విద్యుత్ వివాదంపై సమావేశం వాయిదా | meeting postponed on power row | Sakshi
Sakshi News home page

విద్యుత్ వివాదంపై సమావేశం వాయిదా

Published Mon, Dec 22 2014 2:52 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

meeting postponed on power row

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ వివాదాలపై ఈ నెల 23న న్యూఢిల్లీలో జరగాల్సిన విద్యుత్ ప్రాధికార అథారిటీ (సీఈఏ) సమావేశం వాయిదా పడింది. కృష్ణపట్నం, హిందూజాతో పాటు విద్యుత్ వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్న విషయం తెలిసిందే.

పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు రావాలని సీఈఏ రెండు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులను కోరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా తాము రాలేమని ఏపీ ఇంధన శాఖ సీఈఏకు చెప్పిందని సమాచారం. దీంతో సమావేశాన్ని వాయిదా వేసిన సీఈఏ, తదుపరి భేటీ ఎప్పుడన్నది వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement