దొంగ కూచిపూడి లక్ష్మణ్ అలియాస్ లక్ష్మణ్, అలియాస్ మున్నా, అలియాస్ మధు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, షేక్ మహ్మద్‌పేట గ్రామానికి చెందినవాడు. నగరానికి వలస వచ్చిన అతను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ మాదా పూర్ ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దొంగతనానికి వెళ్లేముందు లక్ష్మణ్ ఇమ్లిబన్ బస్ స్టేషన్లో నే పగలంతా ఓ పక్కన దుప్పటి కప్పుకొని పడుకుని, రాత్రి 9 గంటలకు చోరీకి బయల్దేరతాడు. అర్ధరాత్రి దోచుకున్న సొమ్మును మూటగట్టుకొని మళ్లీ ఇమ్లిబన్ బస్ స్టేషన్‌కే వచ్చి పడుకుంటాడు. ఎప్పటి నుంచో ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు తెలిపాడు . దొంగతనం చేసిన తెల్లవారి నగరం నుంచి మకాం మార్చేస్తాడు. శ్రీకృష్ణదేవరాయనగర్‌లోని వ్యాపా రి గోవింద్ ఇంట్లో చోరీ చేసిన లక్ష్మణ్ తాళం పగలగొట్టేందుకు తన వెంట తెచ్చుకున్న రాడ్, స్క్రూడ్రైవర్ అక్కడే వదిలేయడంతో వాటిపై ఉన్న వేలిముద్రల ఆధారంగా మూడు రోజుల క్రితం ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లో అతడిని అరెస్ట్ చేశా రు. ఆ రోజు రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో ఓ దొంగతనానికి సమయాత్తమవుతూ పోలీసులకు దొరక డం గమనార్హం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన అతను గత మే నెల 10న విడుదలయ్యాడు. రెండు వారాలు విశ్రాంతి తీసుకొని మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడు. కూకట్పల్లి,మియాపూర్, ఎస్ఆర్నగర్, కేపీహెచ్‌బీ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 31 దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. -
బస్టాప్‌ను అడ్డాగా చేసుకుని అమ్మాయిలను..
సాక్షి, హైదరాబాద్: బస్టాప్‌లో అమ్మాయిలను కను సైగలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఓ ఆకతాయి. ప్రతిరోజు అమ్మాయిలను తన వెంట రమ్మని వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పేట్‌బషీరాబాద్ డివిజన్ షీ టీమ్ బృందం సభ్యులు ఆ ఆకతాయిని సోమవారం వల పన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చింతల్ షా థియేటర్ సమీపంలో ఉన్న బస్టాప్‌లో గత కొంత కాలంగా భగత్‌సింగ్ నగర్‌కు చెందిన బాలాజీ అశోక్ గరిబీ(26) బస్టాప్‌లో నిలబడే మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంపై పలువురు షీ టీమ్స్ డీసీపీ అనసూయ, అడిషనల్ డీసీపీ నతానియల్కు ఫిర్యాదు చేశారు. దీంతో పేట్‌బషీరాబాద్ డివిజన్ షీ టీమ్స్ ఏఎస్సై శ్రీనివాస్‌కు సదరు ఫిర్యాదును పరిశీలించమని ఆదేశించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్టాప్‌లో షీ టీమ్ బృందం మాటు వేశారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగానే అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని స్వయంగా గమనించారు. అశోక్ గరిజీని అదుపులోకి తీసుకొని జీడిమెట్ల పిఎస్‌కు అప్పగించారు. -
బస్సులో చోరీ ముగ్గురు మహిళల అరెస్ట్
అన్నానగర్: తిరుచ్చి జిల్లా ముసిరి బస్టాండులో బస్సు నుంచి ముగ్గురు మహిళలు గురువారం చోరీ చేసి పారిపోవడానికి యత్నించారు. గమనించిన స్థానికులు ఆ ముగ్గురిని పట్టుకుని విచారణ చేయగా.. వారు నగదు చోరీ చేశారని తెలిసింది. వివరాలు.. తిరుచ్చి మన్నార్‌పురం ప్రాంతానికి చెందిన వడివేలు భార్య గోమతి(38). ఈమె గురువారం తిరుచ్చి నుంచి ఓ ప్రైవేట్ బస్సులో ముసిరిలో ఉన్న ఆమె కన్నవారి ఇంటికి వచ్చింది. బస్టాండులో దిగినప్పుడు ఆమె నగదు పర్సు కనబడలేదు. దిగ్భ్రాంతి చెందిన ఆమె కేకలు వేసింది. అప్పుడు ఆ బస్సు నుంచి ముగ్గురు మహిళలు దిగి పరిగెత్తడానికి ప్రయత్నించారు. సమీపంలో ఉన్న స్థానికులు ఆ మహిళలను అడ్డుకుని విచారణ చేశారు. వారు నగదు పర్సు చోరీ చేసినట్లు తెలిసింది. గోమతి ముసిరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ జయచిత్ర, ఎస్ఐ రామ్‌కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇందులో వారు వేలూరు జిల్లా కౌంజూర్ ప్రాంతానికి చెందిన జ్యోతి(32), అలమేలు(37), ఉషా(29) అని తెలిసింది. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి జైలులో ఉంచారు. -
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం
-
బస్టాప్‌లో చిన్నారులను వదిలేసిన తల్లి
- చేరదీసిన ఆటోవాలా - పాఠశాలను గుర్తుపట్టిన చిన్నారులు మల్కాజిగిరి: పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను ఒక తల్లి నిర్ధాక్షిణ్యంగా బస్టాండ్‌లో వదిలిపెట్టింది. బస్టాప్‌లో ఒంటరిగా ఉన్న చిన్నారులను చేరదీసిన ఆటోవాలా వారిని వారు చదివే పాఠశాల వద్దకు తీసుకొచ్చాడు. వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తాళ్లబస్తీకి చెందిన అనిత తన పిల్లలు పుణ్యమ్మ(7), దీపిక(6)లతో కలిసి నివాసముంటున్నది. వేరే వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్న అనిత తన ఇద్దరు పిల్లలను తీసుకొని కుత్బుల్లాపూర్ బస్టాప్‌లో మంగళవారం వదిలిపెట్టి కొద్దిసేపటి తర్వాత వస్తానని చెప్పడంతో వాళ్లు అక్కడే ఉండిపోయారు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ శివాజీ మంగళవారం బస్టాప్‌లో ఉన్న చిన్నారులను గమనించి ఆరాతీశాడు. కేవలం వారి పేర్లు, మల్కాజిగిరి అని చెప్పడంతో వారిని ఆటోలో మల్కాజిగిరికి తీసుకొని వచ్చాడు. తన ఆటోలో గ్యాస్ అయిపోవడంతో గ్యాస్ నింపుకోవడానికి మౌలాలికి వెళ్లుతుండగా చిన్నారులు తాము చదివే తాళ్లబస్తీలోని ప్రాధమిక పాఠశాలను గుర్తుపట్టారు. దీనితో ప్రధానోపాధ్యాయుడు హనుమంతరెడ్డి వారిని గుర్తించి వాళ్ల అమ్మ గురించి వాకబు చేయడంతో ఖాళీ చేశారని తెలియడంతో ఆల్వాల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి భవానీకి సమాచారం అందించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం సహకారంతో చిన్నారులను తీసుకొని వచ్చి ఆల్వాల్‌లోని లోని చిల్డన్ర్హోంలో రక్షణ కల్పించామని తెలిపారు. -
బస్ స్టాప్‌లోకి దూసుకెళ్లిన లారీ
హైదరాబాద్ : వనస్థలిపురం పనామా దగ్గర ఆదివారం మధ్యాహ్నం ఓ ఇసుక లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న బస్టాప్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్టాప్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. -
మృత్యు వాహనం
♦ బస్టాప్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్ ♦ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి.. నల్లకుంటలో ఘటన ♦ మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన సాయిప్రకాశ్గా గుర్తింపు హైదరాబాద్: బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని స్కూల్ వ్యాన్ రూపంలో మృత్యువు కబళిం చింది. నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం గొల్లపల్లికి చెందిన బూస సాయిప్రకాశ్(21) ఇబ్రహీం పట్నంలోని రాజమహేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. దీంతో పాటు వీఎస్టీలో అప్రెంటీస్ చేస్తున్నారు. ఓయూలో ఎంసీజే చదువుతున్న సోదరుడు సతీశ్ హాస్టల్ రూమ్‌లో నాన్బోర్డర్గా ఉంటున్నాడు. శుక్రవారం వీఎస్టీకి వెళ్లేందు కు ఉదయం 6.35 గంటలకు లక్కీ కేఫ్ చౌరస్తాలోని బస్టాప్ వద్ద బస్సు కోసం సాయిప్రకాశ్ వేచి చూస్తున్నాడు. అదే సమయంలో ఓయూ నుంచి పాఠశాల విద్యార్థులను తీసుకుని వస్తున్న మెటాడోర్(ఏపీ 10టీ3022) వ్యాన్ అదుపు తప్పి సాయిప్రకాశ్‌ను బలంగా ఢీకొంది. దీంతో సాయిప్రకాశ్ తలకు బలమైన గాయా లై అక్కడికక్కడే మృతిచెందాడు. వ్యాన్ అదే వేగంతో దూసుకెళ్లి బస్టాప్ పక్కనే ఉన్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాం క్ వద్ద ఫుట్‌పాత్ పైకి ఎక్కి కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టింది. పెద్దగా శబ్దం రావడంతో అక్కడి ఏటీఎం వద్దనున్న సెక్యూరిటీ గార్డు నర్సింహా పరుగెత్తుకు వచ్చి వ్యాన్‌లో భయం తో ఏడుస్తున్న విద్యార్థులను బయటకు తీశాడు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. పోలీసు లు ప్రమాద స్థలానికి చేరుకుని సాయిప్రకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి పెదనాన్న కుమారుడు పి.నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన మెటాడోర్ డ్రైవర్ బి.లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని సాయిప్రకాశ్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాహనం బ్రేకు లు ఫెయిలై ప్రమాదం జరిగిందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్‌స్టాప్‌లో పేలుడు : ముగ్గురికి గాయాలు
మాస్కో : రష్యా రాజధాని మాస్కో నగరంలోని బస్‌స్టాప్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డగా... మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బస్‌స్టాప్ వద్ద కారులోకి ఆగంతకుడు మందుగుండు సామాగ్రి విసరడం వల్ల ఈ పేలుడు సంభవించిందని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఈ పేలుడు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
బస్టాప్‌లో మహిళ దారుణ హత్య
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి మండలం పెద్దగూడెం వద్ద బుధవారం రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గద్వాల మండలం గుడిపల్లికి చెందిన సత్తెమ్మ(45) అనే మహిళ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా.. ఆమెను పెద్దగూడెం బస్టాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు -
బస్ స్టాప్ -సీనియర్ సిటిజన్స్ అడ్డా
ఇక్కడ బస్టాపు దగ్గర కూర్చుని ఉన్న పెద్దల్ని చూస్తే... అందరూ ఏదో ఊరికి పయనమయ్యారనిపిస్తుంది కదా! అయితే మీరుపొరబడ్డట్టే! ఇంట్లో టీ, టిఫిన్స్ ముగించుకుని మనవళ్లు, మనవరాళ్లను స్కూళ్ల బస్సులెక్కించి... అంతే వీరు కూడా నాలుగడుగులేసి వీధిలోకి వచ్చేస్తారు. ఇలా బస్టాపులో ఓ రెండు మూడు గంటలు కూర్చుని మళ్లీ ఇంటికి పయనమవుతారు. సాయంత్రం నాలుగింటికి మళ్లీ ఇదే బస్టాప్‌కి చేరుకుంటారు. మళ్లీ భోజనాల వేళకు ఇళ్లకు మళ్లుతారు. ఐడీపీఎల్ ఉద్యోగుల కాలనీగా అందిరికీ తెలిసిన వసంతనగర్ కాలనీ బస్టాపునే అడ్డాగా చేసుకున్న ఈ సీనియర్ సిటిజన్స్‌ని పలకరిస్తే... మీకూ అక్కడ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ..:: భువనేశ్వరి సమయం... ఉదయం 11 గంటలు. ఓ నలుగురు పెద్దవాళ్లు ‘మాకు తినే వేళయింది’ అంటూ లేచారు. మిగతావాళ్లు ఎవరి కబుర్లలో వారు మునిగిపోయారు. ఇంతలో ఒకమ్మాయి వచ్చి ‘తాత సికింద్రాబాద్ బస్సు వెళ్లిపోయిందా?’ అని అడిగింది. ‘అయ్యో... ఇప్పుడు పోయింది తల్లీ...’ అన్నాడు నిట్టూర్పుగా ఓ పెద్దాయన. ‘ఉండు తల్లీ... రెండో బస్సు వచ్చే వేళయింది...ఆడ కూసో’ అన్నాడు ఆప్యాయంగా. కొందరు రాష్ట్ర రాజకీయాల గురించి.. ఇంకొందరు రాబోయే ఎండలపై మాట్లాడుతున్నారు. అందరికన్నా వయసులో పెద్దగా అనిపించినవ్యక్తి దగ్గరికి వెళ్లి... ‘మీరు రోజూ ఇక్కడే కూర్చుంటారా?’ అని అడిగితే... ‘ఈ రోజు... ఆ రోజు అని ఏముండదు. ఒక్క ఆదివారం తప్ప.. అన్ని రోజుల్లో మాకు ఈ బస్టాపే కాలక్షేపం. ఓ యాభైమందిమి ఉంటాం. ఉదయం తొమ్మిది, పది దాటిందంటే అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. తోచిన కబుర్లు, కాలనీ విశేషాలు, రాబోయే పండుగలు, ఇంట్లో చేసుకునే వేడుకలు, రోడ్డుపైన జరిగే గొడవలు... ఇలా ఒకటేమిటీ.. అన్నీ మాట్లాడుకుంటాం. రెండు, మూడు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి’అని చెప్పారు విశ్రాంత ఉద్యోగి అయిన సూర్యదేవర కృష్ణమూర్తి. ఇక్కడే ఎందుకు... వసంతనగర్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఒక భవనం ఉంది. అది వదిలి ఇలా బస్టాప్‌ను అడ్డాగా మార్చుకున్నారెందుకంటే... ‘ఒక భవనంలో కూర్చుని కాలక్షేపం చేసేదేముంటుంది, పైగా కాలనీ సంక్షేమం గురించి తెలియాలంటే నలుగురి మధ్యలో తిరగాలి. కొత్తవారితో మాట్లాడాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నాయి? ఎలాంటి అవసరాలున్నాయి? అన్నది ఎలా తెలుస్తుంది. బస్టాపంటే దుమ్ము, ధూళితో రద్దీగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడైనా అంతే. కానీ మా బస్టాపు అలా కాదు. చుట్టూ చెట్లతో ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంటుంది. దాంతో మాకు ఇక్కడికి ఎప్పుడెప్పుడు రావాలా అనిపిస్తుంటుంది’ అంటూ ఆసక్తికరమైన సమాధానమిచ్చిన రాజారావ్తో మాటకలిపారు కోటేశ్వరరావు. ‘మా బస్టాపు అంత శుభ్రంగా, ప్రశాంతంగా ఉండడానికి మా కాలనీవాసులే కారణం. ముఖ్యంగా పండుగల సమయంలో మా హడావిడి అంతాఇంతా కాదు. పేరుకే వృద్ధులం కానీ.. అందరం చిన్న పిల్లలుగా మారిపోతాం. ముఖ్యంగా వినాయక చవితి, శ్రీరామనవమి సమయంలో బోలెడంత సందడి. మాకు చేతనైనంత పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారాయన. అమ్మాయిలకు రక్షణ... వీళ్ల కాలక్షేపం... ఈ బస్స్టాప్కొచ్చే అమ్మాయిల రక్షణ కవచంగా మారింది. ‘రోజూ బస్టాపుకొచ్చేసరికి అందరూ పెద్దవాళ్లు చక్కగా పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చూస్తే భలే ముచ్చటేస్తుంది. మాకు చాలా ధైర్యంగా కూడా ఉంటుంది!’ అని ధీమాగా చెబుతోంది బస్టాప్‌లో ఓ అమ్మాయి. ‘మేం నలుగురం ఉన్నాం కాబట్టి ఏ కుర్రాడైనా ఏదైనా అంటే అడ్డుపడతాం.. బుద్ది చెబుతాం. అదే ఒక్కరం చెబితే... ‘పోరా ముసలోడా... నువ్వేంటి నాకు చెప్పేది’ అంటూ రెండు దెబ్బలేసినా వేస్తారు’ అని నవ్వుతూ చెప్పారు రిటైర్డ్ ఎంప్లాయ్ శివరామ్‌ప్రసాద్. ‘ఈ కాలం పిల్లలకు ఇది మంచి, ఇది చెడు అనే చెప్పే పరిస్థితి లేదు. మాట మొదలవ్వకముందే నీకెందుకు? నువ్వెవరూ? అని ఎదురుతిరుగుతున్నారు’ అంటూ వాపోయారు రాజారావ్. మహిళలకు వరం... ఇలా నలుగురు వృద్ధులు ఒకచోట కూడి నాలుగు మంచి విషయాలు మాట్లాడుకోవడంలో వింతేమీ కాకపోవచ్చు... పిచ్చాపాటీ కబుర్లతో వచ్చేదేమీ లేకపోవచ్చు. కానీ... వీళ్లు కూర్చున్న కారణంగా అక్కడ బస్టాపు పరిసరాల్లో చిన్న దొంగతనంగానీ, ఒకరిపై దాడి జరిగిన దాఖలా కానీ లేదు. సాయంత్రం వేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్లమీద వెళుతున్న మహిళలపై చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయని తెలిసి... ఆయా ప్రాంతాల్లో వీరు గుంపులుగా చేస్తున్న వాకింగ్లు కూడా అక్కడ మహిళల పాలిట వరంగా మారాయి. ‘ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే ఎద్దుతలకాయ తెచ్చిపెట్టుకోవాలి’ అని పెద్దలు చెప్పిన సామెత ప్రయోజనం ఏంటో ఈ కాలనీ వీధుల్లో కళకళలాడుతూ తిరిగే వృద్ధుల్ని చూస్తే తెలుస్తుంది. మీరూ పంపండి.. యాభై దాటితే సగం జీవితం అయిపోయినట్టేనా?.. ‘కాదు.. జస్ట్ బిగిన్’ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఆటపాటలు.. ఇష్టమైన వ్యాపకాలతో స్నేహిస్తూ.. కాసింత చారిటీకి టైమిస్తూ జీవితాన్ని ‘కొత్త బంగారు లోకం’ చేసుకుంటున్న సీనియర్ సిటి‘జెమ్స్’ ఎందరో!. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అని చాటుతున్న అటువంటి వారికి విజ్ఞప్తి.. మీ అసోసియేషన్ లేదా వృద్ధాశ్రమాల యాక్టివిటీస్ గురించి మాకు రాసి పంపండి. మీ ఎక్స్పీరియన్స్ మరెందరికో ఇన్స్పిరేషన్. మెయిల్: sakshicityplus@gmail.com -
సీన్ షితారే..
‘నేను ఈల వేస్తే గోలుకొండ అదిరి పడతది’ అంటూ సిటీలో ఏ బ స్స్టాప్లోనో.. వీధి మలుపు దగ్గరో.. అమ్మాయిలను ఆటపట్టించారా.. తస్మాత్ జాగ్రత్త! ఆడపిల్లలను ఫాలో అవ్వడం.. దారి కాచి బీటు వేయడం ఇక కుదరని పని. కాలేజీ గేట్ ముందు.. బస్‌స్టాప్‌లలో.. రద్దీ ప్రాంతాల్లో.. మఫ్టీల్లో మహిళా పోలీసులు ఉంటారు.‘ఫిగర్ కత్తిలా ఉంది’ అని కామెంట్ చేశారా.. సీన్ షితారే. ఈ ఆకతాయి పనులను చూసి ఎవరైనా ‘షీ టీమ్’కు రింగిస్తే చాలు.. మీ తాట తీస్తుంది! భువనేశ్వరి షీ టీమ్.. ప్రస్తుతం నగరంలో యువతులకు రక్ష క కవచం. గతేడాది అక్టోబర్ 24న ఈ మహిళాదళం పరిచయమైంది. అమ్మాయిలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ టీమ్ ఆపరేషన్లు ఆకతాయి యువకుల్లో దడ పుట్టిస్తున్నాయి. అబ్బాయిల నడవడిలో మార్పు తెచ్చేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. ఇది సింగిల్ టీమ్ కాదు. వంద బృందాలున్నాయి. ఒక్కో టీమ్‌లో ఐదుగురు పోలీసులు. అందులో ఒక మహిళా పోలీస్ తప్పనిసరిగా ఉంటారు. దాదాపు 500 మంది పోలీసులు మఫ్టీలో మనల్ని ఒక కంట కనిపెడుతుంటారన్నమాట. పరుగో పరుగు... గత నాలుగు నెలల్లో ‘షీ టీమ్’లు 135 మంది ఈవ్‌టీజర్లను అరెస్ట్ చేశాయి. వీరిలో కాలేజీ కుర్రాళ్లు.. ఉద్యోగస్తులు.. మేజర్లు.. మైనర్లు.. అందరూ ఉన్నారు. ఈవ్‌టీజింగ్ జరుగుతున్న స్పాట్ వీళ్లకు ఎలా తెలుస్తుందంటారా..? కాలేజీ గోడలపైన, బస్‌స్టాప్ పరిసరాలల్లో ‘ఒక్క ఫోన్ కాల్ చాలు ఆకతాయి నోటికి తాళం వేయడానికి, చేతికి సంకెళ్లు వేయడానికి’ అంటూ కనిపించే ‘షీ టీమ్’ ప్రకటనే దీనికి కారణం. ఇదే అమ్మాయిలకు భరోసా కల్పించింది. ఈ పనిలో యమ బిజీగా ఉన్న మన అడిషనల్ సీపీ క్రైమ్ స్వాతి లక్రాని పలకరిస్తే.. ‘‘షీ టీమ్’ పేరు చెబితే ఈవ్‌టీజర్లు పారిపోతున్నారు. ఈ విషయంలో అవగాహన తేవడంలో మా టీమ్ విజయం సాధించిందని గర్వంగా చెప్పగలను. అయితే మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే సోషల్ నెట్వర్క్ సాయం కూడా తీసుకుంటున్నాం’ అని చెప్పారామె. ఫేస్‘బుక్’ సాయంతో... ఈవ్‌టీజింగ్ కేసుల్లో అరెస్టయిన వారిలో చాలావరకూ మైనర్లే ఉంటున్నారు. వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ‘షీ టీమ్’ వినూత్నమైన పనిష్మెంట్లు ఇస్తోంది. ‘అమ్మాయిలను ఏడిపిస్తూ పట్టుబడిన మైనర్లను కొట్టలేం. అందుకే వారిని వెరైటీగా పనిష్ చేస్తున్నాం. వారి వారి ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో రోజుకు కొన్ని వందలసార్లు.. యాంటీ ఈవ్‌టీజింగ్ కొటేషన్లు అప్లోడ్ చేయిస్తున్నాం. వాళ్లు పోస్ట్ చేస్తున్నారా లేదా అని మా వాళ్లు ఫాలోఅప్ చేస్తారు. మైనర్ నేరస్తులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు వారానికి, పదిరోజులకి ఇన్నిసార్లని వారి దగ్గర అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాం’ అని చెప్పారు స్వాతి లక్రా. ‘షీ టీమ్’ దృష్టిలో పడనంత వరకే ఈవ్టీజర్ల ఆటలు. ఆ తర్వాత సీనంతా చాలా సీరియస్‌గా ఉంటుంది. వారు మారడంతో పాటు వారిలాంటివారిని మార్చే పనిచేయకపోతే ‘షీ టీమ్’ బెత్తం రుచి చూపిస్తుంది. వంద డయల్ చేస్తే... ‘అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే మీ దృష్టికి వచ్చిన సంఘటనల గురించి ‘100’ నెంబర్‌కి ఫోన్ చేసి చెబితే చాలు. సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన అవసరం ఉంటే వీలైనంత త్వరగా మా టీమ్ అక్కడికి చేరుకుంటుంది. నగరంలో ముఖ్యమైన సెంటర్లలో మా టీమ్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నాం’ అని తెలిపారు స్వాతి లక్రా. మహిళా రక్షణ కోసం విడుదల చేసిన hawk eye మొబైల్ అప్లికేషన్, sheteamhyderabad అనే ఫేస్బుక్ అకౌంట్, hydsheteam@gmail.com ద్వారా వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కూడా ‘షీ టీమ్’ ఈవ్‌టీజర్లను వేటాడుతోంది. మైనర్లను మార్చడం, మేజర్లను శిక్షించడంతో సరిపెట్టుకోవడం లేదు. అమ్మాయిలకు కూడా కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో ధైర్యం నింపుతోంది. మేమున్నాం... రెండు నెలలుగా కొందరు అబ్బాయిలు షీ టీమ్‌ని కలిసి వారి ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళుతున్నారు. విషయం ఏంటంటే.. వారుంటున్న ప్రదేశాల్లో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా షీటీమ్ తర ఫున తాము ముందుకొచ్చి సాయపడతామని చెబుతున్నారు. ‘మహిళల రక్షణ కేవలం పోలీసులది మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరిది. అందరి బాధ్యత అని తెలిసిన రోజున మాతో పని ఉండదు’ అని అంటున్నారు స్వాతి లక్రా. అలాగే అమ్మాయిని ఏడిపిస్తే మజా వస్తుందనుకునేవారికి మన ‘షీ టీమ్’ చేతిలో సీన్ సితారే అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. -
ఆల్ ఇన్ ‘వన్’డర్!
నగరంలో సరికొత్త కాంప్లెక్స్‌లు ఒకేచోట వివిధ అవసరాలు తీరేలా సన్నాహాలు {పభుత్వ ఖాళీ స్థలాలు.. నిరుపయోగ భవనాల ఎంపిక జీహెచ్ఎంసీ ప్రణాళిక సిటీబ్యూరో: ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన క్షణం నుంచీ మధ్యాహ్నం వరకూ మీరు సొంత పనులపై ఎక్కడెక్కడో తిరిగారు. ఇంటికి చేరాలనే ఉద్దేశంతో బస్‌స్టాప్‌నకు వచ్చారు. ఓ వైపు దాహం వేస్తోంది. కనుచూపు మేరలో కూల్ డ్రింక్ షాపులు లేవు. ఏం చేయాలో తోచడం లేదు. ఇంతలో మీ అబ్బాయి నోట్‌బుక్స్ తీసుకు రమ్మని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. పుస్తకాల షాప్ కావాలంటే మరో రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లాల్సిందే. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు. ముఖం కడుక్కుందామనుకున్నా సమీపంలో టాయిలెట్స్ అందుబాటులో లేవు. అలాంటి సందర్భాలలో బస్‌స్టాప్‌లకు సమీపంలో షాపులు... టాయిలెట్స్ వంటివి ఉంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది కదూ. చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. ఇకపై ఇలాంటి సమస్యలకు తెర పడనుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారికి నిత్యజీవితంలోని వివిధ అవసరాలను ఒకే చోట తీర్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. పాన్ నుంచి దువ్వెన వరకూ... రోడ్డు పక్కనే పార్కింగ్ రహదారి వెడల్పును బట్టి తగిన స్థలం ఉన్న చోట రోడ్డు పక్కనే వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. రోడ్డుకు రెండువైపులా పిల్లర్లు ఏర్పాటు చేసి... పైన వంతెన నిర్మించి దానిపై పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసే యోచన ఉందని జీహెచ్ంఎసీ ప్రత్యేక అధికారి సోమేశ్ కుమార్ చెప్పారు. ట్విట్టర్లో.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగే పనులు, రోజువారీ కార్యక్రమాల వివరాలను ఫొటోలతో సహా ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ట్విట్టర్‌ను వినియోగించుకునే యోచన ఉంది. ఈ పనులు ప్రజలకు తెలిస్తే.. వారు అన్నివిధాలా సహకరిస్తారని భావిస్తూ... అందుకు తగిన మాధ్యమంగా సోషల్ మీడియాను వినియోగించుకోనున్నారు. -
బహుశా... ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో!
‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకొన్న నటుడు సాయి. అయితే ఆ తర్వాత మాత్రం మితంగానే తెరమీద కనిపిస్తున్నాడు. ఎందుకలా? లెక్కకు మించి అవకాశాలు పలకరిస్తున్నా, సాయి ఎందుకు వాటిని ఒప్పుకోవడం లేదు! ప్రస్తుతం దర్శకుడిగా మారే ప్రయత్నంలో ఉన్న సాయి అంతరంగం ఏమిటి? మీ నేపథ్యం ఏమిటి? సినీరంగం వైపు ఎలా వచ్చారు? మాది తూర్పుగోదావరి జిల్లా తుని. స్కూల్ దశ నుంచే చదువు మీద కన్నా సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీదే ఆసక్తి ఎక్కువ. జనాలు కొట్టే చప్పట్లలో ఏదో కిక్ ఉందనిపించింది. అందుకే క్రికెటరయిపోదామని అనుకొన్నా. అండర్-19 సెలక్షన్స్ కోసం కాకినాడకు వెళ్లడంతో ఆ క్రికెట్ జర్నీకి బ్రేక్ పడింది. సెలక్షన్స్ జరుగుతున్నన్ని రోజులూ అక్కడ ఉండటం కూడా కష్టమైంది. వసతి కోసమని ఇంట్లో వాళ్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో చదువుకు కూడా ఫుల్స్టాప్ పడటంతో ఏదో ఒక పని చేయక తప్పలేదు. దీంతో తెలిసిన వారి ద్వారా చెన్నై వెళ్లి అక్కడ సినిమాల సాంకేతిక విభాగంలో ట్రై చేయడం మొదలు పెట్టాను. ఇదంతా పదిహేనేళ్ల కిందటి సంగతి. మరి నటుడిగా ఎలా మారారు? ఉన్న పరిచయాలతో మొదట సీరియళ్లలో అవకాశం వచ్చింది. తమిళ, తెలుగు భాషల కోసం చెన్నైలో రూపొందించే చాలా సీరియళ్లకు దర్శకత్వ విభాగంలో పనిచేశాను. అలా ఒక ఐదేళ్లు గడిచిపోయాయి. కనీసం 30 సీరియళ్లకు పనిచేశాను. అలా చేస్తున్నప్పుడు ‘కుర్రాడు బాగున్నాడు...’ అంటూ దర్శకులు ఏదైనా చిన్న పాత్రను చేయమనేవారు. ఆ సీరియళ్లు తెలుగులో ప్రసారం అయినప్పుడు మా అమ్మ చూసి తెగమురిసిపోయేది. ‘‘అప్పడప్పుడు అలా కనిపించరా’’ అని చెప్పేది. దీంతో నటన మీద కూడా దృష్టిపెట్టాను. తొలి సినిమాతోనే గుర్తింపు లభించినా, తర్వాత ఆ దూకుడు లేదే...! ఈ రోజుల్లో, బస్‌స్టాప్ సినిమాల తర్వాత ముప్పై నలభై సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకూ వెకిలి పాత్రలే! డబుల్ మీనింగ్ డైలాగ్స్ ద్వారా నవ్వించాలని చెప్పే దర్శకులు, నిర్మాతలే కనిపించారు. అయితే అర్థంపర్థం లేకుండా సాగే అలాంటి పాత్రలు చేయడం సరికాదనిపించింది. సెలెక్టివ్‌గా చేయవచ్చు కదా! నాకంత స్థాయి లేదండీ. ఒకసారి సినిమాను ఒప్పుకొన్నాకా అలా చేయను, ఇలా చేయను అంటే కుదరదు. అయితే రాజీపడి అలాంటి పాత్రలను చేయలేను. శారీరకంగా నేను ఒక క మేడియన్లా కనిపిస్తానేమో కానీ నా తాత్వికత వేరు. ‘నటన వేరు, వ్యక్తిగతం వేరు’ అనుకోలేకపోయాను. ‘ఏం విత్తామో, అదే కోస్తాం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఈ విషయంలో నాకు నా భార్య సౌందర్యప్రియ కూడా పూర్తిగా మద్దతుగా నిలబడింది. ఇటీవలే మాకు బాబు పుట్టాడు. మరి భవిష్యత్తులో వాడు ఇప్పుడు నేను చేసిన సినిమాలను చూసి ఇబ్బంది పడకూడదు. నాకు సినిమాలే అక్కర్లేదు, ఏదోఒక పనిచేసి బతకగలను, నావాళ్లను పోషించుకోగలను. నేను నమ్మే దైవత్వం కూడా అలాంటి పాత్రలకు సమ్మతించకుండా చేసింది. అందుకే వాటికి దూరంగా జరిగాను. మరి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకొంటున్నా. అదొక పీరియాడికల్ మూవీ. వర్క్ అంతా దాదాపుగా పూర్తయ్యింది. అది కార్యరూపం దాల్చి నేను దర్శకుడిగా నిలదొక్కుకొంటే, అందరికీ గుర్తుండిపోతా. లేకపోతే ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో! చెన్నైలో ఉన్న మీకు తెలుగు సినిమా అవకాశాలు ఎలా లభించాయి? ఏడేళ్ల కిందట చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. సీరియళ్లకు పనిచేయడం మానేసి... సొంతంగా రియాలిటీ షో కాన్సెప్ట్‌ను డిజైన్ చేసుకొన్నాను. వాటికి మంచి క్రేజ్ ఉండటంతో నా కాన్సెప్ట్‌ను నిర్మాత బన్నీవాసుకు వినిపించాను. ఆయన ద్వారా మారుతిగారితో పరిచయం కలిగింది. అప్పటికి మారుతి ‘బస్‌స్టాప్’ తీస్తున్నారు. దానికి నేను కూడా అసోసియేట్‌గా జాయిన్ అయ్యాను. అయితే ఆ సినిమా ఆగిపోయింది. ఆ విరామంలో ‘ఈ రోజుల్లో’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడం మొదలుపెట్టారు. దానికి కూడా అసోసియేట్‌గా పనిచేసిన నేను మారుతి గారి సూచనమీదే నటుడిగా కూడా మారాను. ఆగిపోయిన బస్‌స్టాప్ మళ్లీ మొదలవ్వడంతో అందులో కూడా పాత్ర లభించింది. - బీదాల జీవన్‌రెడ్డి -
బస్టాప్‌లోని ప్రయాణికులపై కంటెయినర్ బోల్తా
సతారా/సాక్షి, ముంబై: మహారాష్ర్టలోని సతారా జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పార్గావ్-ఖండాలా మార్గంలో ఆర్టీసీ బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులపై ఓ కంటెయినర్ అదుపుతప్పి బొల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో 15 మంది గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడు ఇచ్చేందుకు చక్కెర సంచుల లోడుతో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ ప్రయత్నించగా అది అదుపు తప్పి బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై పడింది. -
ఈవ్‌టీజింగ్ కలకలం
పార్వతీపురం : మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమయ్యే ఈవ్‌టీజింగ్ సంస్కృతి పార్వతీపురం వంటి పట్టణాలకూ సోకింది. పార్వతీపురం నుంచి దుగ్గేరుకు వెళ్లే బస్సులో ఈవ్‌టీజింగ్ నిత్యం జరుగుతుండటంతో విద్యార్థినులు భయూందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పార్వతీపురం నుంచి దుగ్గేరు వెళ్లే బస్సులో ఇద్దరు యువకులు పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించి యువతి, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని డోకిశీల గ్రామానికి చెందిన యువతి పార్వతీపురంలోని బైపాస్ రోడ్డు మలుపు సమీపంలో ఉన్న ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. రోజూ ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో రాకపోకలు సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం కళాశాల విడిచిపెట్టాక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యింది. నిత్యం రద్దీతో కిక్కిరిసి ఉన్న ఈ బస్సులో మండలంలోని తాళ్లబురిడి గ్రామానికి చెందిన అల్లరిమూకలోని ఇద్దరు యువకులు అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వెకిలి చేష్టలతో హింసించారు. ఈ విషయమై ప్రశ్నించిన యువతిపై దుర్భాషలాడుతూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారు. బస్సులో జరిగిన అవమానంతో ఇంటికొచ్చిన విద్యార్థిని రోధిస్తూ విషయూన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కళాశాలకు వెళ్లనని వాపోరుుంది. దీంతో విద్యార్థిని, తల్లిదండ్రులు, బంధువులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఇద్దరూ నిత్యం అమ్మారుులను వేధిస్తుంటారని బాధితులు తెలిపారు. గ్రామంలో పంచారుుతీ.. బుజ్జగింపులకు దిగిన టీడీపీ నాయకులు! ఈ విషయమై బాధితురాలు పెద్దలకు చెప్పగా గ్రామం లో పంచారుుతీ నిర్వహించారు. యువకుల్ని మందలించి, తమను బుజ్జగించేందుకు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రంగంలోకి దిగినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో కూడా మంతనాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. -
ఎక్స్‌పోజింగ్‌కు నో
వర్ధమాన తారలలో తనకంటూ ఒక ప్రత్యేక బాణీని ఏర్పరచుకుని విజయానికి బాటలు వేసుకుంటూ ముందుకు సాగుతున్న నటి శ్రీదివ్య. పదహారణాల అచ్చ తెలుగు ఆడపడుచైన ఈ ముద్దుగుమ్మ బస్టాప్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుని వరుత్త పడాద వాలిభర్ సంఘం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగ ప్రవేశం చేశారు. ఇక్కడ కూడా తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే తొలి చిత్రంతోనే కోలీవుడ్ తన వైపు చూసేలా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటికిక్కడ మంచి డిమాండే ఉంది. సక్సెస్‌తో పాటు తన హోమ్లీ లుక్ కూడా ఇందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం శ్రీ దివ్య చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. మరికొన్ని అవకాశాలు ఎదురుచూస్తున్నాయట. అలాగే ఈ అమ్మడు యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ సరసన నటిస్తున్న పెన్సిల్, అధర్వతో రొమాన్స్ చేస్తున్న ఈటి, శివకార్తికేయన్‌తో మరోసారి జత కడుతోంది, నటుడు విష్ణు, జీవా చిత్రాలతో పాటు విక్రమ్ ప్రభు సరసన నటిస్తున్న శ్రీ దివ్య ఏం చెబుతోందంటే.. ప్రస్తుతం తమిళంలో ఐదు చిత్రాల్లో నటిస్తున్నాను. వీటిలో ఈటి, జీవా చిత్రాల్లో కళాశాల యువతిగాను, పెన్సిల్ చిత్రంలో పాఠశాల అమ్మాయిగాను నటిస్తున్నారు. అయితే ఈమూడు పాత్రలు ఒక్కొక్కటి ఒక్కో కోణంలో సాగుతాయి. ఈటి చిత్రంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తున్నాను. ఇక జీవా చిత్రం క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగుతుంది. అలాగే తానా చిత్రంలో నర్సు పాత్రలో కనిపిస్తాను. రిపీట్ పాత్రల్లో నటించాలనుకోవడం లేదు. అలాగే చెట్లు పుట్టలు తిరుగుతూ పాటలకే పరిమితమయ్యే పాత్రలను అంగీకరించను. అది టాప్ హీరోల చిత్రాలైనా నిర్మొహమాటంగా నో చెప్పేస్తాను. పాత్ర నచ్చితే నూతన దర్శకత్వంలో అయినా నటించడానికి రెడీ. పెన్సిల్ చిత్రంలో నటించడానికి ప్రధాన కారణం ఇదే. ఈ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్ కథాంశంతో సాగే కథా చిత్రం. అదే విధంగా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్‌కు నేను వీరాభిమాని. ఆయన పాటలంటే చాలా ఇష్టం. అలాంటిది ఆయన సరసన నటించడం ఆనందంగా ఉంది. నటుడు శివకార్తికేయన్‌ది చాలా ఫ్రెండ్లీ నేచర్. వరుత్త పడాద వాలిభన్ చిత్రంలో ఆయన సహకారం మరువలేనిది. నటుడు విక్రమ్ ప్రభులో గొప్ప నట వంశం నుంచి వచ్చాననే గర్వం కించిత్ కూడా ఉండదు. ఇక నటుడు అధర్వతో పెద్ద పరిచయం లేదు. ఆయనతో కలసి రెండు రోజులే నటించినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో నటించడానికి ఒక్క భాష మినహా తారతమ్యం లేదు. అలాగే మణిరత్నం, గౌతమ్ మీనన్, తెలుగు దర్శకుడు కె.విశ్వనాథ్ చిత్రాల్లో నటించాలని ఆశ. మౌనరాగం, అలప్పాయిదే, వారణం ఆయిరం, ఎందిరన్ తదితర నాకు నచ్చిన చిత్రాల్లో కొన్ని. ప్రస్తుతం ఉన్న హోమ్లీ ఇమేజ్‌నే కోరుకుంటున్నాను. గ్లామరస్ పాత్రలు జోలికి పోదలచుకోలేదు. అందాలారబోత అవకాశాలంటే సారీ చెప్పేస్తానని శ్రీ దివ్య అంటున్నారు. -
ఒక్క మగాడు...
నాన్నగారి ఉద్యోగం రీత్యా మేము కొన్ని సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చింది. మేము ఉండే కాలనీలో పోకిరి కుర్రాళ్ల బెడద ఎక్కువగా ఉండేది. దారిన పోయే అమ్మాయిలను రకరకాల కామెంట్లు చేస్తూ ఉండేవారు. కొందరు తేలికగా తీసుకునేవారు. కొందరు మనసులోనే బాధ పడుతూ ఎవరికీ చెప్పుకునేవారు కాదు. ఒకరోజు... కాలేజికి టైమ్ అవుతోందని పరుగులాంటి నడకతో బస్‌స్టాప్ వైపు వెళుతుంటే... ‘‘అరేబియా గుర్రం పరుగెడుతోంది’’ అని వినిపించింది. వెనక్కి తిరిగిచూస్తే పోకిరి కుర్రాళ్ల గుంపు! భయమేసింది. ఏమీ అనలేకపోయాను. క్లాసులో పదే పదే ఈ విషయమే గుర్తుకు వచ్చి మనసును ముల్లులా గుచ్చుతోంది. ‘‘ఆ వెధవలను తిట్టి ఉంటే బాగుండేది’’ అనుకున్నాను. విషయాన్ని నాన్నకు చెబితే ‘‘ఈసారి ఎవడైనా ఏమైనా అంటే చెప్పు. పోలీసులను పిలిచి తన్నిస్తాను’’ అన్నారు. ఆరోజు కూరగాయలు తేవడానికి మార్కెట్‌కు వెళుతున్నాను. ‘‘అరేయ్...అదిగో అరేబియా గుర్రం’’ అన్నాడెవడో. వెనక్కి తిరిగిచూస్తే ఆరోజు నేను చూసిన వాళ్లే! ‘‘చెప్పుతో కొడతాను’’ అన్నాను వాళ్ల వైపు చూస్తూ. మాటా మాటా పెరిగింది. నా చుట్టుపక్కల ఉన్నవాళ్లు చోద్యం చూస్తున్నారు తప్ప ఒక్కరూ మాట్లాడడం లేదు. ఇంతలో- ‘‘మీ ఇంట్లో ఆడమనుషులు లేరా? ఎందుకలా అమ్మాయిని ఏడిపిస్తున్నారు’’ అని ఒక గొంతు వినిపించింది. అతను ఓ బిచ్చగాడు. ఒక కాలు లేదు. కర్ర సహాయంతో నడుస్తుంటాడు. ‘‘ఉన్న ఒక్క కాలు కూడా తీసేస్తాం. ఇక్కడి నుంచి వెళ్లు’’ అని అరిచారు ఆ కుర్రవాళ్లు. ‘‘ఏదీ...తీయండ్రా’’ అని చేతిలో ఉన్న కర్రతో వాళ్ల మీదికి కోపంగా వెళ్లాడు బిచ్చగాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లకు ధైర్యం వచ్చింది. తలో మాట అనడం మొదలుపెట్టారు. ‘‘పోలీస్‌లకు ఫోన్ చేయండి’’ అని అరిచారు ఎవరో. పోకిరి కుర్రాళ్లు జడుసుకొని తలో దిక్కుకు పారిపోయారు. ఈ సంఘటన నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంటుంది. ఆ బిచ్చగాడు వృద్ధుడు. పైగా ఒక కాలు లేదు. అయినా ధైర్యం చేసి ఆ కుర్రాళ్లను చావు తిట్లు తిట్టాడు. అందుకే నా దృష్టిలో అతను ఒక్క మగాడు! -సి. వసంత, కొత్తగూడెం -
తిరుపతి ఆర్టీసీ డిపో దగ్గర దారుణ హత్య
-
నాలుగు బూతులు రాసేసిడబ్బులు సంపాదించే నేచర్ కాదు నాది!
ఈ రోజుల్లో... హిట్! బస్ స్టాఫ్... హిట్!! ప్రేమకథాచిత్రమ్... హిట్!! కొత్త జంట... హిట్!!! హిట్టా!! ఇదింకా రిలీజ్ కాందే?! తీసింది మూడు. మూడూ హిట్. నాల్గోది మాత్రం ఎందుక్కాదు? ఎందుకౌతుంది? ఎందుకా?! డెరైక్టర్ ఎవరనుకున్నారు? డైలాగులు ఎవరివనుకున్నారు? మారుతికి బాగా డబ్బులొచ్చినట్లే కొంత చెడ్డపేరు కూడా వచ్చింది... ...యూత్‌ని పాడుచేసేస్తున్నాడని! మారుతి కోపగించుకోడు. ‘కథలో ఆత్మను పట్టుకోలేకపోతే ఎలా?’ అంటాడు. డబ్బుకోసం, పేరుకోసం చూసుకోని కుర్రాడే... ఇలా అనగలడు. ఇలా తీయగలడు. ఇలా మాట పడగలడు. ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. అతడి సినిమాలను మళ్లొకసారి దగ్గరగా చూడాలనిపిస్తుంది. మీ ఫ్లాష్‌బ్యాక్ సినిమా స్టోరీని తలపిస్తుందట నిజమేనా? అసలు మీ బాల్యం ఎలా సాగింది? మారుతి: మాది కృష్ణాజిల్లా మచిలీపట్నం. అక్కడి రాధికా టాకీస్ ఎదురుగా మా నాన్న అరటిపళ్లు అమ్మేవారు. రోజుకి యాభై రూపాయలు సంపాదిస్తే.. గొప్పగా ఫీలయ్యేవారాయన. చిన్నప్పట్నుంచీ మా కుటుంబం మొత్తం కష్టంతోనే బతికింది. అమ్మ ఇంట్లోనే మిషన్ కుట్టేది. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. నేను స్కూల్కెళ్లి... మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో నాన్న బండి దగ్గరకొచ్చి కూర్చునేవాణ్ణి. చెట్టుకింద ప్లీడర్, కాంచనసీత, ముద్దులమావయ్య.. ఈ సినిమాలన్నీ రాధికా థియేటర్లో రిలీజ్ అవుతూ ఉండేవి. నేను ఆ పోస్టర్లు చూస్తూ... వాటి బొమ్మలేస్తూ ఉండేవాణ్ణి. ఆ విధంగా డ్రాయింగ్ అలవాటైంది. తర్వాత ఓ మోటర్ ఏజన్సీ ఆఫీస్‌లో ఆఫీస్బోయ్లా చేరాను. అక్కడ వాళ్లకు టీలు సప్లయ్ చేయడం, జిరాక్స్‌లు తీయించుకురావడం చేసేవాణ్ణి. అదే ఆఫీస్‌లో నంబర్‌ప్లేట్లకు పెయిటింగ్ కూడా వేస్తుండేవాణ్ణి. అలాచేస్తే.. ప్లేట్‌కి పది రూపాయలు ఇచ్చేవారు. ఆ వచ్చిన ఆదాయంతోనే ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఆ తర్వాత స్టిక్కరింగ్ స్టార్ట్ చేశా. స్టిక్కరింగ్ చేయడంలో బందర్‌లోనే నంబర్‌వన్ అయ్యాను. నేను చేసిన నంబర్ ప్లేట్లకు అక్కడ అభిమానులున్నారు. బాపుగారి బొమ్మల్ని కూడా స్టిక్కరింగ్ చేసేవాణ్ణి. రోజుకు వెయ్యి లెటర్లు ఈజీగా కట్ చేసేవాణ్ణి. స్టిక్కరింగ్‌లో నేను చాలా ఫాస్ట్. ఓ వైపు స్టిక్కరింగ్ చేస్తూ... మరోవైపు కష్టపడి బీకాం పూర్తి చేశాను. చిన్నప్పట్నుంచీ కష్టపడతూనే ఉన్నందువల్ల బద్దకం అంటే ఏంటో ఇప్పటికీ నాకు తెలీదు. ఓ విధంగా అదే నన్ను ఈ స్థాయికి తెచ్చిందనుకుంటా. నా దృష్టిలో డబ్బులేని వాడు దరిద్రుడు కాడు. పనిలేనివాడు దరిద్రుడు. మీ నాన్న ఊహించనంత స్థాయికి ఎదిగారు కదా. ఇప్పుడాయన ఫీలింగ్ ఎలా ఉంది? మారుతి: నాన్న ఇప్పటికీ బందర్‌లోనే ఉన్నారు. ఆ ఊరు వదిలిపెట్టి రారాయన. ఆయన్ను కారుల్లో తిప్పాలని నాకుంటుంది. ఆయనేమో కారెక్కరు. సాధారణంగా బతకడానికే ఇష్టపడతారు. నాకు చేసిపెట్టడమంటే ఆయనకు ఆనందం. ‘సినిమా పోస్టర్‌పై మీ అబ్బాయ్ పేరు పడింది’ అని ఎవరైనా చెబితే... ఆ పోస్టర్ ముందు ఓ గంట గడిపి వెళతారాయన. సైకిలెక్కి నా పోస్టర్లన్నీ చూస్తూ ఊరంతా తిరుగుతారు. నేనంటే ఆయనకు అంత ఇష్టం. నాకు చిన్నప్పట్నుంచీ నాన్నతో అనుబంధం ఎక్కువ. అందుకే నా ‘బస్‌స్టాప్’ సినిమాలో ఇడ్లీబండి నడిపే వ్యక్తి పాత్రను అచ్చం మా నాన్న పాత్రలాగే డిజైన్ చేశా. ఆ పాత్ర గెటప్ కూడా మా నాన్నదే. అమ్మకు తెలీకుండా అప్పుడప్పుడు నాన్నకు వెయ్యిరూపాయలిస్తుంటా. దానికి ఆయన తెగ సంబరపడిపోతారు. ఆ వెయ్యిని ఆయన పుగాకు చుట్టల ఖర్చుకు వాడుతుంటారు. నాన్న లైఫ్‌లో గొప్ప ఎచీవ్మెంట్ ఏంటంటే... ఇదివరకు రాధికా థియేటర్ ఓనర్ వస్తున్నారంటే... నాన్న వెళ్లి గేట్ తీసేవారు. ఈ మధ్య ఆ థియేటర్ దగ్గరకు నాన్న వెళ్లారట. ఆయన్ను చూడగానే... థియేటర్ ఓనర్‌గారు గబగబా బయటకొచ్చి... నాన్నను థియేటర్లోకి తీసుకెళ్లి... ‘కుచేల్రావుగారొచ్చారు టీ తీసుకురండ్రా’ అని ఆయనతో టీ తాగించి, నాన్నతో ఓ ఫొటో కూడా దిగారట. ఆ క్షణంలో నాన్న కళ్లవెంట నీళ్లు తిరిగాయట. ఇంటికెళ్లి ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు. మా అమ్మ అయితే... ‘ఎంత ఆనందాన్ని ఇచ్చావురా.. ఇక మేం చచ్చిపోయినా ఫర్లేదు’ అని ఉద్వేగానికి లోనవుతూ మాట్లాడింది. నేను సాధించిందేంటో అప్పుడర్థమైంది నాకు. మా నాన్న అమాయకుడు, కుళ్లు, కుత్సితం తెలీని వాడు. అరటిపళ్ల బండిని నెట్టుకుంటూ... పొద్దున్నే వెళ్లి... మళ్లీ రాత్రి రెండిటికి ఇంటికొచ్చేవాడు. రోజుకు నలభై, యాభై రూపాయలు సంపాదించేవాడు. న్యాయంగా సంపాదించాలనుకునే దాంట్లోనే ఆయన జీవితం మొత్తం అయిపోయింది. అందుకే మా అమ్మానాన్నల్ని కంటికి రెప్పలా చూసుకోవాలనుంటుంది నాకు. బందరు నుంచి హైదరాబాద్ రావడానికి కారణమేంటి? డెరైక్టర్ అవ్వడానికేనా? మారుతి: కాదు.. ‘హార్ట్ యానిమేషన్ అకాడమీ’ పేరుతో అక్కినేని వెంకట్, తదితరులు ఓ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. యానిమేషన్‌పై ఉత్సాహం ఉన్న ఆర్టిస్టులు అప్లయ్ చేయొచ్చనే యాడ్ చూసి... అప్లయ్ చేశాను. రమ్మని కబురొచ్చింది. ఓ పదిహేను వేల రూపాయలు తీసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టా. ఫౌండేషన్ కోర్స్కే పదిహేను వేలు అన్నారు. టోటల్ కోర్స్ నేర్చుకోవాలంటే.. లక్షా 30 వేలు అవుతుందని తెలిసింది. ముందు ఫౌండేషన్ కోర్స్‌లో జాయినైపోయాను. నాతోపాటు ఓ రెండుమూడొందలు మంది ఆ కోర్స్‌లో చేరారు. ఓ వైపు కోర్స్ చేస్తూ... మరోవైపు పంజాగుట్టలో నంబర్ప్లేట్లు వేస్తూ ఉండేవాణ్ణి. అక్కడ నంబర్ప్లేట్లు వేస్తే... రోజుకు వంద రూపాయలిచ్చేవారు. అవి నా ఖర్చులకు సరిపోయేవి. ఫౌండేషన్ కోర్స్ అయ్యాక... మెయిన్ కోర్స్ జాయిన్ అవ్వాలి. ఆ కోర్స్ చేయాలంటే... లక్షా 30 వేల రూపాయలు కట్టాలి. నా దగ్గర అంత స్తోమత లేదు. ఏం చేయాలి? అనుకుంటున్న టైమ్‌లో... బాగా చేసిన ఓ పదిమందికి స్కాలర్షిప్ ఇస్తామని నోటీస్ బోర్డ్‌లో పెట్టారు. ఆ పదిమందిలో ఒకరిగా నిలవడానికి రెండొందల మందీ పోటీపడ్డారు. ఎలాగైనా బాగా చేసి ఆ పదిమందిలో నేనూ ఒకణ్ణి కావాలని కష్టపడ్డాను. అదృష్టవశాత్తూ అనుకున్నది సాధించాను. కష్టపడి యానిమేషన్ నేర్చుకున్నాను. కోర్స్ పూర్తయ్యాక శ్రీవెన్ మల్టీటెక్లో జాబ్ వచ్చింది. నెలకు నాలుగువేలు జీతం. అక్కడ కొన్నాళ్లు చేశాక డీక్యూలో జాబ్ వచ్చింది. అక్కడ చేసిన నాలుగైదేళ్లలో నెలకు లక్షా 30 వేలు డ్రా చేసే రేంజ్‌కి వచ్చాను. ఆ టైమ్‌లోనే బన్నీతో పరిచయం ఏర్పడింది. బన్నీతో మీ అనుబంధం గురించి చెప్పండి? మారుతి: తాను ఆర్టిస్టు కాకముందు.. యానిమేషన్ నేర్చుకోవాలనుకున్నాడు. మంచి ట్యూటర్ ఎవరని వాకబ్ చేసి, చివరకు నన్ను పిలిపించారు. బన్నీ వాళ్ల అమ్మగారు మాకు దూరపు బంధువు. దాంతో అనుకోకుండా బాగా కలిసిపోయాం. బన్నీకి నా కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం. నాతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు. ఇప్పటికీ నా సినిమా రిలీజైతే... తప్పకుండా తొలిరోజే చూస్తాడు. త్వరలో మేమిద్దరం కలిసి ఓ సినిమా చేస్తాం. ‘నీతో సినిమా అంటూ చేస్తే... ఆ సినిమా నీ స్టయిల్లోనే ఉండాలి’ అంటాడు తను. అసలు డెరైక్టర్ అవాలని ఎందుకనిపించింది మీకు? మారుతి: నేను టెన్త్ చదువుతున్న టైమ్‌లో ‘శివ’ రిలీజైంది. నాచురాలిటీకి దగ్గరగా సన్నివేశాలుండటం, ఆర్టిస్టులందరూ సెటిల్డ్‌గా మాట్లాడటం... ఇవన్నీ కొత్తగా అనిపించాయి. ‘సినిమా’ అనే మాధ్యమంపై నాకు ఆసక్తిని పెంచిన సినిమా అది. ఓ విధంగా నేను రామ్గోపాల్వర్మగారికి భక్తుణ్నని చెప్పాలి. ‘శివ’ చూసి ఇంటికెళుతూ.. దారిలో నాలో నేనే మాట్లాడేసుకునేవాణ్ణి. ఒక్కణ్ణే యాక్షన్ చేసుకుంటూ వెళ్లేవాణ్ణి. అలాగే... చిరంజీవిగారి సినిమాల ప్రభావం కూడా నాపై ఉంది. నేను చిన్నప్పట్నుంచీ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాణ్ణి అవడం, బొమ్మలు బాగా వేయగలిగినవాణ్ణి కావడం వల్ల... కెమెరా బ్లాక్లంటే నాకు చాలా ఇష్టం. బాపుగారిలా స్పాట్లోనే బొమ్మలతో స్టోరీబోర్డ్ వేసుకునేవాణ్ణి. ఆ విధంగా నాకు తెలీకుండానే... డెరైక్షన్‌కి చేరువయ్యాను. ఇప్పటికీ స్టోరీబోర్డ్ గీసే... నా కెమెరామేన్‌కి సీన్ వివరిస్తాను. దర్శకత్వం చేయాలంటే... ఎవరిదగ్గరో పనిచేయనవసరం లేదు. సినిమా చూసి కూడా నేర్చుకోవచ్చు. గ్రామర్ అనేది సినిమాలోనే కనిపిస్తుంది. డెరైక్షన్ సరే... డైలాగులు ఎలా రాయగలుగుతున్నారు? మారుతి: నాలో రైటర్ ఉన్నాడని నాకే తెలీదు. పైగా బుక్స్ చదవడం అంటే నాకు పరమ ఎలర్జీ. రైటర్ అనేవాడికి కచ్చితంగా సాహిత్యంపై గ్రిప్ ఉండాలి. కానీ బుకిష్ నాలెడ్జ్ నాకస్సలు లేదు. అలాంటి నాకు రాయడం ఎలా సాధ్యమైంది? అంటే.. అది దైవదత్తమే అంటాను. చిన్నప్పట్నుంచీ ఫ్రెండ్స్‌ని జోకుల్తో నవ్విస్తుండేవాణ్ణి. వాటినే పేపర్‌పై ఎందుకు పెట్టకూడదు? అని రాయడం మొదలుపెట్టాను. నా గత చిత్రాల సంగతేమో కానీ.. ‘కొత్తజంట’లో నా డైలాగుల్ని మాత్రం కచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. సినిమా ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. అది చాలా శక్తిమంతమైన మాధ్యమం. యువతరాన్ని తప్పుదోవ పట్టించే ద్వంద్వార్థ సంభాషణలు సినిమాల్లో చేర్చడం ఒక బాధ్యతగల దర్శకుడిగా కరెక్టేనంటారా? మారుతి: పైకి ఎలా కనిపించినా... అంతర్లీనంగా ప్రతి ఒక్కరిలో ఓ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని తెరపైకి తెస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు రూపమే ఈ రోజుల్లో, ‘బస్‌స్టాప్’ సినిమాలు. ‘ఒక ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం’ అనుకొని చేసిన సినిమాలవి. వాటి తర్వాత చాలామంది డబుల్మీనింగ్లతో సినిమాలు తీశారు. అవన్నీ ఎందుకు ఆడలేదు? బూతులే సినిమాలను ఆడిస్తే... షకీలా సినిమాలు సంవత్సరం ఆడాలి. ఎందుకు ఆడవు? ప్రతికథకు ఆత్మ అనేది ఒకటుంటుంది. కథలోని సోల్ గొప్పదై ఉండాలి. నేను ఏది చెప్పినా సూటిగానే చెబుతాను. అది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ... ఎక్కువమందికి నచ్చింది. కాబట్టే నా సినిమాలు హిట్లయ్యాయి. నేను టాలెంట్‌ని నమ్ముకొని వచ్చినవాణ్ణి. ఏదో నాలుగు బూతు డైలాగులు రాసి హిట్లు కొట్టేసి డబ్బులు సంపాదిద్దాం అనుకునే నేచర్ కాదు నాది. ట్రెండ్ మారింది. మనం మాట్లాడుతున్న తీరు మారింది. ప్రతిదీ భూతద్దంలో చూడకూడదు. అందుకని మరీ ఎడ్యుకేట్ చేసేలా సినిమాలు ఉండకూడదు కదా! ముఖ్యంగా మీ ‘బస్‌స్టాప్’ సినిమాలో కొన్ని సన్నివేశాలైతే.. చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని కొందరి అభిప్రాయం. ఉదాహరణకు బాత్రూమ్లో ల్యాప్‌టాప్ సీన్. అలా చూపించొచ్చా? మారుతి: నేటియువత ఎలా ఉన్నారు అనేది మీకు తెలియందీ కాదు... నాకు తెలియందీ కాదు. నేను చూపించింది టెన్ పర్సెంట్ మాత్రమే. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లల్లో జరుగుతున్నా సరే... బయట చెప్పుకోలేని పరిస్థితిని ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తోంది. సర్దుకుపోవడం సొసైటీకి అలవాటైపోయింది. కూతురు ఓ కుర్రాడ్ని ప్రేమిస్తుందని తెలిస్తే.. ‘ఈ ఏజ్‌లో కామనేలే’ అని తండ్రులే సర్దుకుపోతున్నారు. టైమొచ్చినప్పుడు, కరెక్టోడు దొరికినప్పుడు ముడిపెట్టేద్దాం అనుకుంటున్నారు. కాస్త మధ్య తరగతి కుటుంబాల్లోనే ఇంకా కట్టుబాట్లు బతికున్నాయి. చదువు కారణంగా పిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వక మధ్యతరగతి తల్లిదండ్రులకు తప్పడంలేదు. అలాంటి టైమ్‌లో వాళ్లకు కొన్ని నిజాలు తెలియాలి. అందుకే ‘బస్‌స్టాప్’ తీశాను. నేను ఒక జానర్‌ని ఎంచుకున్నా. ‘ఇది నా జానర్’ అని ట్రైలర్లోనే చెప్పేస్తున్నా. అది నచ్చినోళ్లే సినిమాకొస్తారు. నచ్చనివారు రారు. దట్సాల్. ఈ రోజుల్లో, బస్‌స్టాప్ చిత్రాలు మీకు సక్సెస్‌లు ఇచ్చాయి. అలాగే విమర్శలకు కూడా కారణమయ్యాయి. మీపై విమర్శలు వినిపించినప్పుడు మీకు బాధ అనిపించిందా? మారుతి: నేను బూతుడైలాగుల్నే నమ్ముకొని వచ్చినవాణ్నయితే.. మీరన్నట్లు భయం, బాధ కలుగుతాయి. కానీ... నన్ను ఇంకా పూర్తిగా ఎవరూ చూడలేదు. నా సామర్థ్యం తెలిసిన వారు ఇక్కడ చాలా తక్కువ. అలాంటప్పుడు నేను బాధ పడటం ఫూలిష్‌నెస్ అవుతుంది. అందుకని విమర్శలను నేను తేలిగ్గా మాత్రం తీసుకోను. నన్ను ఒకరు విమర్శించారంటే... కచ్చితంగా నాలో తప్పు ఉండే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? రెండోసారి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఆ విషయంలో నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. నేను క్లీన్ మూవీలు కూడా తీయగలను అని నిరూపించుకోవడానికే ‘ప్రేమకథాచిత్రమ్’ తీశాను. ‘ప్రేమకథాచిత్రమ్’ మీపై వచ్చిన బ్యాడ్‌ని కొంతవరకు తుడిచేసిందనే చెప్పాలి. మారుతి: కచ్చితంగా... ఆ సినిమా నాకిచ్చిన ఎనర్జీ అంతా ఇంతా కాదు. కేవలం ఆ సినిమా వల్లే ఎన్నో కథలు నాలో పుట్టాయి. ‘ప్రేమకథాచిత్రమ్’ని ఎడిటింగ్ రూమ్‌లో చూసిన చాలామంది పెదవి విరిచారు. అది సినిమానే కాదన్నారు. ‘ఆ గిరిగాడు అసలు ఆర్టిస్టే కాదు. వాణ్ణి ఎందుకు నమ్మావ్... వాడి లెంగ్త్‌లు కట్ చేయ్’ అని సలహా ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి, ‘ఇలాంటి క్లీన్ సినిమాలు నీ నుంచి చూడరు... నీ నుంచి డబుల్‌మీనింగ్ డైలాగుల్నే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇందులో అవేం వినబడటం లేదు. ఇది కచ్చితంగా ఆడదు. అందుకే.. ఈ సినిమాకు నీ పేరు వేసుకోకు’ అని చెప్పారు. నిజంగా భయపడిపోయా. ఓసారి తెల్లారుజాముదాకా ఎడిటింగ్ రూమ్‌లోనే కూర్చొని మళ్లీ మళ్లీ సినిమా చూశా. బాగానే ఉందే అనిపించింది. గుడ్డిగా సినిమాను విడుదల చేశాం. మేం ఖర్చుపెట్టిన దానికి ఏడురెట్లు వసూళ్లు చేసిందా సినిమా. ‘నువ్వు కొత్తగా వెళ్లు.. మేం ఆదరిస్తాం’ అని జనాలు నాకిచ్చిన భరోసా ‘ప్రేమకథాచిత్రమ్’. మీ వయసు మూడు సినిమాలు. ఓ విధంగా మీరే నిలదొక్కుకునే స్టేజ్‌లో ఉన్నారు. కానీ మీరేమో అందుకు భిన్నంగా... మీరు నిలబడుతూ... పదిమందిని నిలబెడుతూ ముందుకెళ్తున్నారు. నేటి దర్శకులకు భిన్నంగా పడుతున్నాయి మీ అడుగులు. ఇది అనుకోకుండా జరుగుతోందా? లేక ఓ ప్లాన్ ప్రకారం వెళుతున్నారా? మారుతి: నేను కష్టపడి పైకొచ్చినవాణ్ణి. అందుకే కష్టపడి పనిచేసేవారంటే నాకిష్టం. క్రియేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి.. ప్రతిభను తేలిగ్గా పసిగట్టగలను. బహుశా ఈ లక్షణాల వల్లే పదిమందికి హెల్ప్ అవుతున్నానేమో. ఇండస్ట్రీతో నా అనుబంధం దశాబ్దంపైనే. తొలినాళ్లలో కొన్ని సినిమాలను పంపిణీ కూడా చేశాను. టాలెంట్ ఉండి కూడా వెనుకబడ్డవారిని ఇక్కడ చాలామందిని చూశాను. శక్తి లేనప్పుడు వారిని చూసి బాధపడేవాణ్ణి. ఇప్పుడు నాకు దేవుడు కావాల్సినంత శక్తినిచ్చాడు. అందుకే ప్రోత్సాహాన్నిస్తున్నా. ‘అదృష్టం’ అనే ఫ్లాప్ సినిమాను తీసేసరికి శేఖర్సూరిపై అందరూ ఫ్లాప్ డెరైక్టర్ అనే ముద్ర వేశారు. అతని టాలెంట్ నాకు పూర్తి తెలుసు. అందుకే... ‘ఏ ఫిలింబై అరవింద్’ కథ తాను తయారు చేసుకున్నప్పుడు... ఇండస్ట్రీలో చాలామందికి అతనితో కథ చెప్పించాను. చివరకు వర్కవుట్ అయ్యింది. తీశాడు. పెద్ద హిట్ కొట్టాడు. అందరూ మంచి డెరైక్టర్ అన్నారు. ఒక్క ప్రయత్నంతో ఎవరి ప్రతిభను అంచనా వేయకూడదని, మరొక కోణంలో అతనికి టాలెంట్ ఉండొచ్చని దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను ప్రోత్సహించి, షైన్ చేస్తే... మరిన్ని మంచి సినిమాలొస్తాయి. అందుకే ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తున్నా. నా గడప తొక్కిన ఎవరైనా సరే... నిరుత్సాహంతో వెనుదిరగడానికి నేనిష్టపడను. ‘దాసరి’ మారుతి.. సాధ్యమైనంతమేర ఇంటిపేరును సార్థకత చేసుకునే పనిలో ఉన్నట్టున్నారు మారుతి: అంతపెద్ద కోరికలేం లేవండీ.. ఒక ప్రణాళిక ప్రకారం నేనెప్పుడూ నడవలేదు. ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోయానంతే. నేను బతకాలి.. ఏం చేస్తే బతకగలను? అనేదే ఫస్ట్ ఆలోచించా. ఆ ఆలోచనే... స్టిక్కరింగ్ వేసుకొని బతికే నన్ను నెలకు లక్షా 30 వేల రూపాయలు డ్రా చేసేలా చేసింది. ‘నేనంటూ ఒకణ్ణి ఉన్నానని అందరికీ తెలియాలి. అందరి దృష్టీ నాపై పడాలి’ అని ఆశించాను. ఆ ఆశే ‘ఈ రోజుల్లో’ సినిమా తీసేలా చేసింది. నా రెండో సినిమా ‘బస్‌స్టాప్’కి నాపై ‘బూతు డెరైక్టర్’ అనే ముద్ర వేశారు. అప్పుడు దర్శకుడిగా నేనేంటో అటు ఇండస్ట్రీకి, ఇటు ప్రేక్షకులకూ తెలియాలి అని కసిగా అనుకున్నా. ఆ కసే ‘ప్రేమకథాచిత్రమ్’ తెరకెక్కించేలా చేసింది. వంద సినిమాలు డెరైక్ట్ చేశాక గానీ... దాసరి, రాఘవేంద్రరావు లాంటివాళ్లు ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అనే టైటిల్‌కార్డ్ వేసుకోలేదు. మీరు మూడో సినిమాకే ఆ కార్డ్ వేసేసుకున్నారు. ఆ టైటిల్ కార్డ్ చూడగానే.. మారుతీకి అప్పుడే అంత దేనికి? అనుకున్నవారు లేకపోలేదు... మరి మీరేమంటారు? మారుతి: నాకు ఏ దారి కరెక్ట్ అనిపిస్తే.. ఆ దారిలో వెళతా. అంతేతప్ప వాళ్లు తిడుతున్నారని, వీళ్లు పొగుడుతున్నారని నా దారి మార్చుకోను. నేను రోడ్డు పక్కన ప్లాట్‌ఫాంపై స్టిక్కరింగులేసుకుని బతికినోణ్ణి. ఈ రోజు ఉన్నట్టుండి పేరుప్రఖ్యాతులు వచ్చాయి. వీటిని శాశ్వతం అని నేను అనుకోను. ఇవన్నీ ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. పోయినా నేను పెద్దగా ఫీలవ్వను. ఎందుకంటే.. నా విద్య నాకుంది. మళ్లీ రోడ్డుమీదకెళ్లి స్టిక్కరింగులేసుకుంటా. మాటవరసకు చెబుతున్న మాట కాదిది. మళ్లీ చేసి చూపిస్తా. ఇడ్లీ బండి పెట్టుకొని కూడా బతికేయగలను. ‘మారుతీకి అప్పుడే అంత దేనికి?’ అనుకున్నవారికి నేనిచ్చే సమాధానమిది. దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్‌కార్డ్ ‘దర్శకత్వం’ అనే టైటిల్‌కార్డ్ కంటే గొప్పదేం కాదు. నాకు తెలిసి దానికి సీనియారిటీతో పనిలేదు. స్టార్‌డమ్‌ని పట్టించుకోనని మీరంటున్నారు. కానీ బయట మీపై వేరే అభియోగం ఉంది. స్టార్డమ్ ఉండగానే ఇంటికి చక్కదిద్దుకుంటున్నారనీ... కనిపించిన ప్రతి సినిమానూ సమర్పించేస్తున్నారనీ, సదరు నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. మీరేం అంటారు? మారుతి: నా స్టార్‌డమ్‌ని నేను వాడుకోవడంలా, నా పేరును, నా ఇమేజ్‌ని వేరే వాళ్లు వాడుకుంటున్నారు. ‘మా సినిమాను ‘సమర్పణ’ అని మీ పేరు వేసుకుంటాం. దానికి ప్రతిగా 75 లక్షలిస్తాం’ అని గత ఏడాది నన్నడిగిన వాళ్లు కోకొల్లలు. అలా వచ్చిన ప్రతి ఆఫర్‌నీ నేను ‘ఓకే’ చేసుంటే... ఒక్క ఏడాదిలోనే కోట్లు సంపాదించేవాణ్ణి. కథ గురించి తెలుసుకోకుండా, దర్శకుని ప్రతిభను అంచనా వేయకుండా.. కేవలం డబ్బు తీసుకొని సినిమాలను సమర్పిస్తున్నాననడం అన్యాయం. నిజానికి అక్కడ జరుగుతోంది వేరే. ముందు కథ వినాలి. ఆ ప్రాజెక్ట్‌పై నమ్మకం కుదిరాక, వాళ్లకు మంచి టెక్నీషియన్లను సెట్ చేయాలి. ఇదంతా నా బాధ్యతే. సినిమా తీసినవారికీ, కొన్నవారికీ లాభాలు తెచ్చిపెట్టే విధంగానే బిజినెస్ చేసిపెట్టే బాధ్యత కూడా నాదే. సినిమాకయ్యే ఖర్చు మాత్రం సదరు నిర్మాతే భరిస్తాడు. ఆ సినిమాకు ప్రాఫిట్ వస్తే... నేను పడిన కష్టానికి ప్రతిఫలంగా ప్రాఫిట్లో సగం తీసుకుంటా. ప్రాఫిట్ రాకపోతే... ఆ సినిమా నుంచి ఏమీ ఆశించను. చిన్న సినిమాలకు ‘సమర్పణ’గా నా పేరు వేయడం వల్ల.. వాటికి కాస్తంత ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా నా పేరు కాస్త హెల్ప్ అవుతుంది. అలాగే.. నా కింద వందమంది ఎంప్లాయిస్ పనిచేస్తున్నారు. వాళ్లందరికీ పని దొరుకుతుంది. ‘మారుతి సమర్పించు’ అనే టైటిల్ కార్డ్ వెనుక ఇంత కథ ఉంది. సరే... వెంకటేష్‌తో ‘రాధా’ అంటున్నారు. హోంమినిస్టర్ ప్రేమకథ అంటున్నారు. ఏంటా కబుర్లు? మారుతి: మంచి లవ్‌స్టోరీ అది. వెంకటేష్‌గారి ఏజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. సెలబ్రిటీలు కూడా ప్రేమలో పడతారు. అయితే... దాన్ని వ్యక్తవరచడం మాత్రం వారికి కష్టతరమైన విషయం. ఓ సాధారణ స్త్రీని... ఓ హోంమినిస్టర్ ఇష్టపడితే.. దాన్ని తాను ఎలా వ్యక్తపరిచాడు? తద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమా కథ. మారుతి ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాడని అందరూ అంటున్నారు కదా. అందుకే... ఆ పేరు చెడకుండా ఈ సినిమా ఉంటుంది. 27ఏళ్ల కెరీర్లో దాదాపు అన్ని రకాల పాత్రలూ చేశారు వెంకటేష్. అలాంటి హీరోని కొత్తగా చూపించడం ఎలా? అని ఆలోచించి ఇష్టంతో చేసుకున్న సబ్జెక్ట్ ఇది. నా స్టైల్లోకి ఆయన్ను తెచ్చుకొని ఈ కథ రాసుకున్నాను. సరదాగా అందరూ నవ్వుకునేలా సినిమా ఉంటుంది. మీరు సృష్టించిన ట్రెండ్‌లోనే ప్రస్తుతం చిన్న సినిమాలన్నీ నడుస్తున్నాయి. ఎటు చూసినా అవే కథాంశాలు. ఓ విధంగా జనాలు విసిగిపోయారనే చెప్పాలి. ఈ ట్రెండ్‌ని మీరే బ్రేక్ చేయొచ్చుగా? మారుతి: తప్పకుండా చేస్తా. ప్రేక్షకులకు కాదు, నాక్కూడా చికాకుగానే ఉంది. గోడలపై ఈ రోజు కనిపించిన పోస్టర్ రేపు కనిపించడం లేదు. బూతులు పెట్టేస్తే సినిమా ఆడేస్తుందనుకొని, విలువలకు తిలోదకాలిచ్చేసి సినిమాలు తీస్తున్నారు. చివరకు దెబ్బతింటున్నారు. ఈ తీరుగా సినిమాలు రాకపోతేనే మంచిది. సినిమా అనేది కాపీ జాబ్ కాదు. క్రియేటివ్ జాబ్. హిట్ సినిమాలను, కొరియన్ సినిమాలను, పరభాషా కథలను కాపీ కొట్టేసి తీసే సినిమాలు నా దృష్టిలో సినిమాలే కాదు. సినిమా అంటే... మనలోంచి పుట్టాలి. మస్తిష్కంలోంచి ఉద్భవించాలి. ప్రాబ్లమ్ సొసైటీలోంచి తీయాలి. అది అందరికీ కనెక్టయ్యేదిగా ఉండాలి. ‘బొమ్మరిల్లు’ ఎందుకు ఆడింది అంటే.. ప్రతి కుటుంబానికి ఆ కథ కనెక్ట్ అయ్యింది.. కొత్త సినిమాలొస్తే ప్రూవ్ అవుతాయ్ అనడానికి ఆ సినిమానే నిదర్శనం. - బుర్రా నరసింహ ‘ఈ రోజుల్లో’ సినిమా విడుదల ముందురోజు రాత్రి... మీరు పడిన అంతర్మథనం? మారుతి: అది నా జీవితంలో గొప్ప మిరాకిల్. సినిమా అంటేనే తెలీని నేను, 5డి కెమెరాతో సినిమా తీశాను. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పటికే సినిమాను అమ్మేశాం. వాళ్లిచ్చిన డబ్బులు ఖర్చుపెట్టేశాం. డీటీఎస్ ప్రింట్లు కూడా లేవు. సినిమా రిలీజ్ రోజున ఎవరూలేని ఓ వీధిలో ఓ పక్కగా కారును పార్క్‌చేసి, ‘సినిమా ఎందుకు తీశాన్రా దేవుడా...’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాను. ఆ క్షణాలు నాకింకా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. నాకు ఫస్ట్ నుంచి నెగిటివ్‌గా ఆలోచించడం అలవాటు. ‘రేపు సినిమా రిలీజ్ అవుతుంది. పెద్ద ఫ్లాప్ అవుతుంది. కొన్నవాళ్లందరూ మీద పడతారు. ఏం చేయాలి?’ ఇదే ఆలోచన. అందుకే నాకు రెండు ఫోన్లు ఉంటే... ఒక ఫోన్ స్విచాఫ్ చేసేశాను. ఇంతలో రెండోఫోన్ రింగ్ అయ్యింది. ‘గోకుల్ థియేటర్ దగ్గర జనాలున్నారు...రా’ అంటూ ఫ్రెండ్ ఫోన్. ‘హె... ఈ సినిమాకు జనాలుండటం ఏంటి... ఉట్టిమాట’ అనుకున్నా. మళ్లీ ఫోన్... ‘మన ట్రైలర్స్‌కి మంచి ఇంపాక్ట్ వచ్చినట్టుంది.. ఏలూరులో కూడా జనాలు ఫుల్‌గా ఉన్నారంట’ అని. ఏదో మిరాకిల్ జరుగుతున్నట్టు అనిపించి, గోకుల్ థియటేర్కి వెళ్లాను. తలుపు తీసి థియేటర్లోకి అడుగుపెట్టగానే.. హాల్లో నాన్‌స్టాప్ నవ్వులు. జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆ రోజునే తొలిసారిగా నాకు వందకు పైగా ఫోన్లొచ్చాయి. ఆ అంకె ఇప్పటికీ తగ్గలేదు. ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ‘ఈ రోజుల్లో’ విషయంలో... నా మిత్రులు నాన్‌స్టాప్ శ్రీను, ఎస్కెఎన్ నాకిచ్చిన మోరల్ సపోర్ట్‌ని మాటల్లో చెప్పలేను. నా ప్రాజెక్ట్‌ని వాళ్లిద్దరూ తీసుకెళ్లి జనాల్లోకి విసిరేశారు. వారిద్దరూ పబ్లిసిటీ చేసిన విధానమే ‘ఈ రోజుల్లో’ సినిమాను నిలబెట్టింది. ‘ఈ రోజుల్లో’ ముందు, ‘ఈ రోజుల్లో’ తర్వాత మీలో మీరు గమనించిన తేడా? మారుతి: ‘ఈ రోజుల్లో’ ముందు పేపర్ బయట ఉండేవాణ్ణి. ‘ఈ రోజుల్లో’ తర్వాత పేపర్లోకి వచ్చాను. అంతే తేడా! ఇంతకు మించి నాలో ఏ మార్పూ లేదు. నాలో మార్పు రాదు కూడా. అయితే... ఒకప్పుడు నన్ను తక్కువగా చూసిన వారూ, నన్ను శత్రువుగా భావించిన వారు.. ఇప్పుడు ‘మారుతి మా వాడు’ అన్నట్లు బిహేవ్ చేయడం, నాకు దగ్గర కావడానికి ప్రయత్నించడం... చూస్తుంటే... ఏదో తెలీని చిన్న సంతృప్తి. ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకి దర్శకుడు ప్రభాకరరెడ్డి అయితే.. క్రెడిట్ మొత్తం మారుతీ కొట్టేశాడని అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు..? మారుతి: ఆ విషయం చెప్పేముందు.. ఈ సినిమాకు ముందు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పాలి. ‘ప్రేమకథాచిత్రమ్’ నిర్మాత సుదర్శన్‌రెడ్డి.. ‘ఈ రోజుల్లో’ నుంచీ నాకు పరిచయం. ‘ఈ రోజుల్లో’ చిత్రాన్ని వైజాగ్‌లో రిలీజ్ చేయాలనుకున్నారాయన. అనుకోకుండా ఎడిటింగ్ రూమ్‌లో ఆ సినిమా చూశారు. ఇది ఆడే ప్రసక్తే లేదని, అట్టర్‌ఫ్లాప్ సినిమా అని తేల్చిపారేశారు. ఆయన అభిప్రాయం అదైనప్పుడు ఆయనకే వైజాగ్ అమ్మడం కరెక్ట్ కాదని, వేరే వాళ్లకు ఆ సినిమా ఇచ్చాం. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. కొన్నవాళ్లకు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది. సుదర్శన్‌రెడ్డి అప్పుడు నిజంగా షాక్ అయ్యారు. ‘ఇంత హిట్ సినిమాను ఏ దృష్టితో చూశాను’ అని బాధపడిపోయారు. అప్పుడే తనకు ఓ సినిమా చేసిపెట్టమని అడిగారు. ‘బస్‌స్టాప్’ షూటింగ్ టైమ్‌లో అయిదులక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేనేమో అప్పటికే గీతా ఆర్ట్స్‌వారికి కమిటై ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం మూడో సినిమా గీతా ఆర్ట్స్‌కే చేయాలి. అందుకే...‘ కథ, మాటలు ఇచ్చి.. నా కోై-డెరెక్టర్ రాజేష్‌తో సినిమా చేయిస్తాను’ అని చెప్పాను. ఆయన ‘ఓకే’ అన్నారు. హీరోగా సుధీర్‌బాబుని ఫైనల్ చేశారు. అయితే... సుధీర్‌బాబు మాత్రం నేను డెరైక్ట్ చేస్తేనే సినిమా చేస్తానన్నాడు. ‘నేనే డెరైక్ట్ చేస్తాను కానీ.. పేరు మాత్రం వేసుకోలేను’ అని సుధీర్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాను. చివరకు ఎలాగో అంగీకరించాడు. అయితే... మా కో-డెరైక్టర్ రాజేష్ మాత్రం ఇబ్బందిగా ఫీలయ్యాడు. ‘మీరు డెరైక్ట్ చేస్తుంటే నేను పక్కన ఉండటం, పేరు మాత్రం నాది వేయడం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఈ సినిమా చేయలేను’ అనేశాడు. అలాంటి టైమ్‌లో.. మా కెమెరామేన్ ప్రభాకరరెడ్డి.. ఆయనంతట ఆయనే వచ్చి.. ‘ఎవరి పేర్లో దేనికి? నా పేరు వేసుకో. నా కెలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పడంతో... ప్రభాకరరెడ్డిగారి పేరు మీద ‘ప్రేమకథాచిత్రమ్’ డెరైక్ట్ చేశాను. అయితే.. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సినిమా డెరైక్టర్‌గా నా పేరు లేకపోవడం ఇంట్లోవాళ్లకు కూడా బాధ కలిగించింది. కష్టపడి సినిమా తీసినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించడం తప్పుకాదని ఇంట్లోవాళ్లు నచ్చజెప్పడంతో... ఆ సినిమా దర్శకునిగా నేను బయటకు రాక తప్పలేదు. ఈ విషయంలో నాకు సహకరించిన ప్రభాకరరెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. -
తెనాలిలో ఒకరి దారుణహత్య
తెనాలి రూరల్, న్యూస్‌లైన్ :తెనాలి బస్టాండ్ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్సులో ఓ వ్యక్తిని దారుణంగా శనివారం అర్ధరాత్రి దాటాక హతమార్చారు. ముగ్గురు వ్యక్తులు నిందితులుగా భావిస్తుండగా, వీరిలో ఒకయువకుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బేతాళ కాంతసునీల హత్యకేసులోనూ నిందితుడు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ ఐతానగర్‌కు చెందిన బొనిగల ఆనంద్‌కు అదేప్రాంతానికి చెందిన సముద్రాల మహంకాళి, సముద్రాల రాజేష్, సముద్రాల పవన్‌కుమార్, వారి వర్గీయులతో ఆధిపత్య పోరుతో గతంలోనే వివాదాలు జరిగేవి. ఇటీవలి కాలంలో ఆనంద్‌తో ఐతానగర్‌కే చెందిన కొండేపూడి చినవెంకటస్వామి అలియాస్ బాలశౌరి(38) సన్నిహితంగా మెలుగుతున్నాడు. మహంకాళి వర్గీయులతో ఆనంద్‌కు ఘర్షణ జరిగినప్పుడు బాలశౌరి ఆనంద్‌కు మద్దతుగా మాట్లాడుతుండేవాడు. రెండువర్గాలు మీ అంతు చూస్తామంటే మీ అంతు చూస్తామంటూ హెచ్చరించుకుంటుండే వారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆనంద్, బాలశౌరి ప్రకాశంరోడ్డులోని ఓ బార్లో మద్యం తాగారు. అదే బార్లో మద్యం తాగుతున్న సముద్రాల రాజేష్‌తో ఘర్షణ పడ్డారు. బార్ నిర్వాహకులు వీరికి సర్దిచెప్పి పంపించేశారు. ఈ విషయాన్ని రాజేష్.. మహంకాళి, పవన్‌కుమార్‌లకు చెప్పాడు. రాత్రికి బాలశౌరి బస్టాండ్ ఆవరణలో మూసి ఉన్న కూల్‌డ్రింక్ షాపు ఎదుట ఉన్న అరుగుపై కూర్చుని మద్యం తాగుతున్నాడు. సమాచారం అందుకున్న మహంకాళి, పవన్‌కుమార్ అక్కడికి వెళ్లి బాలశౌరిపై ఇనుపరాడ్లతో దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరూ పరారయ్యారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సీఐ ఎస్.ఆంథోనిరాజ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. తల పైభాగం పగిలి మెదడు బయటకు రావడంతో బాలశౌరి మృతిచెందాడని గుర్తించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల కేసులోనూ నిందితుడు.. పోలీసులు పేర్కొంటున్న నిందితుల్లో ఒకరైన సముద్రాల పవన్‌కుమార్ బేతాళ కాంతసునీల హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. సునీల హత్యోదంతం జరిగినప్పుడు మొత్త ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేయగా వారిలో పవన్‌కుమార్ ఒకడు. రాజేష్ ఐతానగర్ బీఎస్ఏ సెంటరులో ైఎలక్ట్రికల్ లెటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. పవన్‌కుమార్‌కు మహంకాళి, రాజేష్ బాబాయిలు. -
ఆత్మాభిమానం షెల్టర్ ఇచ్చింది
బస్టాప్! ఇరుగ్గా ఉంటుంది. మురిగ్గా ఉంటుంది. వానకు చెరువవుతుంది. ఎండకు చెమటౌతుంది. చలికి చచ్చేచావౌతుంది. తప్పనిసరైతే తప్ప, అక్కడెవ్వరూ... ఎక్కువసేపు ఉండాలనుకోరు. అలాంటిది ఏడాదిగా బస్టాప్‌లోనే ఉంటోంది అనసూయమ్మ! అక్కడే ఉండడం, అక్కడే తినడం. పిల్లల్లేరా? ఉన్నారు. ఎనిమిది మంది! వాళ్లకు ఇళ్లే లేవా? ‘ఉన్నాయ్ కానీ, నేనుండలేను’ అంటోంది ఈ వృద్ధమాత! ఎందుకని? కొడుకుల మనసుల కంటే బస్టాపే విశాలంగా అనిపించిందా? ఈ మాటకు నవ్వుతుంది. ఏమిటా నవ్వుకు అర్థం? చదవండి... ఈవారం ‘ప్రజాంశం’ ! ‘అమ్మని యాదగిరి గుట్టలో వదిలివెళ్లిన కొడుకు’, ‘తల్లి దగ్గర బంగారం తీసుకుని ఇంటినుంచి వెళ్లగొట్టిన పుత్రుడు’... ఇలాంటి శీర్షికలతో రోజుకొక వార్త చదువుతుంటాం. ఒక నిమిషం.. ‘అయ్యో... ఎంత దారుణం’ అనుకుని ఒక నిట్టూర్పుతో సరిపెట్టుకుంటాం. పెద్దవాళ్లయితే ‘కలికాలం... కన్నతల్లి అని కూడా చూడకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు...’ అంటూ రెండు మూడు శాపనార్థాలు పెట్టి ఊరుకుంటారు. తల్లికి బిడ్డ బరువు కాదు. ఆమాటకొస్తే... బిడ్డలెందరయినా బరువు కాదు. కాని ఇప్పుడు బిడ్డకు తల్లి బరువవుతోంది. రోడ్డుపై భిక్షాటన చేసుకునే వృద్ధ మాతృమూర్తులందరూ బిడ్డలు లేని వారు కాదు... పట్టెడన్నం పెట్టలేని నిరుపేదబిడ్డల తల్లులు అంతకంటే కాదు. అలాంటి తల్లుల్లో అనసూయ ఒకరు. హైదరాబాద్ హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ దిగగానే చండ్రరాజేశ్వరరావు వృద్ధాశ్రమానికి ఆనుకునే ఉన్న బస్‌స్టాప్‌లో గత ఏడాదికాలంగా ఉంటున్న ఈ వృద్ధురాలిని పలకరిస్తే.... తన పేగు పంచుకున్న ఎనిమిదిమంది కొడుకుల కబుర్లు ఓపిగ్గా చెప్పుకొచ్చింది. బిడ్డలేని తల్లి అయితే అనాథనంటూ కన్నీళ్లు పెట్టుకునేది. పదిమందిని కని పెంచిన ఆ తల్లిప్రేమ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్వగా... ఏడ్వగా... నవ్వే మిగిలినట్లుంది! ‘ఫలానా బస్‌స్టాప్‌లో ఒక ముసలావిడ చాలా రోజుల నుంచి ఉంటోంది. సాయంత్రం అవగానే ఏవో కూనిరాగాలు తీసుకుంటూ వచ్చేపోయేవాళ్లని పలకరిస్తూ చాలా హుషారుగా కనిపిస్తుంది. చూడబోతే.. బాగా బతికినావిడలా ఉంది. ఎవరూ లేని వ్యక్తి మాత్రం కాదనిపిస్తుంది...’ అని అటుగా వెళ్తున్నవాళ్లు అనుకోవడం విని అక్కడికి వెళ్లినపుడు... ఆమె అప్పుడే నిద్రలేచినట్టుంది. గోడకు చేరగిలబడి తనలో తాను ఏవో మాట్లాడుకుంటోంది. ‘నీ పేరేంటమ్మా...’ అని అడగ్గానే...‘అనసూయ తల్లీ... అయినా నా పేరు నీకెందుకమ్మా’ అంటూ అడిగింది. విషయం చెప్పగానే తన గురించి చక్కగా చెప్పుకొచ్చింది. మధురైలో పుట్టి... ‘‘నేను పుట్టింది మధురైలోని మధురమీనాక్షి గుడి దగ్గర. మా నాన్న మిలటరీలో పనిచేసేవాడు. నాకు నాలుగేళ్లప్పుడే చనిపోయాడు. మా ఇంటి దగ్గరున్న ఒక పెద్దాయన అమ్మనీ, నన్నూ వరంగల్‌లోని పరకాల దగ్గర పుత్తాలపల్లి రాజేంద్రస్వామికి అమ్మేశాడు. అతను అమ్మని తన దగ్గరపెట్టుకుని నాకు ఆరేళ్ల వయసప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఆరువందల రూపాయలకు నన్ను అమ్మేశాడు. నాకు పదకొండేళ్లు వచ్చాక అతను తన కొడుకు మొగులయ్యకి ఇచ్చి పెళ్లి చేశాడు’’ అంటూ గతం గుర్తుచేసుకుంటున్నప్పుడు అనసూయ పదహారేళ్ల అమ్మాయిలా మారిపోయి తన పెళ్లినాటి కబుర్లు చెప్పుకొచ్చింది. మొగులయ్య చాలా మంచివాడు. అనసూయని కళ్లలో పెట్టుకుని చూసుకున్నాడు. వీరిద్దరి ప్రేమకు సాక్ష్యాలుగా పదిమంది పిల్లలు కళ్లముందు కదలాడుతుంటే చూసుకుని మురిసిపోయారు. కిరాణాకొట్టు... పెరుగు కుండ మొగులయ్య కిరాణాకొట్టు నడుపుతూ... అనసూయ పెరుగు అమ్ముతూ ఎనిమిదిమంది మగపిల్లల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్దచేశారు. ‘‘నా అదృష్టం బాగలేక ఇద్దరు మగపిల్లలు చిన్నప్పుడే రోగమొచ్చి సచ్చిపోయిండ్రు. మిగతావాళ్లని చేతనైనకాడికి చదివించినం. సత్యనారాయణ, వేణుగోపాల్, శంకర్లింగం, సదానందం, జయరాములు, సాంబమూర్తి, రాజేంద్రస్వామి, లక్ష్మీనారాయణస్వామి....’’ అంటూ బిడ్డల పేర్లు తలుచుకుంటుంటే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘మిగిలిన పిల్లలంతా ఆ దేవుని దయవల్ల క్షేమంగానే ఉన్నారు’’ అంటూ ఆ కన్నీళ్లని ఆనందబాష్పాలుగా మార్చుకుంది. నాలుగేళ ్లక్రితం చనిపోయిన తన భర్తని గుర్తు చేసుకుంటూ ‘‘ఇంకా చానాకాలం బతికేటోడే.... ఏం చేస్తడు... మంచంబట్టి కొడుకులకు బరువైండు. సమయానికి నేను కూడా లేను, అన్యాయంగా సచ్చిపోయిండు మారాజు’’. ఈసారి కన్నీళ్లు ఆగలేదు. కాసేపు భర్తని తలుచుకుంటూ, తన పరిస్థితికి బాధపడుతూ ఏడ్చింది. పాతబస్తీలో వదిలేశాడు పిల్లలు పెద్దవాళ్లయ్యాక అందరికీ పెళ్లిళ్లు చేశారు. అంతా బాగుందనుకున్న సమయంలో అనసూయకు మతిస్థిమితం తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. ‘‘అవునమ్మా... ఎక్కడికో వెళ్లిపోయాను. పాపం నా భర్త నాకోసం చాలా వెతికిండంట. నాకు జబ్బు నయమై పిల్లలు, భర్త గుర్తొచ్చి ఇంటికి చేరేసరికి నా భర్త చనిపోయిండు. పిల్లలు కొన్నిరోజులు ఒకదగ్గర, కొన్ని రోజులు ఒకదగ్గర అంటూ నన్ను పంచుకున్నారు. రెండు మూడేళ్లయినంక ఎవ్వరూ చూడమన్నరు. ఒకనాడు నా పెద్దకొడుకు డాక్టరు దగ్గరికి తీసుకపోతా అని చెప్పి... ఆటోల ఎక్కించుకుని పాతబస్తీ దర్గ దగ్గర వదిలిపెట్టి వచ్చేసిండు. పిచ్చోడు... నాకు హైదారాబాద్ మొత్తం తెలుసునన్న సంగతి వాడికి తెల్వదు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకే వాడు ఇక్కడ్నే ఈ ఆశ్రమంలో పని చేస్తున్నడని తెలిసి ఇక్కడే వాడి కళ్లెదురుగా ఉండాలనే పట్టుదలతో ఈ బస్టాపులో ఉంటున్న’’ అంటున్నప్పుడు అనసూయ కోపం మాటల్లోనే కాదు కళ్లలో కూడా కనిపించింది. ఆ పూజలెందుకు... బస్‌స్టాప్ పక్కనే తోపుడు బండిలో కొబ్బరిబోండాలమ్మే లక్ష్మి మాట్లాడుతూ... ‘‘నేను బండి పెట్టేటప్పటికే ఈమె ఇక్కడుంది. ఆమె కొడుకుల్లో ఒకరు గుళ్లో పూజారిగా, ఇంకో కొడుకు కొండాపూర్‌లోని ఒక వెల్డింగ్షాప్లోనూ పనిచేస్తున్నాడు. మిగతా కొడుకులు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బాగానే ఉన్నారు. అయినా, తల్లిని చూడని కొడుకులు ఎంతమంది ఉంటే మాత్రం ఏం లాభం?అలాంటి వాళ్లు ఉంటే ఎంత... లేకుంటే ఎంత’’ అని నిట్టూర్పు విడిచింది. చిన్నప్పుడు అమ్మ ధైర్యంగా ఉండి అన్ని పనులూ చక్కబెడితే మా అమ్మ చాలా స్ట్రాంగ్ అని గర్వంగా చెప్పుకుంటాం. అదే అరవైఏళ్లు దాటిన అమ్మ సలహా ఇస్తే ‘నీకెందుకు... కృష్ణా..రామా అని పడి ఉండక’ అంటాం. అలా అనే అనసూయకు బస్స్టాప్ని ఇల్లు చేశారు. ‘‘ఈ బస్టాపు నా బిడ్డల ఇల్లు కంటే విశాలంగా ఉంది. మనుషులు కనిపిస్తారు. కొందరు బిడ్డల్లా ప్రేమగా పలకరిస్తారు. ఇంకొందరు ఇంత తిండి పెడుతున్నారు. నాకు ఇంతకంటే ఏం కావాలి’’అంటూ కళ్లొత్తుకుందా పెద్దామె. ప్రతి తల్లికి బిడ్డల చిన్నప్పుడు పచ్చని జీవితం ఉంటుంది. పండుటాకై రాలి కిందపడే లోపు బిడ్డల చేతిలో నరకం చూస్తున్న అనసూయవంటి దురదృష్టవంతులైన తల్లులూ ఉంటారు. ఈమె కథ తల్లిని నిర్లక్ష్యం చేసే కొడుకులకు కనువిప్పు అయితే చాలు! - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అందుకే ‘ప్రిన్స్’ అయ్యాను : ప్రిన్స్
నీకు నాకు డాష్ డాష్, బస్‌స్టాప్, రొమాన్స్ చిత్రాల్లో హీరోగా చేసిన ప్రిన్స్... ఇప్పుడు చిన్న సినిమాల పాలిట మహేష్‌బాబు. తక్కువ సమయంలోనే బిజీ అయిపోయిన ఈ వైజాగ్ కుర్రాడితో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. స్పీడ్‌గా ఎదుగుతోన్న ఈ లవర్ బాయ్‌తో ఓ చిరు భేటీ... *** అసలు ప్రిన్స్ అని మీకెందుకు పేరు పెట్టారు? మా పెదనాన్నకన్నా మా నాన్నగారు ముందు పెళ్లి చేసుకున్నారు. ఈ తరంలో మా కుటుంబంలో పుట్టిన మొదటి మనవణ్ణి నేనే. అందుకే ముద్దుగా మా తాతగారు ప్రిన్స్ అని పెట్టారు. *** మరి... ఇంట్లో చాలా గారాబం చేసేవాళ్లేమో? చాలా అంటే చాలా. ఆడింది ఆటగా పాడింది పాటగా ఉండేది. తప్పు చేసినా ఏమీ అనేవాళ్లు కాదు. *** మీ నాన్నగారికే ముందు పెళ్లయ్యిందన్నారు..? మీ అమ్మానాన్నలకేమైనా లవ్‌స్టోరీ ఉందా? ఉందండి. వైజాగ్‌లో చదువుకుంటున్నప్పుడు అమ్మా నాన్న ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కుటుంబాన్ని పోషించాలి కాబట్టి.. వైజాగ్‌లో ఒక రిటైల్ షాప్ ఓపెన్ చేశారు. మా షాప్‌లో టాయ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పటికీ ఆ షాప్ ఉంది. *** ఓకే.. ఇక సినిమాల విషయానికొద్దాం.. హీరో అవ్వాలని చిన్నప్పట్నుంచే అనుకునేవారా? నాకన్నా మా నాన్నగారికి ఎక్కువగా ఉండేది. మోడలింగ్ చేయమని చెప్పేవారు. ఫొటో షూట్స్ చేయించేవారు. నా మీద నాకన్నా మా నాన్నగారికి నమ్మకం ఎక్కువ. నాన్నగారి నమ్మకం చూసి, నాక్కూడా మెల్లిగా నమ్మకం కుదిరింది. *** ‘నీకు నాకు డాష్ డాష్’ ఆఫర్ ఎలా వచ్చింది? కొత్తవాళ్లతో తేజగారు సినిమా తీస్తున్నారని విని, అప్లయ్ చేశాను. ఆడిషన్స్ చేసి, సెలక్ట్ చేశారు. ఆ క్షణం నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. *** తేజ కొట్టి పని చేయించుకుంటారట.. మిమ్మల్ని కూడా...? సినిమా బాగా రావడం కోసం ఆయన ఏమైనా చేస్తారు. షూటింగ్ స్పాట్లో నేను ఏడవాలనుకోండి.. ఏడుపు రాకపోతే తిడతారు. అప్పుడు ఏడుపు దానంతట అది వచ్చేస్తుంటుంది. మా నాన్నగారు తిట్టినప్పుడు ఎలా ఏడుస్తానో అలా అన్నమాట. *** మీరు చేసే ప్రతి సినిమా గురించీ తేజ దగ్గర చెబుతారట? అవునండీ. ఇప్పుడంటే నాకు పరిశ్రమలో చాలా పరిచయాలు ఏర్పడ్డాయి కానీ, హీరో అయినప్పుడు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి తేజగారు. నన్ను హీరోని చేసి, ఈ స్థాయిలో నిలబెట్టారు. ఏం ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను. నా వల్ల ఎంత అయితే అంత విశ్వాసంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఆయన సలహా అడుగుతాను. తేజగారి అనుభవాన్ని ఆ విధంగా నేను వాడుకుంటున్నాను. *** మీరు మహేష్‌బాబులా ఉంటారని చాలామంది అంటుంటారు. ఎప్పుడైనా ఆయన్ను కలిశారా? వాస్తవానికి నేను మహేష్‌బాబుగారి ఫ్యాన్‌ని. ఆయనలా ఉన్నాననడం ఆనందంగా ఉంది. సినిమాల్లోకొచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి ఆయన అలా వెళుతుంటే చూశాను. ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్‌పైన చూడ్డమే ఆరోజు నేరుగా చూసేసరికి ఎగ్జయిట్ అయ్యాను. *** ‘మనసును మాయ సేయకే’ ద్వారా తమిళ్‌కి పరిచయం కాబోతున్నారు.. అక్కడి మార్కెట్‌ని కూడా టార్గెట్ చేశారా? నాకు భాషతో సంబంధం లేదు. తెలుగులో మంచి అవకాశాలొస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో రెండు భాషల్లో ఈ సినిమా చేస్తున్నామని అడగ్గానే, ఒప్పుకున్నాను. కథ, నా పాత్ర కూడా బాగున్నాయి. నటనకు అవకాశం ఉన్న పాత్ర కాబట్టి తమిళంలో కూడా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో చేస్తున్న ‘బన్నీ ఎన్ చెర్రీ’ కూడా నా కెరీర్‌కి హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉంది. *** ‘బాషా’ ఫేమ్ సురేష్‌కృష్ణ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారట? అవును. అది క్రైమ్ థ్రిల్లర్. సురేష్కృష్ణగారి సినిమాల్లో హీరోలకో ప్రత్యేకమైన స్టయిల్, మేనరిజమ్ ఉంటాయి. ఇందులో నా పాత్ర కూడా అలానే ఉంటుంది.