అరెస్టయిన జ్యోతి, అలమేలు, ఉషా
అన్నానగర్: తిరుచ్చి జిల్లా ముసిరి బస్టాండులో బస్సు నుంచి ముగ్గురు మహిళలు గురువారం చోరీ చేసి పారిపోవడానికి యత్నించారు. గమనించిన స్థానికులు ఆ ముగ్గురిని పట్టుకుని విచారణ చేయగా.. వారు నగదు చోరీ చేశారని తెలిసింది. వివరాలు.. తిరుచ్చి మన్నార్‌పురం ప్రాంతానికి చెందిన వడివేలు భార్య గోమతి(38). ఈమె గురువారం తిరుచ్చి నుంచి ఓ ప్రైవేట్ బస్సులో ముసిరిలో ఉన్న ఆమె కన్నవారి ఇంటికి వచ్చింది. బస్టాండులో దిగినప్పుడు ఆమె నగదు పర్సు కనబడలేదు. దిగ్భ్రాంతి చెందిన ఆమె కేకలు వేసింది.
అప్పుడు ఆ బస్సు నుంచి ముగ్గురు మహిళలు దిగి పరిగెత్తడానికి ప్రయత్నించారు. సమీపంలో ఉన్న స్థానికులు ఆ మహిళలను అడ్డుకుని విచారణ చేశారు. వారు నగదు పర్సు చోరీ చేసినట్లు తెలిసింది. గోమతి ముసిరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ జయచిత్ర, ఎస్‌ఐ రామ్‌కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇందులో వారు వేలూరు జిల్లా కౌంజూర్ ప్రాంతానికి చెందిన జ్యోతి(32), అలమేలు(37), ఉషా(29) అని తెలిసింది. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి జైలులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment