సాక్షి, హైదరాబాద్: మరో పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ అవసరాలతో పాటు గరిష్ట విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి రెట్టింపు కానుంది. 2021–22లో రాష్ట్ర వార్షిక విద్యుత్ అవసరాలు 70,871 మిలియన్ యూనిట్లు(ఎంయూ) కాగా 2031–32లో 1,20,549 ఎంయూలకు పెరగనున్నాయి. 2041–42 నాటికి రాష్ట్ర విద్యుత్ అవసరాలు 1,96,338 ఎంయూలకు ఎగబాకనున్నాయి. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 2021–22లో 14,176 మెగావాట్లుగా నమోదు కాగా, 2031–32 నాటికి 27,059 మెగావాట్లకు పెరగనుంది. 2041–42 నాటికి ఏకంగా 47,349 మెగావాట్లకు చేరనుంది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) తాజాగా ప్రచురించిన 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. భవిష్యత్తు అవసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలను అభివృద్ధి చేసేందుకు, అమలు చేయాల్సిన ముందస్తు ప్రణాళికల విషయంలో రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేసేందుకు ఈ సర్వేను సీఈఏ నిర్వహిస్తోంది. ఈ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు రాష్ట్రంలో భారీ ఎత్తున విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది.
కేటగిరీల వారీగా విద్యుత్ వినియోగ శాతం
Comments
Please login to add a commentAdd a comment