లక్నో : వలస కూలీలను ప్రత్యేక రైళ్లలో స్వస్ధలాలకు తరలించేందుకు వారి వద్ద నుంచి చార్జీలు వసూలు చేయడంపై ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. పేదలను వారి స్వస్థలాలకు తరలించేందుకు చార్జీలను వసూలు చేయడాన్ని బీజేపీ మద్దతుదారులు ఇప్పుడు ఆలోచించాలని, పీఎం కేర్స్ ఫండ్‌కు వచ్చిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరోవైపు ఆరోగ్య సేతు యాప్ కోసం రూ వంద వసూలు చేస్తున్నారని ప్రచారం సాగుతోందని అఖిలేష్ ట్వీట్ చేశారు. ఇక కోవిడ్-19 ఆస్పత్రులపై పూలు చల్లడాన్ని ప్రస్తావిస్తూ పలు క్వారంటైన్ సెంటర్లలో అసమర్ధ నిర్వహణపై వార్తలు వస్తున్న క్రమంలో ఈ హడావిడి ఎందుకని మరో ట్వీట్‌లో ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment