ఆల్ ఇన్ ‘వన్’డర్! | All-in 'wandar! | Sakshi
Sakshi News home page

ఆల్ ఇన్ ‘వన్’డర్!

Published Thu, Feb 12 2015 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

ఆల్ ఇన్ ‘వన్’డర్!

ఆల్ ఇన్ ‘వన్’డర్!

నగరంలో సరికొత్త కాంప్లెక్స్‌లు  ఒకేచోట వివిధ అవసరాలు తీరేలా సన్నాహాలు {పభుత్వ  ఖాళీ స్థలాలు.. నిరుపయోగ భవనాల ఎంపిక జీహెచ్‌ఎంసీ ప్రణాళిక
 
సిటీబ్యూరో: ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన క్షణం నుంచీ మధ్యాహ్నం వరకూ మీరు సొంత పనులపై ఎక్కడెక్కడో తిరిగారు. ఇంటికి చేరాలనే ఉద్దేశంతో బస్‌స్టాప్‌నకు వచ్చారు. ఓ వైపు దాహం వేస్తోంది. కనుచూపు మేరలో కూల్ డ్రింక్ షాపులు లేవు. ఏం చేయాలో తోచడం లేదు. ఇంతలో మీ అబ్బాయి నోట్‌బుక్స్ తీసుకు రమ్మని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. పుస్తకాల షాప్ కావాలంటే  మరో రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లాల్సిందే. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు. ముఖం కడుక్కుందామనుకున్నా సమీపంలో టాయిలెట్స్ అందుబాటులో లేవు. అలాంటి సందర్భాలలో బస్‌స్టాప్‌లకు సమీపంలో షాపులు... టాయిలెట్స్ వంటివి ఉంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది కదూ. చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. ఇకపై ఇలాంటి సమస్యలకు తెర పడనుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారికి నిత్యజీవితంలోని వివిధ అవసరాలను ఒకే చోట తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. పాన్ నుంచి దువ్వెన వరకూ...
 
 రోడ్డు పక్కనే పార్కింగ్

రహదారి వెడల్పును బట్టి తగిన స్థలం ఉన్న చోట రోడ్డు పక్కనే వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. రోడ్డుకు రెండువైపులా పిల్లర్లు ఏర్పాటు చేసి... పైన వంతెన నిర్మించి దానిపై పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసే యోచన  ఉందని జీహెచ్‌ంఎసీ ప్రత్యేక అధికారి సోమేశ్ కుమార్ చెప్పారు.
 
 ట్విట్టర్‌లో..

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జరిగే పనులు, రోజువారీ కార్యక్రమాల వివరాలను ఫొటోలతో సహా ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ట్విట్టర్‌ను వినియోగించుకునే యోచన ఉంది.  ఈ పనులు ప్రజలకు తెలిస్తే.. వారు అన్నివిధాలా సహకరిస్తారని భావిస్తూ... అందుకు తగిన మాధ్యమంగా సోషల్ మీడియాను వినియోగించుకోనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement