కోల్‌కతా: భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపిస్తోందని, రికవరీ బాటలో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తుండడంపై అప్రమత్త ధోరణిని ప్రకటించారు. స్వదేశీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వర్చువల్ సెమినార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని కీలక రంగాలు.. వ్యవసాయం, తయారీ, నిర్మాణం మంచి పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు.
ప్రైవేటు డిమాండ్, సేవల రంగం పనితీరు అంచనాలకు మించి ఉన్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు చేస్తోందంటూ, అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఉందని అంగీకరించారు. బ్యాంకింగ్ రంగం తగినన్ని నిధులతో ఉందంటూ, బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం మెరుగునకు ఐబీసీ సాయపడినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment