Polavaram Project Status 2022: Radial Gates Alignment Completed - Sakshi
Sakshi News home page

Polavaram Project Status: పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తి

Published Sun, Mar 13 2022 12:27 PM | Last Updated on Sun, Mar 13 2022 1:15 PM

Polavaram Project:Radial Gates  Alignment Completed - Sakshi

సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం అవిష్కృతమయ్యింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. గత సీజన్‌లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు.

మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement