
లక్నో: ప్రతిపక్ష నాయకురాలు ప్రియాంక గాంధీ అభ్యర్థన మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బస్సు నంబర్లతో పాటు డ్రైవర్లకు సంబంధించిన వివరాలను ప్రియాంక గాంధీ కార్యాలయానికి పంపించారు. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వలస కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది వలస కూలీలు మరణించగా.. 36మంది గాయపడ్డారు.(బారికేడ్లను బద్దలు కొడుతూ..)
ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వలస కూలీల కోసం బస్సులను ఏర్పాటు చేయాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ.. ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రియాంక అభ్యర్థనపై స్పందించిన యోగి ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులను ఏర్పాటు చేసింది.(చితికిన బతుకులు)
Comments
Please login to add a commentAdd a comment