‘ఆర్థిక ప్యాకేజీని పునఃపరిశీలించండి’ | Rahul Gandhi Said Reconsider Economic Package | Sakshi
Sakshi News home page

అప్పుడే ప్యాకేజీకి సార్థకత : రాహుల్‌ గాంధీ

Published Sat, May 16 2020 1:05 PM | Last Updated on Sat, May 16 2020 1:08 PM

Rahul Gandhi Said Reconsider Economic Package - Sakshi

న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం ఈ ప్యాకేజీపై స్పందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. దేశం తరఫున మాట్లాడుతున్నాను. ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించి చాలా మంచి పని చేసింది. అయితే ఈ ప్యాకేజీ స్వభావం గురించి నాకు తీవ్రమైన ఆక్షేపన ఉంది. ప్రభుత్వం ప్యాకేజీని పునఃపరిశీలించాలి. దీనిలో కేటాయించిన డబ్బును ఎక్కువ శాతం అవసరమున్నవారికి, వలస కూలీలకు, రైతులకు అందేలా చూడాలి. డబ్బును నేరుగా ప్రజల చేతిలో పెట్టడం ముఖ్యం. అప్పుడే ఈ ప్యాకేజీకి సార్థకత’ అన్నారు రాహుల్‌.(రైతులకు 2 లక్షల కోట్లు)

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement