CEA
-
వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు - సీఈఏ కీలక వ్యాఖ్యలు
వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
Anantha Nageswaran: ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లో విశ్వాస పునరుద్ధరణ నెలకొందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇందుకుగాను ఆయన ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ విశ్వాస పునరుద్ధరణ భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల పురోగతి స్పష్టంగా ప్రతిబింబిస్తున్నట్లు నాగేశ్వరన్ వెల్లడించారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ జరిగింది. లేకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వద్ద ఎలా వృద్ధి చెందుతుంది? అలాగే మీరు పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్, తయారీ, సేవల సూచీల పురోగతి స్టాక్ మార్కెట్ పనితీరును చూడండి. స్థూల దేశీయోత్పత్తి అంకెల్లో సానుకూలంగా కనిపిస్తున్నాయి’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమి చెప్పారంటే... ► ప్రైవేట్ రంగంలో లిస్టెడ్ కంపెనీలు తమ మూలధన వ్యయాలను ప్రారంభించాయని, కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలనూ చేస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన మధ్యంతర బడ్జెట్లో ఇదే విషయాన్ని వెల్లడించారు. ► ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24 తో పోలి్చతే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో విశ్లేషించారు. ► ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నేపథ్యంలో స్టీల్, సిమెంట్, పెట్రోలియం వంటి కొన్ని రంగాలలో ఇటీ వలి కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. ► 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో రుణాలకు సంబంధించి అటు కార్పొరేట్, ఇటు బ్యాంకింగ్ రంగాల బ్యాలెన్స్ షీట్లు రెండూ కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ► కోవిడ్ నేపథ్యంలో రుణ భారాలను తగ్గించుకోడానికి తమ అసెట్స్‌ను సైతం విక్రయించిన కంపెనీలు, తాజా సానుకూల ఆర్థిక వాతావరణం నేపథ్యంలో రుణ సమీకరణ, వ్యాపార విస్తరణలపై దృష్టి సారించాయి. బ్యాంకింగ్ మూలధన నిష్పత్తి పటిష్టం.. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ తెలిపిన సమాచారం ప్రకారం, 15 శాతం సగటు మూలధన నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో)తో బ్యాంకుల ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే సమయానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 16.85 శాతంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్యాపిటల్ అడిక్వసీ రేషియో అత్యధికంగా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 16.80 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 16.13 క్యాపిటల్ అడిక్వసీ రేషియోను కలిగిఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 253 శాతం వృద్ధితో (రూ. 2,223 కోట్లు) అత్యధిక త్రైమాసిక నికర లాభం వృద్ధిని సాధించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం వృద్ధితో (రూ. 1,870 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 శాతం పెరుగుదలతో (రూ. 3,590 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. -
మైమరిపిస్తున్న కియా కొత్త కార్లు - (ఫొటోలు)
-
క్యూ1 జీడీపీ గణాంకాలు పూర్తి పారదర్శకం
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి గణాంకాల మదింపు తగిన విధంగా జరగలేదని వస్తున్న విమర్శల్లో ఎటువంటి వాస్తవం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఏప్రిల్–జూన్‌లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయినట్లు గత నెల చివర్లో అధికారిక గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ‘‘ఇండియాస్ ఫేక్ గ్రోత్ స్టోరీ’’ పేరుతో ప్రాజెక్ట్ సిండికేట్ పోస్ట్ చేసిన ఒక కథనంలో ఆర్థికవేత్త, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక మోడీ తీవ్ర విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత అధికారులు ప్రతికూల స్థూల ఆర్థిక వాస్తవాలను తక్కువ చేసి చూపుతున్నారు. తద్వారా వారు జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు పొగడ్తలతో కూడిన హెడ్లైన్ గణాంకాలను విడుదల చేసి ఉండవచ్చు. కానీ, అత్యధిక మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను కప్పిపుచ్చుతూ వారు ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు. వాస్తవ జీడీపీ గణాంకాలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అసమతౌల్యత పెరుగుతోందని. ఉపాధి కల్పనలో లోటు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విమర్శలను నాగేశ్వరన్ త్రోసిపుచ్చారు. ఇండియన్ కార్పొరేట్, ఫైనాన్షియల్ రంగాలు గత దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న బ్యాలెన్స్ షీట్ ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయని అన్నారు. బ్యాంకుల్లో రెండంకెల రుణ వృద్ధి నమోదవుతోందని, కంపెనీల పెట్టుబడులు ప్రారంభమయ్యాయని ఒక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. -
పదేళ్లలో విద్యుత్ డిమాండ్ డబుల్!
సాక్షి, హైదరాబాద్: మరో పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ అవసరాలతో పాటు గరిష్ట విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి రెట్టింపు కానుంది. 2021–22లో రాష్ట్ర వార్షిక విద్యుత్ అవసరాలు 70,871 మిలియన్ యూనిట్లు(ఎంయూ) కాగా 2031–32లో 1,20,549 ఎంయూలకు పెరగనున్నాయి. 2041–42 నాటికి రాష్ట్ర విద్యుత్ అవసరాలు 1,96,338 ఎంయూలకు ఎగబాకనున్నాయి. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 2021–22లో 14,176 మెగావాట్లుగా నమోదు కాగా, 2031–32 నాటికి 27,059 మెగావాట్లకు పెరగనుంది. 2041–42 నాటికి ఏకంగా 47,349 మెగావాట్లకు చేరనుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) తాజాగా ప్రచురించిన 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. భవిష్యత్తు అవసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలను అభివృద్ధి చేసేందుకు, అమలు చేయాల్సిన ముందస్తు ప్రణాళికల విషయంలో రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేసేందుకు ఈ సర్వేను సీఈఏ నిర్వహిస్తోంది. ఈ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు రాష్ట్రంలో భారీ ఎత్తున విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. కేటగిరీల వారీగా విద్యుత్ వినియోగ శాతం -
ఐఎంఎఫ్ అంచనాలకు మించి భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలు 6.8 శాతం మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు తమ విశ్వాసానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ వరుసగా రెండోసారి తగ్గించింది. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను ఈ నెల మొదట్లో మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఈ నేపథ్యం అనంత నాగేశ్వరన్ సోమవారం చేసిన ఒక ప్రకటనలో తన తాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► భారతదేశ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహుశా ఒక కీలక మైలురాయిని దాటింది. ఇది పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతోపాటు అధిక వృద్ధికి కూడా దోహదపడే అంశం. ► ఆర్థిక, ద్రవ్య విధానలు సాధారణంగా ఒకదానికి మరోటి అనుసంధానమై ఉంటాయి. ఒకదానికొకటి సమతుల్యత కలిగి ఉంటాయి. ► దేశీయ రుణం– జీడీపీ నిష్పత్తి విషయంలో ఆందోళన లేదు. అసెట్ మానిటైజేషన్ (నిరర్ధక ఆస్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం) ఈ నిష్పత్తి మరింత తగ్గుతుంది. క్రెడిట్ రేటింగ్ పెరుగుదల విషయంలోనూ ఇది సానుకూల అంశం. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, తయారీ, నిర్మాణంసహా అన్ని కీలక రంగాలూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. -
ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది
కోల్‌కతా: భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపిస్తోందని, రికవరీ బాటలో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తుండడంపై అప్రమత్త ధోరణిని ప్రకటించారు. స్వదేశీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వర్చువల్ సెమినార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని కీలక రంగాలు.. వ్యవసాయం, తయారీ, నిర్మాణం మంచి పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు డిమాండ్, సేవల రంగం పనితీరు అంచనాలకు మించి ఉన్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు చేస్తోందంటూ, అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఉందని అంగీకరించారు. బ్యాంకింగ్ రంగం తగినన్ని నిధులతో ఉందంటూ, బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం మెరుగునకు ఐబీసీ సాయపడినట్టు చెప్పారు. -
వృద్ధికి కేంద్రం పెట్టుబడులు కొనసాగుతాయ్
ముంబై: మహమ్మారి కోవిడ్–19 మూడవ వేవ్ తర్వాత తిరిగి ఆర్థిక వృద్ధి ఊపందుకోవడానికి కేంద్ర మూలధన వ్యయాలు కొనసాగుతాయని, ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ శుక్రవారం పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఒక బ్యాంకింగ్ కార్యక్రమంలో అన్నారు. పన్నులను తగ్గించడం, ప్రైవేటీకరణ కొనసాగింపు, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం, వాటిని నిర్వహించడం, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తేవడం (మానిటైజేషన్ డ్రైవ్) వంటి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకింగ్– నాన్–బ్యాంకింగ్ నుంచి నిధుల సమీకరణ విషయంలో అనిశ్చితి, ప్రైవేట్ రంగ భాగస్వాముల స్పందనలో ఇంకా పురోగతి లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో వృద్ధి లక్ష్యంగా మరో మార్గంలో కేంద్రం మూలధన వ్యయం కొనసాగుతుందని అన్నారు. 2021–22లో కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయాల విలువ రూ.6 లక్షల కోట్లయితే, ప్రభుత్వం రూ.5.92 లక్షల మేర ఖర్చు చేసిందని అనంత నాగేశ్వరన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.7.5 లక్షల కోట్లు ఖర్చుచేయగలిగితే ఇది ఎకానమీ పురోగతికి సంబంధించి పెద్ద విజయమే అవుతుందని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురయినా ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే, భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కట్టడికి (2–6 శాతం శ్రేణిలో) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్‌ది కీలక పాత్ర అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో బ్యాంకింగ్ తగిన సమర్ధవంతనీయమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రుణాలు మంజూరీలో బ్యాంకింగ్ కొంత అప్రమత్తత అవసరమేనని కూడా అన్నారు. -
క్రూడాయిల్ ధరలు అదే స్థాయిలో ఉంటే జీడీపీపై ప్రభావం..
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి (2022అక్టోబర్–2023 మార్చి) మెరుగుపడతాయన్న ఆశాభావాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ మంగళవారం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్ను తగ్గింపుతో సహా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రైవేట్ రంగం నుండి పెట్టుబడులు గత పలు సంవత్సరాలుగా ఊపందుకోని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) బ్యాంకింగ్ రుణం పుంజుకోవడం ప్రారంభమైంది. అందువల్ల, బహుశా రెండవ త్రైమాసికం చివరి నాటికి లేదా సంవత్సరం రెండవ అర్ధభాగంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం భారీగా పెరుగుతాయని నేను భావిస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (మూలధన వ్యయం)ను 35.4 శాతం పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ. 5.5 లక్షల కోట్లు. ఇది పెట్టుబడుల పురోగతికి దారితీసే అంశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సర్వే ప్రకారం పరిశ్రమ సామర్థ్య వినియోగం 68% నుంచి 74 శాతానికి పెరిగింది. పలు రంగాల్లోని తొలి దిగ్గజ నాలుగు సంస్థలు ఇప్పటికే 80 శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక ఆకాంక్షలు, స్థూల ఆర్థిక స్థిరత్వం, వివేకవంతమైన బడ్జెట్, పారదర్శకత, మూలధన వ్యయంపై దృష్టి వంటి పలు అంశాలు ఎకానమీని తగిన బాటలో సమతౌల్యతతో నడుపుతూ వృద్ధికి దోహదపడతాయి. పేదలకు ఉపశమనం కలిగించేందుకు, ప్రభుత్వం ఉచిత ఆహార కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. దీని వల్ల ఖజానా నుంచి దాదాపు రూ. 80,000 కోట్లు (జీడీపీలో 0.65 శాతం) వ్యయం అవుతుంది. పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్‌లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సంస్థ ఇటీవలే విశ్లేషించింది. ఈ పథకం వల్ల కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్ పేపర్లో పేర్కొంది. మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. సాధారణ కోటా కంటే ఎక్కువగా అదనపు ఉచిత ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద అందించడం జరుగుతోంది. కిలోగ్రాముకు రూ. 2 నుంచి రూ.3 వరకూ అధిక సబ్సిడీ రేటుతో ఈ ప్రయోజనాన్ని పేదలకు కేంద్రం అందిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ ఈ పథకాన్ని పొడిగించింది. ప్రైవేట్ రంగంలో బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటి ప్రతికూలాంశాలను ఇది భర్తీ చేస్తుంది. 2022–23 ద్వితీయార్థంలోకి వెళుతున్నప్పుడు, మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. 2003–2012 మధ్య కాలంలో మనం సాధించిన అధిక వృద్ధిని మరింత స్థిరమైన రూపంలో మళ్లీ చూడగలుగుతామన్న విశ్వాసం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానాన్ని కఠిన తరం చేయడం ప్రస్తుతం ప్రధాన సవాళ్లు. మొండిబకాయిల సమస్య పరిష్కారం దిశలో చర్యలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రస్తుతం దృష్టి సారించాల్సిన అంశాలు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు పన్నుల రూపంలో ఖజానాకు రూ.27.07 లక్షల కోట్లు (అంచనాలు రూ. 22.11 లక్షల కోట్లు) వచ్చి చేరాయి. బడ్జెట్ అంచనాలను మించి ఇవి నమోదు కావడం విశేషం. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం. చమురు ధరలు దీర్ఘకాలం పాటు బ్యారల్‌కు 100 డాలర్ల పైనుంటే, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలపై దీని ప్రభావం పడే వీలుందని సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ అంచనాలను తగ్గించాల్సి రావచ్చని కూడా సూచించారు. ఎకనమిక్ సర్వే ప్రకారం, 2022–23లో ఆర్థికాభివృద్ధి 8 నుంచి 8.5 శ్రేణిలో ఉండవచ్చని(ఇంతక్రితం అంచనా 9.2 శాతం) ఆయన అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాల కొరతల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్రితం 7.8 శాతం అంచనాలను గత వారం ఆర్బీఐ పాలసీ సమావేశాలు 7.2 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. -
ఆర్థిక సలహాదారు అరవింద్ రాజీనామా
-
ఆర్థిక సలహాదారు అరవింద్ గుడ్‌బై
న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ)గా వ్యవహరిస్తున్న అరవింద్ సుబ్రమణియన్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. కుటుంబానికి మరింత సమయం కేటాయించే ఉద్దేశంతో తిరిగి అమెరికా వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. 2019 మే దాకా పదవీకాలం గడువు ఉన్నప్పటికీ అంతకన్నా చాలా ముందుగా వచ్చే రెండు నెలల్లోనే సీఈఏ హోదా నుంచి తప్పుకోనున్నట్లు సుబ్రమణియన్ తెలిపారు. ‘ఈ సెప్టెంబర్‌లో నాకు మనవడో, మనవరాలో పుట్టబోతున్నారు. ఇలాంటి పూర్తి వ్యక్తిగత కారణాల రీత్యా నేను ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను‘ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని సంప్రతించిన తర్వాత అందరికన్నా ముందుగా ప్రధానికే ఈ విషయం తెలియజేసినట్లు సుబ్రమణియన్ వివరించారు. నెలా, రెణ్నెల్ల వ్యవధిలో తాను విధుల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. 2014 అక్టోబర్ 16న కేంద్ర ఆర్థిక శాఖకు సీఈఏగా మూడేళ్ల కాలానికి సుబ్రమణియన్ నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. భవిష్యత్ ప్రణాళికలు.. ప్రస్తుతానికి భవిష్యత్ ప్రణాళికల గురించి వెల్లడించేందుకు సుబ్రమణియన్ నిరాకరించారు. తానేం చేయబోతున్నది మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. కొత్త సీఈఏ ఎంపికకు సంబంధించి అన్వేషణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కాగలదన్నారు. పోటీతత్వాన్ని విశ్వసించే కేంద్ర ప్రభుత్వం .. తన వారసుల ఎంపిక విషయంలోనూ అదే ధోరణిని అనుసరించే అవకాశం ఉందన్నారు. పూర్తికాని ఎజెండా గురించి ప్రస్తావిస్తూ.. ప్రతి రాష్ట్రంలోనూ ఒక సీఈఏ ఉండాలన్నది తన ఆకాంక్షగా ఆయన చెప్పారు. ‘తమ తమ రాష్ట్రాల్లో సీఈఏలాంటి వ్యవస్థ ఉండాలని చాలా మంది ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు. కానీ ఇందుకోసం కావాల్సిన శక్తి సామర్ధ్యాలు, సమయం ప్రస్తుతం నా దగ్గర లేవు. భవిష్యత్‌లో ఇది సాకారం కాగలదని ఆశిస్తున్నాను‘ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. రెండంకెల వృద్ధికి ఆ రెండూ కీలకం.. భారత్ నిర్దేశించుకున్న రెండంకెల స్థాయి వృద్ధి రేటు సాధించాలంటే రెండు అంశాలు కీలకమని సుబ్రమణియన్ తెలిపారు. ముందుగా అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా ఉండాలన్నారు. అలాగే దేశీయంగానూ విధానాలను సంస్కరించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండో అంశం విషయంలో తగు చర్యలు తీసుకుంటోందని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. భారత్ నిస్సందేహంగా రెండంకెల స్థాయి వృద్ధి రేటును అందుకోగలదన్నారు. ప్రస్తుతం మినహాయింపు పొందుతున్న రంగాలన్నీ కూడా వస్తు, సేవల పన్నుల పరిధిలోకి వస్తే శ్రేయస్కరమని, జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుబ్రమణియన్ చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాలపై స్పందిస్తూ.. ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనగలిగేలా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ముందుగానే వెల్లడించిన జైట్లీ .. సీఈఏ హోదా నుంచి తప్పుకుంటున్నట్లు సుబ్రమణియన్ ప్రకటించడానికి ముందుగానే ఆయన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్లో పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘కొద్ది రోజుల క్రితం సీఈఏ అరవింద్ సుబ్రమణియన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నాతో మాట్లాడారు. కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉన్నందున తిరిగి అమెరికా వెళ్లిపోదల్చుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కారణాలు వ్యక్తిగతమైనవి, చాలా ముఖ్యమైనవి. దీంతో నేను ఆయనతో ఏకీభవించక తప్పలేదు‘ అంటూ ఫేస్బుక్లో అరుణ్ జైట్లీ పోస్ట్ చేశారు. గతేడాదే పదవీకాలం ముగిసిపోయినప్పటికీ తన విజ్ఞప్తి మేరకు అరవింద్ సుబ్రమణియన్ మరికొంత కాలం సీఈఏగా కొనసాగేందుకు అంగీకరించారని జైట్లీ చెప్పారు. అత్యంత ప్రతిభావంతుడైన సుబ్రమణియన్ నిష్క్రమణ తీరని లోటుగా జైట్లీ అభివర్ణించారు. ఎరువులు, విద్యుత్ తదితర రంగాల్లో సంస్కరణల అమలుకు సంబంధించి కీలక సూచనలతో ఆయన తోడ్పాటు అందించినట్లు తెలిపారు. సుబ్రమణియన్ తప్పుకోవడం ఊహించిందే: కాంగ్రెస్ సీఈఏగా అరవింద్ సుబ్రమణియన్ నిష్క్రమణ ఊహించిందేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అత్యంత భారీ స్థాయి ఆర్థిక అరాచకత్వాన్ని’ భరించలేకే మోదీ ప్రభుత్వంలోని ’ఆర్థిక నిపుణులు’ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్చార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. అరవింద్ పనగారియా, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మొదలైన వారు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కరుగా కీలక వ్యక్తుల నిష్క్రమణ.. పదవీకాలం ముగియడానికి ముందుగానే ఇటీవల వైదొలిగిన కీలక ఆర్థిక సలహాదారుల్లో అరవింద్ సుబ్రమణియన్ రెండో వారు కానున్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా 2017 ఆగస్టులో తప్పుకున్నారు. ఆయన కూడా పదవీకాలం మరో రెండేళ్లు ఉండగానే వైదొలిగారు. ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక వీరిద్దరినీ ఆయా హోదాలకు ప్రత్యేకంగా ఎంపిక చేసింది. అయితే పదవీకాలం పూర్తికాకుండానే ఇద్దరూ వ్యక్తిగత కారణాలతో వైదొలగడం గమనార్హం. కొంగొత్త ఐడియాల అమలు .. సీఈఏగా అరవింద్ సుబ్రమణియన్ పలు వినూత్న ఐడియాలను అమలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా తొలి ఆన్లైన్ కోర్సును నిర్వహించారు. అలాగే, ఆన్లైన్ విద్యకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే ’స్వయం’ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. అలాగే సంపన్నులకు క్రమంగా సబ్సిడీలు తొలగించడం, వాతావరణంలో పెను మార్పులు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తదితర అంశాలపై ఆయన పలు కీలక సూచనలు చేశారు. -
ఏడో దశ కేటీపీ‘ఎస్’!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ ప్లాంట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన బాయిలర్‌ను తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు బుధవారం ఉదయం 8.46 గంటలకు వెలిగించారు. ఉత్తరాంచల్ రాష్ట్రం హరిద్వార్‌లో బీహెచ్ఈఎల్ తయారు చేసిన భారీ జనరేటర్‌తో బాయిలర్‌ను అనుసంధానం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన తొలి విద్యుత్ ప్లాంట్‌గా కేటీపీఎస్ ఏడో దశ ప్రాజెక్టు నిలవనుంది. రూ.5,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 జనవరి 1న ప్రారంభించారు. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం ప్రారంభించిన 48 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి. అయితే కొత్తగూడెం ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. దేశంలో మరెక్కడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్ ఏడో దశ ఉత్పత్రి ప్రారంభించిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 15 వేల మెగావాట్లు దాటుతుంది. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు రాధాకృష్ణ, సచ్చిదానందం తదితరులు పాల్గొన్నారు. 17 వేల మెగావాట్లు: ప్రభాకర్ రావు 28 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రచించి, తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యం మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు వెల్లడించారు. కేటీపీఎస్ ఏడో దశ, భద్రాద్రి ప్లాంట్లను సందర్శించి.. పనుల పురోగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రానికి 17 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 6,573 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేదని, ఇప్పుడు దాన్ని 14,972 మెగావాట్లకు చేర్చగలిగామని, ఇందులో 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉందన్నారు. మార్చి 31 నాటికి కేటీపీఎస్ నుంచి 800 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 31 నాటికి 1,080 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భద్రాద్రి ప్లాంటు నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. డిసెంబర్ నాటికి మరింత సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణం లో భాగంగా బాయిలర్‌ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
విద్యుత్ వివాదంపై సమావేశం వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ వివాదాలపై ఈ నెల 23న న్యూఢిల్లీలో జరగాల్సిన విద్యుత్ ప్రాధికార అథారిటీ (సీఈఏ) సమావేశం వాయిదా పడింది. కృష్ణపట్నం, హిందూజాతో పాటు విద్యుత్ వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు రావాలని సీఈఏ రెండు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులను కోరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా తాము రాలేమని ఏపీ ఇంధన శాఖ సీఈఏకు చెప్పిందని సమాచారం. దీంతో సమావేశాన్ని వాయిదా వేసిన సీఈఏ, తదుపరి భేటీ ఎప్పుడన్నది వెల్లడించలేదు. -
తెలంగాణ వాదనలపై మీ వైఖరేంటి?
ఏపీ ఇంధన శాఖకు సీఈఏ కమిటీ లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుతోపాటు కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కేటాయింపు తదితర విషయాల్లో తెలంగాణ ఇంధనశాఖ లేవనెత్తిన అంశాలపై వైఖరి తెలియజేయాలని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) కమిటీ.. ఏపీ ఇంధనశాఖను కోరింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు సీఈఏ చైర్పర్సన్ నీర్జా మాథూర్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ఇప్పటివరకు రెండుసార్లు సమావేశమైంది. ఆగస్టు 4న జరిగిన సమావేశంలో తెలంగాణ ఇంధనశాఖ వినిపించిన కొత్త వాదనలపై ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని తాజాగా సీఈఏ కమిటీ కోరింది. వీటిపై తమ పాత వైఖరికే కట్టుబడి ఉన్నట్టు తెలపాలని ఏపీ నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో కమిటీకి సమాధానం పంపనున్నట్టు తెలిసింది. ఏపీ నుంచి సమాధానం అందడంతోపాటు అటార్నీ జనరల్ నుంచి న్యాయసలహా వచ్చిన తర్వాత కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు సీఈఏ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం ఆదేశాలను ఇరు రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. ఎవరైనా కేంద్రం ఆదేశాలను వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశమూ లేకపోలేదు. తెలంగాణ లేవనెత్తిన అంశాలు.. ఏపీ వైఖరి * శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటులో తెలంగాణ జెన్కోతోపాటు తెలంగాణ డిస్కంల(టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్)కు ఎక్కువ వాటా ఉంది. ప్లాంటు నిర్వహణను తెలంగాణకే ఇవ్వాలి. ఏపీ వైఖరి: విభజన చట్టం మేరకు ఎక్కడి ప్లాం ట్లు ఆ ప్రాంతానికే చెందుతాయి. కృష్ణపట్నం ప్లాంటు ఏపీ జెన్‌కోకే చెందుతుంది. * కర్నూలు, అనంతపురం జిల్లాలోని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తెలంగాణకూ వాటా ఇవ్వాలి. ఏపీ వైఖరి: ఈ రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్సీఈ ప్లాంటు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికే విద్యుత్ అని ఉమ్మడి రాష్ర్టంలోనే ఉత్తర్వులిచ్చారు. * కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కేటాయింపులను సవరించడం కుదరదు. ఏపీ వైఖరి: సీజీఎస్ కోటా కేటాయింపులో లోపాలు జరిగాయి. ఈ విషయాన్ని మొదటి సమావేశంలో తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. అందువల్ల సీజీఎస్ కోటాలో ఏపీకి కేటాయింపులు పెరగాలి. అదనంగా 1.77 శాతం (65 మెగావాట్లు) ఏపీకి ఇవ్వాలి.