మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి మండలం పెద్దగూడెం వద్ద బుధవారం రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గద్వాల మండలం గుడిపల్లికి చెందిన సత్తెమ్మ(45) అనే మహిళ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా.. ఆమెను పెద్దగూడెం బస్టాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు