ఇంటిలా మారిన బస్టాండు (ఫొటో కర్టెసీ : ఇండియా టుడే)
సాక్షి, బెంగళూరు : బెలగావి జిల్లాలోని కిట్టూర్ తాలూకాలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పని పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బస్సు రాకపోకలు అంతంత మాత్రంగా ఉండే కిట్టూర్ బస్టాండ్ గోడలపై ఇటుకలు పేర్చి, తలుపులు కూడా బిగించి.. ఇంటిలా మార్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి వరకు బస్టాండ్‌లా ఉండి.. తెల్లారేసరికి ఓ ఇంటిగా మారడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా ఎవరో ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారని, ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment